ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆశలన్నీ అడియాశలై.. తీవ్ర నిరుత్సాహంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ కు భవిష్యత్తులో మరిన్ని చిక్కులు చుట్టుముట్టు అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఎంపీలు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుకలు టీడీపీలోకి జంప్ చేయడం కూడా జగన్ కు ఇబ్బందికరంగానే మారింది. ఒకప్పుడు కాంగ్రెస్ ను, టీడీపీని బలహీన పరచడానికి వైఎస్సార్, జగన్ ను ఏ సూత్రాన్నైతే పాటించారో అదే సూత్రం ఇప్పుడు బూమరాంగ్ లా తిరిగి వైసీపీని కుదిపేస్తోంది.
పార్టీ నేతలు ఎక్కడ జంప్ చేస్తారో అన్న భయంతో ఇడుపులపాయలో నిర్వహించిన సమావేశంలోనే అందరితో ప్రమాణం చేయించారు జగన్. ఎవరం పార్టీ మారమని, వైసీపీతోనే కొనసాగుతామని ప్రతీ ఒక్కరి నోటితోనూ చెప్పించారు. అది జరిగి నాలుగు రోజులైనా కాకుండానే ఒట్టు తీసి గట్టుమీద పెట్టేశారు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక. ఫ్యాన్ స్విచ్ ఆపేసి సైకిల్ ఎక్కేశారు. వీరిపై వేటు తప్పదని వైసీపీ నేతలు చెబుతున్నా, అది ఎప్పటికవుతుందన్నది ఎవరికీ అర్థం కాని విషయమే. ఎందుకంటే, అనర్హత మీద నిర్ణయం తీసుకోవాల్సింది లోక్ సభ స్పీకర్. కానీ, వైసీపీకి వ్యతిరేకమైన బీజేపీ-టీడీపీ కూటమి అధికారంలో ఉండడంతో, వైసీపీ చేసే ఫిర్యాదుపై ఎంతవరకూ చర్యలుంటాయన్నది సందేహమే.
ఇక మిగిలిన నేతలు ఎప్పుడు పార్టీ గోడ దూకేస్తారో అన్న టెన్షన్ జగన్ కు ఉంటూనే ఉంటుంది. ప్రతీ నేతనూ అనుమానిస్తూనే ఉండాలి. ఇక పొరపాటున సీబీఐ కేసులు ముందుకు సాగి, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తే మాత్రం ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడం ఖాయం. ఈ టెన్షన్లతో సతమతమవుతున్న జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారనే చెప్పాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి