13, సెప్టెంబర్ 2011, మంగళవారం
అందాల పోటీల రహస్యం ఇదే!
Categories :
miss universe . news . TOP
విశ్వసుందరి.. మిస్ యూనివర్స్.. కిరీటం అంగోలా భామ లైలా లోపెజ్ కు దక్కింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోటీల్లో కిరీటం నల్లకలువను వరించింది. ఉక్రెయిన్, బ్రెజిల్, ఫిలిప్పైన్, చైనా భామలను కాదని అంగోలా భామకు కిరీటం కట్టబెట్టారు న్యాయ నిర్ణేతలు. ఈ కిరీటం ఆఫ్రికా దేశానికి దక్కడం ఇదే తొలిసారి. ఇంతకీ ఆమెకు మిస్ యూనివర్స్ కిరీటం దక్కడానికి కారణమైన ప్రశ్న-జవాబు ఏమిటో తెలుసా..?
జడ్జెస్..: శరీరంలో దేన్ని నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావు?
లైలా : దేవుడు నన్ను తీర్చిదిద్దిన తీరుతో నేను సంతృప్తి చెందాను.. నేనీదీ మార్చుకోవాలనుకోవడం లేదు.. ఆత్మసౌందర్యంతో ఉన్న మహిళగా నన్ను నేను భావిస్తాను. నా కుటుంబం నుంచి నేను ఎన్నో విలువలు నేర్చుకున్నారు. వాటినే జీవితాతం పాటించాలనుకుంటున్నాను..
ఈ సమాధానానికి న్యాయనిర్ణేతలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. విశ్వసుందరి నీవే నంటూ మిస్ అంగోలా లైలా లోపెజ్ ను కీర్తించారు. అయితే, అందాల పోటీల నుంచి ఎప్పటినుంచో ఉన్న విమర్శలు ఈ సారి లైలా ఎంపికతో మరోసారి తెరపైకి వచ్చాయి. కాస్మోటిక్ సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడం కోసం ఒక్కోసారి ఒక్కో దేశానికి కిరీటం దక్కేలా ప్రయత్నిస్తాయన్నది బహిరంగ సత్యమే. ఇప్పుడు ఆఫ్రికాలో ఉండే అంగోలాలో.. అందంపైన అమ్మాయిలకు మరింత మక్కువ పెరగడం ఖాయం. లైలా లా మారాలని ఎంతోమంది ప్రయత్నిస్తారన్నదీ వాస్తవమే. అదే కాస్మొటిక్ కంపెనీలకు కాసులు కురిపిస్తుంది. ఏమైనా, అందాల ఆరబోసి, 88 మందిని దాటుకుని, అద్భుతమైన సమాధానంతో అందాల కిరీటం దక్కించుకుని ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులోనే పాపులర్ అయిన లైలాకు బెస్టాఫ్ లక్ చెప్పక తప్పదు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి