8, ఫిబ్రవరి 2012, బుధవారం
డీఎల్ వివాదం ౩ : పదవుల కోసం ఢిల్లీకి సూట్ కేసులు మోసింది ఎవరు?
Categories :
cm . congress . dl ravindra reddy . jagan . kiran kumar . POLITICS . TOP
కేబినెట్ విస్తరణ నేపథ్యంలో రాజీనామా చేస్తానన్న వార్తలను మంత్రి డీఎల్ ఖండించారు. తాను రాజీనామా చేయడం లేదన్నారు. పార్టీకి ద్రోహం చేసే ఆలోచన తనకు లేదని ప్రకటించారు. అయితే, తన మనసులో అసంతృప్తిని మాత్రం వెళ్లగక్కారు. పరోక్షంగా సీఎంపై విమర్శలు కురిపించారు. మంత్రిగా తాను ఎలాంటి తప్పు చేయలేదన్న డీఎల్... ఉన్నత పదవుల్లో ఉన్నకొందరు చెప్పిన పనులు తాను చేసి ఉండకపోవచ్చన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తప్పు చేయమంటే తాను చేయనని, అబద్ధాలు చెప్పనని స్పష్టం చేశారు. అంతేకాదు.. పదవుల కోసం సూట్ కేసు పట్టుకుని చెన్నై, ముంబై మీదుగా ఢిల్లీ వెల్లనని కూడా ప్రకటించారు డీఎల్. అయితే.. ఆ ఉన్నత స్థాయిలో ఉండి తప్పు చేయమన్నది ఎవరు..? పదవుల కోసం సూట్ కేసు పట్టుకుని ఢిల్లీ వెళ్లింది ఎవరన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఈ వ్యాఖ్యలు చేసింది... సీఎం కిరణ్ ను ఉద్దేశించేనా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి