16, జనవరి 2012, సోమవారం
మిస్టర్ పర్ఫెక్ట్లు ఉన్నారా..?
మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు..?
హీరో ప్రభాస్‌లా ఉంటే మిస్టర్ పర్ఫెక్ట్ అయిపోతారా..?
అమ్మాయిలను పడేయాలంటే మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకోవాల్సిందేనా...?
అసలు, ప్రపంచంలో మిస్టర్ పర్ఫెక్ట్లు ఉన్నారా..?
స్మార్ట్‌గా.. సిక్స్‌ప్యాక్‌తో ఉంటే.. పర్ఫెక్ట్గా ఉన్నట్లేనన్నది చాలామందికున్న కామన్ ఒపీనియన్. అమ్మాయిలు కూడా ఇలాంటి వారితో 100 పర్సెట్ లవ్‌కు సిద్ధమవుతారన్న అభిప్రాయమూ ఉంది. కానీ.. ఇదంతా రాంగ్ అంటోంది ఓ సర్వే.
మిస్టర్ పర్ఫెక్ట్ అనే మనిషే లేడంటున్నారు మన ఆడవాళ్లు. ఎంత మంచోడిని చూపించినా.. ఏదో ఓ లోపాన్ని ఎత్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కండలు పెంచేవారు అసలు... పర్ఫెక్టే కాదని తేల్చేస్తున్నారు. మంచి పర్సనాలిటీతో పాటు.. సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉండాలని, వాటితో పాటు మరో 20 లక్షణాలు ఉంటేనే మిస్టర్ ఫర్ఫెక్ట్ అవతారని చెబుతున్నారు. ఈ 20 లక్షణాల్లో, తల్లిచెప్పినట్లు వినకపోవడం, భార్య స్నేహితులను గౌరవించడం, టాయిలెట్‌ను శుభ్రంగా ఉంచడం, వేగంగా బండి నడపకపోవడం, కుక్కలంటే ఇష్టపడడం, ఇంటిపనిలో సాయపడడం, గోళ్లు ఎప్పటికప్పుడు తీసుకోవడం.. వంటి చిన్న చిన్న విషయాలు చాలానే ఉన్నాయి.. వీటన్నింటిలోనూ పాస్ అయినవారే మిస్టర్ ఫర్ఫెక్ట్ అంటున్నారు.
రెమింగ్టన్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో.. అసలు మిస్టర్ ఫర్ఫెక్ట్ తమకింతవరకూ తారసపడలేదని మహిళలు చెప్పారట.. సో..అబ్బాయిలూ.. మిస్టర్ పర్ఫెక్ట్ అని మీకు మీరు మురిసిపోవడం కాదు.. ఒక్క అమ్మాయితోనైనా అలా అనిపించుకోండి.. చూద్దాం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి