6, సెప్టెంబర్ 2011, మంగళవారం
భారమంతా దేవుడిపైనే..!
గాలి అరెస్ట్త్ కిందా మీదా పడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, తన భయాన్ని బయటపెట్టేశారు. సీఎన్ఎన్ ఐబీఎన్ చీఫ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ తో ఐబీఎన్ స్టూడియోలో లైవ్ డిస్కషన్ లో పాల్గొన్న జగన్... తన భవిష్యత్ ఎలా ఉండొచ్చో చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరే ఛాన్స్ లేదని, ఆ ఛాప్టర్ క్లోజ్ అయిపోయిందన్న జగన్.. బీజేపీతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోనన్నారు. బిజేపీ ఏతర ప్రభుత్వం ఏదైనా.. అది యూపీఏ అయినా.. యూపీఏ కాకపోయినా మద్దతిస్తానన్నారు. బహుశా.. శరద్ పవార్ లా ఎదగాలనుకుంటున్నారో ఏమో గానీ, నేషనల్ లెవల్ పొత్తుకు సిద్ధమన్న సంకేతాలను కాంగ్రెస్ పార్టీకి పంపించారు.
ఇక, గాలి అరెస్ట్ తర్వాత నువ్వే అరెస్ట్ అవుతావా.. అన్న భయం నీకు ఉందా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వలేదు జగన్. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు తనను దెబ్బ తీయడానికి కుట్రపన్నుతున్నారని, తాను ప్రతిపక్షంలో ఉన్నానని జగన్ చెప్పుకొచ్చారు. అయితే.. వారు తనను జైల్లో వేసేవరకూ వెళతారని అనుకోవడం లేదనీ చెప్పారు. ఒకవేళ అదే జరిగితే.. ఆ అన్యాయాన్ని దేవుడే చూస్తాడన్నారు. దేవుడే వారికి గుణపాఠం చెబుతాడనీ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తంమీద దేవుడు తప్ప మరెవరూ తనను ఆదుకోలేరన్న విషయం జగన్ కు అర్థమైనట్లుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి