8, సెప్టెంబర్ 2011, గురువారం
రాంచరణ్ పై సీబీఐ కన్ను
వరస దాడులు, విచారణలు, అరెస్టులతో అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్న సీబీఐ కన్ను మెగా వారసుడు రాంచరణ్ పై పడింది. విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే నోటీసులు పంపించింది. రాంచరణ్ ను విచారణకు పిలవడానికి కారణం.. ఎమ్మార్ బౌండరీహిల్స్ లో విల్లాను కొనుగోలు చేయడమే. ఏపీఐఐసీ తో జాయింట్ వెంచర్ గా ప్రాజెక్టు మొదలుపెట్టిన ఎమ్మార్.. అందులో చాలా విలువైన భూమిని నామమాత్రపు ధరకే వీవీఐపీలకు అమ్మినట్లు రికార్డుల్లో చూపించింది. అక్కడ గజం భూమిని కేవలం ఐదువేల రూపాయలకే అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చేయించింది. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన వాటా రాకపోగా, రిజిస్ట్రేషన్ల ఆదాయానికి ఎసరొచ్చింది. నామమాత్రపు ధరలకే విల్లాలను కొన్న వారి లిస్టులో రాంచరణ్, మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కార్, మంత్రి గీతారెడ్డి, కేవీపీ, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద లిస్టే ఉంది. ఎమ్మార్ దగ్గర విల్లాలు కొన్న మొత్తం 86 మందికీ సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి