8, ఫిబ్రవరి 2012, బుధవారం
డీఎల్ వివాదం2 : కిరణ్ గుట్టు డీఎల్ విప్పుతారా..?
Categories :
cm . congress . dl ravindra reddy . jagan . kiran kumar . POLITICS . TOP
కేబినెట్లో మార్పులో కస్సుబుస్సు మంటున్న మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి.. సీఎం కిరణ్తోనే నేరుగా తలపడడానికి సిద్ధమయ్యారు. పార్టీకి రాజీనామా చేయాలని భావిస్తున్న ఆయన.. సీఎం లోటుపాట్లను జనం ముందు పెట్టాలనుకుంటున్నారు. 108 వివాదం వల్లే తనను పక్కన పెట్టి, ఆ బాధ్యతను కిరణ్, తన విశ్వాసపాత్రుడైన కొండ్రు మురళికి అప్పజెప్పారని డీఎల్ భావిస్తున్నారు. జీవీకేతో ఒప్పందాన్ని మొదటినుంచి డీఎల్ వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో నడుస్తున్న సేవలపై ప్రైవేటు పెత్తనాన్ని ఆయన ఒప్పుకోవడం లేదు. దీనివల్లే ఈ ఒప్పందం విషయంలో చాలాకాలంగా సంక్షోభం కొనసాగుతోంది. అయితే, ఈ ఒప్పందం విషయంలో కిరణ్ గుట్టును డీఎల్ విప్పబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటే, జగన్కు కిరణకు మధ్య ఉన్న సంబంధాలను జనానికి చెప్పుతారని డీఎల్ వర్గం సంకేతాలిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి