25, జనవరి 2013, శుక్రవారం
కేసీఆర్ పార్టీలోకి కోమటిరెడ్డి?
వైఎస్సార్ సీపీలోకి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు రూటు మార్చారు. జగన్ జైలు నుంచి ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించకపోవడం... జగన్ సెంటిమెంట్ తో పోల్చితే, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటే ఎక్కువగా వర్కవుట్ అయ్యేలా కనిపించడంతో, గులాబీ తీర్థం పుచ్చుకుంటేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణపై ఇప్పుడే నిర్ణయం ప్రకటించలేమని ఆజాద్ చెప్పేసిన తర్వాత, పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. కాంగ్రెస్ విషకౌగిలి నుంచి తెలంగాణ ప్రాంత నేతలు బయటకు రావాలని కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో జరిగిన ఈ భేటీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఆర్ఎస్ లోకి రావాలంటూ కోమటిరెడ్డికి కేసీఆర్ అహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ నెల 28 తర్వాత దీనిపై కోమటిరెడ్డి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అంతేకాదు, సోదరులిద్దరూ టీఆర్ఎస్ లోకి వచ్చేస్తారా.. లేక.. ఒకరు జగన్ పార్టీలోకి, మరొకరు టీఆర్ఎస్ లోకి వచ్చి రెండు సెంటిమెంట్లను ఉపయోగించుకుంటారా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి