8, ఫిబ్రవరి 2012, బుధవారం
డీఎల్ వివాదం1: మంత్రి పదవికి, కాంగ్రెస్కు డీఎల్ రాజీనామా?
Categories :
cm . congress . dl ravindra reddy . kiran kumar . POLITICS . TOP
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కాంగ్రెస్లో కుమ్ములాటలను మరింత పెంచింది. తన శాఖను కత్తిరించడంపై ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న డీఎల్ రవీంద్రారెడ్డి, సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. శాఖా పరిధిని తగ్గించే బదులు, మంత్రి పదవినుంచే తొలగిస్తే ఆనందించేవాడినన్న డీఎల్, భవిష్యత్తు విషయంలో సీరియస్గా ఆలోచిస్తున్నారు. తన అనుచరులతో సంప్రదింపులు జరిపారు. మంత్రి పదవికే కాక, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ను వదిలి, టీడీపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఆయన అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. మరికాసేపట్లో పీసీసీ చీఫ్ బొత్సను కలిసి ఆయనకు ఈ విషయాలను చెప్పే అవకాశం ఉంది. సీఎంకు, డీఎల్ కు చాలా కాలంగా పొసగడం లేదు. దీంతో, తనకు పార్టీలో మరింత అవమానం జరుగుతుందని భావిస్తున్న డీఎల్, ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2004లోనే, మైసూరారెడ్డితో కలిసి డీఎల్ కూడా టీడీపీలో చేరాలని భావించారు. కానీ, చివరి నిముషంలో మనసు మార్చుకున్నారు. డీఎల్ చేరికపై టీడీపీ నుంచి మాత్రం ఇంతవరకూ ఎలాంటి సమాచారమూ లేదు.. బొత్స ను కలిసిన తర్వాత పూర్తి వివరాలను
సీఎల్పీ నుంచే ప్రెస్ మీట్ పెట్టి డీఎల్ చెప్పే అవకాశం ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి