11, మార్చి 2011, శుక్రవారం
పొంచిఉన్న ప్రళయగండం
జపాన్‌లో ప్రళయం సృష్టించిన భీభత్సాన్ని మీరు చూసే ఉంటారు. చూడకపోతే.. ఇదే వెబ్‌సైట్‌లో ఉన్న వీడియోలు చూడండి. శుక్రవారం మధ్యాహ్నం సునామీ ఒక్కసారిగా జపాన్‌లోని తీరప్రాంతాలపై విరుచుకుపడింది. సముద్రంలో ఉండాల్సిన ఓడలు, బోట్లను రోడ్లపైకి తెచ్చి పడేసింది. ఇక రోడ్లపై తిరుగుతున్న కార్లు, బస్సులు, ట్రక్కులను సముద్రంలోకి లాక్కెళ్లిపోయింది. సముద్రం ఒక్కసారిగా పోటెత్తి జనావాసాల్లోకి రావడంతో.. ఇళ్లు కూడా సముద్రంలోకి కొట్టుకునిపోయాయి. జపాన్‌లోని
సెండాయ్ నగరంలో సునామీ ప్రభావం ఎక్కువగా ఉంది. నగరాన్ని సముద్రం ముంచెత్తుతున్న దృశ్యాలు టెలివిజన్ కెమెరాకు చిక్కాయి. చాలా ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ఇళ్లల్లో చిక్కుకుపోయి కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తూ చాలా మంది కనిపించారు. సెండాయ్‌లోని ఎయిర్‌పోర్ట్ కూడా సునామీ తాకిడికి దెబ్బతింది. రన్‌వే నీటిలో మునిగిపోయింది. కమైచీ పట్టణంలోనూ ఇదే పరిస్థితి. రోడ్లన్నీ రద్దీగా ఉండే సమయంలో సునామీ విరుచుకుపడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కార్లు, ట్రక్కులు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. కార్లలో వెళుతున్నవారు తప్పించుకునే వీలు లేకుండా పోయింది. అంతా చూస్తూ ఉండగానే వారు సముద్రపు నీటిలో కలిసిపోయారు. సునామీ దెబ్బకు ఓ చోట ఫ్లైఓవర్ కూలిపోయింది.
140 ఏళ్లలో జపాన్ ఎదుర్కొన్న అతిపెద్ద ప్రళయం ఇది. చాలాకాలం తర్వాత పెనుప్రమాదానికి చిక్కింది భూకంపాల దేశం. జపాన్‌లో చిన్న చిన్న భూకంపాలు రావడం సహజమే అయినా.. 8.9 మాగ్నిట్యూడ్‌తో భూకంపం రావడం.. వెంటనే సునామీ విరుచుకుపడడం.. చాలాపట్టణాలను ఒకేసారి విపత్తు ఏర్పడడం మాత్రం ఇదే తొలిసారి. భూకంపం కారణంగా టోక్యోలోనూ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ ఆయిల్‌రిఫనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిఫైనరీ మొత్తం కాలిపోయింది. నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూప్రకంపనల కారణంగా భవనాలు ఊగిపోతున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.
సునామీ రావడంతో.. తీర ప్రాంతాలను జపాన్ ప్రభుత్వం ఖాళీ చేయిస్తోంది. చాలామందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అయితే.. ఇప్పటికే సునామీ ముంచెత్తిన ప్రాంతాల్లో చాలామంది మాత్రం ప్రాణాలతో పోరాడుతున్నారు. వీరిని రక్షించడానికి సహాయకబృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. నష్టం మాత్రం భారీగానే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మానవాళిపై ప్రళయం ఇలా విరుచుకుపడడం ఇదే మొదటి సారి కాదు.. ఇంతకు ముందూ ఘోరవిపత్తులు మనల్ని ముంచెత్తాయి.
2004 సునామి
డిసెంబర్ 26, 2004..
ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ... ఒక్కసారిగా సముద్రంలో అలజడి మొదలయ్యింది.. ఒక్కసారిగా సముద్రపు అలలు విరుచుకుపడ్డాయి. భూకంపం తర్వాత సాధారణంగా సముద్రంలో వచ్చే మార్పుకాదది.. ఎన్నో దేశాల్లో మరణమృందగాన్ని మోగించిన మృత్యు కెరటాలవి.
ఇండోనేషియాలోని సమత్రా దీవుల నుంచి మన దేశంలోని బంగాళాఖాతం తీర ప్రాంతాల వరకూ.. పెను విధ్వంసాన్ని సృష్టించాయి... ఆ మృత్యుకెరటాలు. అప్పటి వరకూ కొంతమందికే తెలిసిన ఓ ప్రళయం.. ప్రపంచం మొత్తానికి తెలిసింది. దాని భీభత్సం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించింది... అదే సునామీ. 2004 సునామీ సమయంలో సముద్రపు కెరటాలు.. వంద అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. తీరప్రాంతాల్లోని గ్రామాలను, జనావాసాలను నామరూపాల్లేకుండా చేసేశాయి. ఇండోనేషియా ఈ సునామీ దెబ్బకు తీవ్రంగా నష్టపోయింది. ఆ తర్వాత ఎక్కువగా నష్టపోయింది శ్రీలంక.. దాని తర్వాత ఆస్తి,ప్రాణనష్టాలను మరితంగా మూటగట్టుకొంది మనదేశమే. తమిళనాడులోని నాగపట్టణం శవాలదిబ్బగా మారిపోయింది. ఎటు చూసినా మృతదేహాలే..
మనదేశంలో దాదాపు 20 వేల మందిని ఈ సునామీ బలి తీసుకుంది. మన రాష్ట్రంలో 105 మంది మృత్యుకెరటాలకు బలయ్యారు. ఇండోనేషియాలో అత్యధికంగా లక్షా 31వేల మంది ప్రాణం కోల్పోయారు. 14 దేశాల్లో ఈ 2004 సునామీ భీభత్సం సృష్టించింది. మొత్తంమీద 2 లక్షల 30 వేల మందిని మృత్యుముఖానికి చేర్చింది. ఇంతమంది ఒకే సంఘటనలో.. అతి తక్కువ సమయంలో ప్రాణాలు పోగొట్టుకోవడం అదే తొలిసారి. అందుకే.. మానవాళిపై విరుచుకుపడ్డ మహాప్రళయాల్లో ఒకటిగా నిలిచిపోయింది ఈ సునామీ... ఇప్పటికీ ఎన్నో చేదు జ్ఞాపకాలను గుర్తుచేస్తూనే ఉంది.
ఈ సునామీకి కారణం.. సమత్రా దీవుల సమీపంలో వచ్చిన భూకంపం. సముద్ర గర్భంలో 9.1 నుంచి 9.3 మాగ్నిట్యూడ్‌గా ఈ భూకంపతీవ్రత నమోదయ్యింది. ఇంతవరకూ రికార్డైన అత్యంత తీవ్రతగల భూకంపాల్లో ఇది మూడోది. అందుకే.. అంత భారీ నష్టం సంభవించింది. 2004 నుంచి సముద్రంలో ఏ చిన్న ప్రకంపనం వచ్చినా.. అది సునామీకి దారితీస్తుందేమోనన్న భయం ప్రపంచాన్ని వెంటాడడం మొదలుపెట్టింది.
2010 హైతీ భూకంపం
హైతీ.. కరేబియన్ దీవుల్లోని ఓ చిన్న దేశం....
జనవరి 12, 2010... హైతీ ప్రజలు మర్చిపోవాలన్నా మరిచిపోలేని రోజు.. నిత్యం నీడలా వెంటాడే రోజు. వారికి చిరకాలం అదో చేదు జ్ఞాపకం. ఆరోజు.. హైతీని అల్లకల్లోలం చేసింది..తీరని కష్టాల్లోకి నెట్టేసింది. ఆ పని చేసింది.. ఓ భూకంపం..
హైతీలో వచ్చింది సాధారణ భూకంపం కాదు. మహా ప్రళయం. భూకంపం దాటికి ఒక్కసారిగా ఇళ్లు కూలిపోయాయి. హైతీ రాజధాని ఒక్కసారిగా శిధిలాల కుప్పగా మారిపోయింది. ఉన్నట్టుండి భవనాలు కూలిపోవడంతో, జనం బయటపడే అవకాశం కూడా లేకుండా పోయింది. లక్షలాది మంది భవనాల్లోనే చిక్కుకుపోయారు.
జనవరి 12 న 7.0 మాగ్నిట్యూడ్ తీవ్రత గల భూకంపం హైతీని కుదిపేస్తే.. ఆ తర్వత జనవరి 24 వరకూ .. ఏకంగా 52 సార్లు 4.5 మాగ్నిట్యూడ్ కన్నా ఎక్కువ తీవ్రత గల భూకంపాలు సంభవించాయి. దీన్ని బట్టి హైతీ ఎంతటి విప్తతును ఎదుర్కొందో అర్థం చేసుకోవచ్చు. సహాయకార్యక్రమాలు మొదలుపెట్టడానికి కూడా చాలా సమయం పట్టింది. దీంతో శిధిలాల కింద చిక్కుకుపోయినవారు... చాలా వరకూ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది.
హైతీలో వచ్చిన భూకంపం.. 3 లక్షల 16 వేల మందిని బలితీసుకున్నట్లు హైతీ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఆ దేశ జనాభా కోటిలోపే. అంటే.. ఒక్క భూకంపం దెబ్బకే 3 శాతం ప్రజలను ఆ దేశం కోల్పోయింది. అంతేకాదు.. 15 లక్షల మందిని నిరాశ్రయులను చేసింది. ఎంతోమంది ఈ భూకంపం కారణంగా అనాధలైపోయారు. ఆస్తిపాస్తులన్నిటినీ పోగొట్టుకున్నారు.
ఇలాంటి ప్రళయం.. మరే దేశానికి ఎదురుకాలేదు. గత ఏడాది భూకంప నష్టాన్ని ఇంకా పూడ్చుకోలేకపోయింది హైతీ. ఇప్పటికీ చాలాచోట్ల శిధిలాలు అలానే ఉన్నాయి. పునరావాస కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఏం జరుగుతోంది?
మార్చి 11. జపాన్‌లో సునామీ. అతలాకుతలమైన టోక్యో నగరం.
మార్చి 12న ఏం జరగబోతోంది ?
మార్చి 13న ఏ దేశం బలికాబోతోంది ?
మార్చి 14న ఎక్కడ సముద్రం పొంగనుంది
మార్చి 15, 16, 17, 18 తేదీల మాటేంటి ?
మార్చి 19న భారీ ప్రళయం తప్పదా ?
సునామీకి సూపర్ మూనే కారణమా ?
20 ఏళ్లకొక సారి చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. దాన్నే సూపర్ మూన్ అంటాం. చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల కలిగే వాతావరణ మార్పులతో...ఊహించని వైపరిత్యాలు విరుచుకుపడతాయి. ఇది కల్లబొల్లి మాట కాదు. సైంటిస్ట్‌లు చెప్పిన సత్యం. మార్చి 19వ తేదీన సూపర్ మూన్ సంభవించనుందని శాస్ర్తవేత్తలు హెచ్చరించారు.
జపాన్‌ను అతలాకుతలం చేసిన సునామీకి వేరే కారణాలు ఉంటే ఫర్వాలేదు. కానీ...దానికి కారణం సూపర్ మూనే అయితే పరిస్థితి ఏంటి ? ఇది సూపర్ మూన్ ప్రభావమే అయితే, రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? మార్చి 19వ తేదీ నాడు జరిగే ప్రళయానికి ఇది రిహార్సలా ? రష్యాను జపాన్ జాగ్రత్త అని హెచ్చరించింది. అంటే... సూపర్ మూన్ తర్వాతి టార్గెట్ రష్యానేనా ? ఒక వేళ అదే నిజమైతే... మార్చి 19 దాకా ఏదో ఒక చోట ప్రళయం తప్పదా ?భయపెట్టడానికి వేస్తున్న ప్రశ్నలు కావివి. కంగారు పెట్టడం ఈ కథనం ఉద్దేశం కాదు. సూపర్ మూన్ తీవ్రతను అంచనా వేయడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే.
సూపర్ మూన్ ఆయుధం సునామీనే అయితే...ఆసియాకు పెను ముప్పు తప్పదు. మనదేశానికి ఏం జరగబోతుందో తలుచుకుంటేనే వణుకు పుడుతోంది. మార్చి 19. చంద్రుడు భూమికి అతి దగ్గరగా వచ్చేది ఆ రోజే. ఆ తేదీ వరకు ప్రతి రోజూ ప్రపంచానికి దినదిన గండమే. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. మనం చేయగలిగింది మాత్రం ఒక్కటే. సూపర్‌మూన్ ప్రభావానికి టోక్యో ఆరంభం మాత్రమే కాదు అంతం కూడా కావాలని కోరుకోవడం తప్ప.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి