13, అక్టోబర్ 2011, గురువారం
బొద్దింకలా మజాకా..!
Categories :
బొద్దింకలు . chennai airport . Cockroaches . news . TOP
విమానం ఎక్కుదామని వచ్చినవాళ్లకు బొద్దింకలు చుక్కలు చూపించాయి. మూకుమ్మడిగా దాడిచేసి జనాన్ని పరుగులు పెట్టించాయి. ఆసక్తికరమైన ఈ సంఘటన చెన్నై ఎయిర్ పోర్ట్ లో జరిగింది. మంగళవారం మధ్యాహ్నం(అక్టోబర్ 12,2011) చెన్నైలో భారీ వర్షం కురిసింది. విమానం ఎక్కడానికి, వారికి సెండాఫ్ ఇవ్వడానికి వచ్చినవారితో డొమెస్టిక్ టెర్నినల్ కిటకిటలాడుతోంది. అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, వేలాది బొద్దింకలు ఒక్కసారిగా విమానాశ్రయంలోకి దూసుకువచ్చాయి. జనంపైకి ఎక్కడం మొదలుపెట్టాయి. ఒక్కసారిగా అలా వచ్చిన వాటిని చూసిన వాళ్లకు.. మమ్మీ రిటర్న్స్ సినిమాలో పురుగుల సీన్ గుర్తుకువచ్చింది. అంతే అటూ ఇటూ చూడకుండా పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. ఆ గదీ ఈ గదీ అని తేడాలేకుండా కనిపించినవాటిల్లోకి వెళ్లి తలుపులు బిగించుకున్నారు. ఈ లోగా రంగంలోకి దిగిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. పొగ వదలి వాటిని బయటకు వెళ్లగొట్టారు. కొన్ని నిమిషాలు గడిచాయో లేదో.. మళ్లీ అవి విమానాశ్రయంలోకి దూసుకువచ్చాయి. ఇక ఇన్ సెక్ట్ కిల్లర్స్ చల్లి చాలావరకూ చంపారు. కొన్ని ఆ వాసన భరించలేక వచ్చినదారినే తిరుగుముఖం పట్టాయి. దాదాపు గంటపాటు ఇలా బొద్దింకలు చెన్నై ప్రయాణీకులను హడలెత్తించాయి. భారీ వర్షం కారణంగా డ్రైనేజీలు నిండిపోవడంతో.. వాటిల్లో ఉన్న బొద్దింకలు ఇలా వచ్చాయని ఎయిర్ పోర్ట్ సిబ్బంది సంజాయిషీ ఇచ్చారు. మొత్తాని విమానం వస్తుందని ఎదురుచూసిన వారికి బొద్దింకలు స్వాగతం పలికి.. మరిచిపోని రోజును మిగిల్చాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి