11, మార్చి 2011, శుక్రవారం
రేపే జగన్ పార్టీ..!
Categories :
కాంగ్రెస్ పార్టీనుంచి బయటకు వచ్చినప్పటి నుంచి పార్టీ విషయంలో అందరినీ ఊరిస్తున్న జగన్.. ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ అని జగన్ అధికారికంగా ప్రకటించారు. రేపు..
అంటే శనివారం మధ్యాహ్నం 2:29 కి ఇడుపుల పాయలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సభలో జగన్ ఈ ప్రకటనను చేశారు. తన తండ్రి వైఎస్సార్ సమాధి దగ్గర, తన తల్లి విజయమ్మ చేతుల మీదుగా పార్టీ జెండాను జగన్ ఎగరవేస్తారు. తన పార్టీ జెండాలో మూడు రంగులు ఉంటాయని జగన్ తెలిపారు. బహుశా.. ఇవి కాంగ్రెస్ రంగులను పోలి గానీ, కాంగ్రెస్ రంగులకు దగ్గరగా గానీ ఉండే అవకాశాలున్నాయి. ఇక తన ఛానల్ లోగోతో పాటే తండ్రి ఫోటోనూ ఉంచిన జగన్, పార్టీ జెండాపైనా ఆయన బొమ్మను పెడతారో లేదో శనివారంతో తేలిపోనుంది. పార్టీ విధివిధానాలను రూపొందించడం కోసం ప్లీనరీని నిర్వహించబోతున్నారు. కడప ఉపఎన్నికలు పూర్తైన తర్వాతే ఈ ప్లీనరీ ఉండబోతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి