1, మార్చి 2012, గురువారం
ఏసుక్రీస్తును ఉంచిన శవపేటిక దొరికిందా..?
క్రైస్తవులకు ఆరాధ్య దైవం ఏసుక్రీస్తు తుదివిశ్రాంతి తీసుకున్న సమాధికి సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలను పురావస్తు పరిశోధకులు సంపాదించారు. వారి చెబుతున్న దాని ప్రకారం.. అక్కడ ఏసు పార్ధివదేహాన్ని ఉంచిన శవపేటిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జెరూసలేంలో కొన్నాళ్లుగా సాగుతున్న పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. సున్నపురాళ్లతో తయారు చేసిన శవపేటికల్లో ఒకదానిపై గ్రీక్ భాషలో నాలుగు వరుసల్లో ఓ వాక్యం రాసుంది. దాని అర్థం.. Divine Jehovah, raise up, raise up'. దీన్ని బట్టి.. ఇది ఏసును ఉంచిన శవపేటిక అయ్యి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ఇక రెండో బాక్స్ పై నోటిలో కర్రను పట్టుకున్న చేప బొమ్మ ఉంది. 1980లో పరిశోధకులు కనిపెట్టిన ఏసుకుటుంబానికి చెందినవిగా భావించే సమాధులకు 200 అడుగుల దూరంలో ఈ కొత్త సమాధిని కనిపెట్టారు. అయితే.. అప్పట్లో దానిపై వివాదం చెలరేగడంతో.. తవ్వకాలను నిలిపివేసి.. అక్కడ పెద్ద భవనాన్ని నిర్మించారు. అయితే.. 2010 సంవత్సరంలో కొంతమంది ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని,
రాబోటిక్ ఆర్మ్ సహాయంతో అధునాతన కెమెరాను భూమిలోకి పంపించి పరిశోధన కొనసాగించారు. వారే.. ఏసు చివరివిశ్రాంతి ప్రాంతాన్ని కనిపెట్టారు. అయితే.. ఎంతవరకూ నిజమన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి డైలీమెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ లింక్..
http://www.dailymail.co.uk/sciencetech/article-2107591/Jesus-discovery-Does-1st-Century-coffin-lid-Jerusalem-reveal-Jesus-resting-place.html#ixzz1niYOMA8W
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి