10, జులై 2011, ఆదివారం
కాపీ కొట్టొద్దు
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వాదులు రోజుకో రకం కార్యక్రమంతో దూసుకుపోతున్నారు. ధర్నాలు, రైల్ రోకోలు,దీక్షలు, రాజీనామాలు, సమ్మెలు, వంటావార్పులు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకు అంతే ఉండదు. అయితే, తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న సమైక్యాంధ్ర వాదులూ గుడ్డిగా ఇవే కార్యక్రమాలను అనుకరిస్తూ అభాసు పాలవుతున్నారు. సమైక్యరాష్ట్రం కోసం వారి వాదన వినిపించడంలోనూ, పోరాటం చేయడంలోనూ తప్పేమీ లేకపోయినా, తెలంగాణ వాదుల ఆలోచనలను కాపీ కొట్టడమే విడ్డూరంగా కనిపిస్తోంది. తెలంగాణ జేఏసీ పిలుపు ఇచ్చిన హైదరాబాద్ వంటా వార్పూ కార్యక్రమం విజయవంతం కావడంతో, సీమాంధ్ర నేతల్లోనూ కలవరం కలిగింది. గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న సమైక్యాంధ్ర జేఏసీ ఈ మధ్యే వంటావార్పుకు పిలుపునిచ్చింది. జులై 10వ తేదీన గుంటూరులో రోడ్లపై వంటావార్పూ నిర్వహించాలని ప్రచారం కూడా చేసింది. కానీ, జనం నుంచే పెద్దగా స్పందన లేదు. జేఏసీ నేతలు కూడా తమ కుటుంబ సభ్యులను వంటావార్పుకు తీసుకురాలేకపోయారు. రాజకీయంగా హడావిడి చేసేవాళ్లు తప్ప, ఎవరూ రోడ్లపైకి వచ్చి వంటలు వండిందీ లేదు.. వడ్డించిందీ లేదు.. ఆరగించిందీ లేదు. కార్యక్రమం ఫెయిల్ అవడంతో, జేఏసీ నేతలు తీవ్ర నిరాశ చెందారు. అవును మరి, తమ ప్రాంతానికి ప్రోగ్రాం సూట్ అవుతుందో లేదో ఆలోచించకుండా అనౌన్స్ చేస్తే.. ఇలానే అభాసుపాలు కావాలి. సమైక్యాంధ్ర నేతలు ఇకనైనా తేరుకోవాలి. తమకంటూ ప్రత్యేకతను చాటుకోవాలి. కాపీ కార్యక్రమాలను పక్కన పెట్టాలి. అప్పుడే వారి ఉద్యమానికి విలువ ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
samakyandra udyamame copy udyamam ainappudu karyakramallo copy yenduku undadu