ఎవరి నోట విన్నా ఇదే మాట. దేశంలో ఇప్పటివరకూ జరిగిన రాష్ట్రాల విభజనల్లో రాజధాని ఉన్న ప్రాంతం విడిపోవాలని కోరుకోలేదని, విడిపోయినవన్నీ ఓ మూలగా ఉన్న ప్రాంతాలేనని చాలామంది పెద్దలు సెలవిస్తున్నారు. చివరకు మొన్న మీడియా సమావేశంలోనూ సీఎం కిరణ్ ఇదే మాట వల్లించారు. వీరందరి వాదనా భాగానే ఉంది. కానీ నాకు అర్థం కాని విషయం ఒక్కటే..
ఆంధ్ర, తెలంగాణ కలిసినప్పుడు హైదరాబాద్ ను వీరేమైనా తెచ్చి తెలంగాణకు ఇచ్చారా..? ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాతే, హైదరాబాద్ రాజధాని అయ్యిందా..?
రెండింటికీ సమాధానం ఒక్కటే. అసలు ఆంధ్ర నుంచి తెలంగాణ ఎందుకు విడిపోవాలి..? తెలంగాణ ప్రాంతం ఏమీ ఆంధ్రతో కలవడానికి ఎగబడలేదే.. నిబంధనలు పక్కనపెట్టి ఆంధ్రప్రాంతంతో కలవలేదే.. ఆంధ్ర ప్రాంతమే కదా కోరి కోరి వచ్చిమరీ హైదరాబాద్ తో కలిసింది. అందుకని, ఇప్పుడున్న రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోవాల్సిన అవసరం లేనేలేదు. ప్రస్తుత రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతాన్నే విడదీస్తే సరిపోతుంది. అప్పుడు, రాజధానికి దూరంగా ఉన్న ప్రాతం విడిపోతుంది కాబట్టి, రాజధాని విషయంలో గొడవే ఉండదు. తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ అన్న పేరే ఉంచొచ్చు (రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తైన తర్వాత కావలంటే తెలంగాణగా మార్చుకోవచ్చు (ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ అయినట్లు, ఒరిస్సా ఒడిషా అయినట్లు). ఇక కొత్తగా ఏర్పాటు చేసే ఆంధ్ర ప్రాంతానికి రెండు ప్రాంతాల వారికీ ఆమోదయోగ్యంగా సీమాంధ్ర అన్న పేరుపెట్టొచ్చు. దీంతో గొడవే ఉండదు..
10, ఆగస్టు 2013, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి