7, సెప్టెంబర్ 2011, బుధవారం
రైలు దారితప్పింది..
బస్సు దారి తప్పొచ్చు... లారీ దారి తప్పొచ్చు.. కానీ.. రైలే దారి తప్పితే.. వినడానికి విచిత్రంగా ఉన్నా అదే నిజం. రైలు దారి తప్పింది. అదీ ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే. పూరి వెళ్లాల్సిన ఓ స్పెషల్ ట్రైన్.. విజయవాడ నుంచి విశాఖ మీదుగా పూరి వెళ్లాల్సిన ట్రైన్.. దారి తప్పి వరంగల్ చేరుకుంది. విజయవాడ తర్వాత ఎన్నో స్టేషన్లు, ఎన్నో సిగ్నళ్లు దాటుకుని వరంగల్ వచ్చాక గానీ ట్రైన్ డ్రైవర్లకు దారి తప్పామన్న విషయం తెలియలేదు. దారి తప్పి మరో రూట్ లోకి వెళ్లిపోయామన్న విషయం తెలుసుకుని రైళ్లో ఉన్న వాళ్లు అవాక్కయ్యారు. డ్రైవర్లు తెల్లమొఖం వేశారు. ఓ వైపు వరసగా రైలు ప్రమాదాలు జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఈ సంఘటన.. మన రైల్వే సిబ్బంది పనితీరును కళ్లకు కడుతోంది. ఓ రూట్లో వెళ్లాల్సిన రైలును మరో రూట్లోకి పంపించిన మనవాళ్లు నిజంగానే పెట్టి పెట్టారనుకోవాలి. ఇంకా నయం.. అదే రూట్లో మరో షెడ్యూల్ ట్రైన్ ఆ సమయానికి రాలేదు. లేదంటే.. ఢిల్లీ పేలుళ్లకన్నా ముందే .. మనం మరో ఘోరవార్తను విని ఉండేవాళ్లం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి