19, జూన్ 2013, బుధవారం
టీవీ 9 నీతులు మాత్రమే చెబుతుందా..?
Categories :
entertainment . heroin . hot photos . publicity . TOP . tv9 . websites
జనానికి నీతులు చెప్పడంలో (వాళ్లు పాటిస్తారా లేదా అన్నది తర్వాతి సంగతి) ఎప్పుడూ ముందుండే టీవీ9, ఇప్పుడు మరో కొత్త ప్రచారం మొదలుపెట్టింది. పసిపిల్లలపై రేప్ లకు పురిగొల్పుతున్న అశ్లీల వెబ్ సైట్లను ఐఎస్ పీ ల దగ్గరే బ్లాక్ చేయాలని, అందుకని టీవీ చేసే మహోద్యమంలో భాగస్వాములు కావాలని ఎడాపెడా ప్రోమోలు ఇస్తోంది. టీవీ9 హౌజ్ నుంచే వచ్చే తొలివెలుగు వెబ్ సైట్ లోనూ ఆర్టికల్ ను పెట్టింది. అంతవరకూ బాగానే ఉంది, మరి టీవీ9 అశ్లీలానికి దూరంగా ఉందా, జనానికి నీతులు చెప్పేముందు వాటిని తాము పాటిస్తున్నామో లేదో చూసుకోవాల్సిన పనిలేదా.
టీవీ9 తొలివెలుగు వెబ్ సైట్ దేనికి ఫేమస్సో అందరికీ తెలిసిందే. రెచ్చగొట్టే తరహాలో హెడ్ లైన్లు పెట్టడం, నాలుగు లైన్ల స్టోరీకి హీరోయిన్ల అర్థనగ్న ఫోటోలను అరడజను వాడడంలో తొలివెలుగును మించిన సైట్ మరొకటి లేదు. టాలీవుడ్ కు సంబంధించి హీరోహీరోయిన్ల గాసిప్పులను రాసే వెబ్ సైట్లు వేటిల్లోని కనపడనని హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ ఫోటోలు తొలివెలుగులో మాత్రమే కనపడతాయి. పైగా స్టోరీకి, ఫోటోలకు అణువైనా సంబంధం అన్నదే ఉండదు. తాజాగా పవన్ కళ్యాణ్ సరసన నటించిన నికిషా పటేల్, ఈజిప్ట్ టూర్‌కు వెళ్దామనుకునే సరికి ఆమె పెంచుకుంటున్న చిలుక పారిపోయిందట. అప్ సెట్ అయి టూర్ క్యాన్సిల్ చేసుకుందట. దానికి టీవీనైన్ వారి తొలివెలుగు పెట్టిన క్యాప్షన్, వాడిన ఫోటోలు చూడండి.
బట్టలు విప్పుకోవడాన్నే నమ్ముకున్న పూనంపాడే ఏం చేసినా, భారీగా రాసే తొలివెలుగు, ఆ అమ్మడి అర్థనగ్న చిత్రాలను తెగ వాడేసుకుంటుంది. 18 ఏళ్ల కుర్రాడితో పాడుపని అంటూ ఎలాంటి ఫోటోలు, వార్త రాసిందో చూడండి..
ఇక వార్తల్లో వాడే భాషలోనూ తొలివెలుగుది నీచమైన సంస్కృతే. పూజా చోప్రా మోసం చేసిందంటూ ఓ కథనం రాసింది. జ్యుయలర్స్ ను మోసం చేసిందని చెప్పడానికి వారు మొదటి లైన్లో వాడిన వాక్యం.."చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు" అట. ఇదేనా టీవీ9 టీమ్ సంస్కారం. మోసానికి దొమ్మరి గుడిసెల్లో దూరడానికి సంబంధం ఏమిటి.. పైగా ఆ స్టోరీకి వాడిన ఫోటోలు కూడా చూడండి..
ఈ అర్ధనగ్న ఫోటోలు జనాన్ని రెచ్చగొట్టవా.. ? అశ్లీలాన్ని మరింతగా ప్రోత్సహించవా ? నీతులు చెప్పేముందు తాము కూడా వాటిని పాటించాలన్న విషయాన్ని టీవీ9 పెద్దలు తెలుసుకుంటే మంచిది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి