27, అక్టోబర్ 2011, గురువారం
నల్లారి వారి జాబ్ మేళా..!
Categories :
cm . kiran kumar . POLITICS . TOP
మాటలు చెప్పడమే కాదు.. చేతలు చేయడమూ తెలుసని నిరూపిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏడాదికి లక్ష ఉద్యోగాలు అందిస్తామని ప్రకటించిన సీఎం, ఆచరణలో ముందడుగు వేశారు. 13752 టీచర్ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపారు. అయితే, ఏ సీఎం చేయని పనిని కిరణ్ కుమార్ ఎందుకు చేస్తున్నారు..? ఉద్యోగాల కల్పనపైనే ఎందుకు దృష్టి పెట్టారు..? దానికి కారణం ఏమైనా ఉందా..?
రాష్ట్రం అశాంతితో రగులుతోంది. ప్రత్యేక, సమైక్య ఉద్యమాలతో అల్లకల్లోలంగా ఉంది. దీనికి తోడు అనూహ్యంగా సీఎం పదవిని అందుకున్న కిరణ్‌కుమార్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీపైనా, రాష్ట్రంపైనా పూర్తిస్థాయిలో ప్రభావం చూపేంత ఇమేజ్ లేదు. పైగా కిరణ్‌కుమార్ ముందు కొలమానంలా వైఎస్ పాలన ఉంది. వైఎస్‌లా ప్రజాబలం పెంచుకుంటేనే తన రాజకీయజీవితం అత్యున్నతస్థాయిలో సాగుతుందన్నది సీఎం అభిప్రాయం. అందుకే ఆయన ప్రజాకర్షక పథకాలపై దృష్టిపెట్టారు. జాబ్‌మేళాలతో యువతను ఉద్యమాలనుంచి దూరం చేయాలనుకుంటున్నారు. టీచర్‌పోస్టులను ఈ విద్యాసంవత్సరం చివరిలోగా భర్తీ చేయాలన్నది ప్రణాళిక. దీంతో పాటే ఇతర రంగాల్లోనూ ఖాళీల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి. త్వరలోనే వరసగా నోటిఫికేషన్లు రావచ్చు. రూపాయికే కిలో బియ్యం వంటి పథకాలతో జనాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారు. సీఎం ప్లాన్లు ఎందుకోసమన్నది పక్కనపెడితే, వాటివల్ల నిరుద్యోగులకు ఉపాధి లభించడమే కాదు, పేదలకూ పట్టెడన్నం దొరుకుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి