
రాహుల్ ద్రావిడ్.. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా. ఎవరినడిగినా ఈ మాట చెబుతారు. కానీ, ద్రావిడ్ మాత్రం తనను తాను అలా అనుకోవడం లేదట. అసలెప్పుడూ దాని గురించే ఆలోచించలేదంటున్నాడు. టీం ఇండియాలో యువరక్తం చేరుతున్న కొద్దీ.. జట్టులో స్థానం కోసం పోటీ పెరిగిపోయిందని ద్రావిడ్ అభిప్రాయపడుతున్నాడు. అయితే, వన్డేల్లో వీళ్లంతా రాణిస్తున్నా, టెస్టుల్లో మాత్రం ఇంకా నిరూపించుకోవాల్సి ఉందన్నాడు. ప్రస్తుతం సీనియర్లు ముగ్గురు నలుగురే ఉన్నందున, ఆ అవకాశాన్ని కుర్రాళ్లు ఉపయోగించుకోవాలంటున్నాడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి