15, మార్చి 2011, మంగళవారం
చిరంజీవి చిన్నకూతురు కాపురంలో చిచ్చు
Categories :
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ముప్పుతిప్పలు పెట్టి, పరువు నడిరోడ్డున పడేసి, పద్దెనిమిదేళ్లు రాగానే ప్రేమవివాహం చేసేసుకున్న ఆయన చిన్నకూతురు శ్రీజ కాపురంలో చిచ్చు మొదలయ్యింది. ఏ ప్రేమ కోసమైతే అందరినీ తాను వదులుకున్నానో.. ఆ ప్రేమే ఇప్పుడు తనపాలిట శాపంగా మారిందని ఆమె వాపోతోంది. అంతేకాదు.. అత్తింటి ఆరళ్లు ఎక్కువయ్యాయంటూ వరకట్నవేధింపుల కేసును తన భర్త శిరీష్, అత్తామామలపైనా పెట్టింది. సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేసింది. అయితే..
ఏడాదిగా తనను భర్త వేధిస్తున్నాడని ఆ ఫిర్యాదులో శ్రీజ పేర్కొంది. పెళ్లైన దగ్గరనుంచి ఏ పనీ చేయకుండా, తన కుటుంబం నుంచి వచ్చే ఆస్తులకోసం ఎదురుచూస్తున్నాడని శ్రీజ ఆరోపిస్తోంది. బిడ్డ భవిష్యత్తుకోసం ఎంతగా రాజీపడ్డప్పటికీ వేధింపులు మరీ ఎక్కువయ్యాయని, బిజినెస్ కోసం రూ.50 లక్షలు తేవాలని ఒత్తిడి తెచ్చారంటోంది. ఆ డబ్బు తెస్తానని పుట్టింటికి వచ్చిన శ్రీజ, కుటుంబ సభ్యుల సహకారంతో భర్తపై కేసు పెట్టాలనే నిర్ణయించుకుంది. ఇక మళ్లీ శిరీష్ దగ్గరకు వెళ్లనని తేల్చి చెప్పేస్తింది. దీంతో, వీరిద్దరి బంధం తెగిపోయినట్లేనని తెలుస్తోంది. కానీ, ఫిబ్రవరి 14 నాడు ఓ ఛానల్‌లో కనిపించి మరీ తమ ప్రేమానుబంధాల గురించి గొప్పగా చెప్పుకున్న శ్రీజ శిరీష్‌లకు ఇంతలోనే ఎందుకు తేడా వచ్చిందన్నది సస్పెన్స్. శ్రీజ కాపురంలో ఆర్థిక ఇబ్బందుల సంగతి తెలుసుకున్న చిరంజీవి, తన కూతుర్ని తనవైపు తిప్పుకోవడానికి తెలివిగా పావులు కదిపినట్లు సమాచారం. ఈ మధ్య ఆడియో ఫంక్షన్లకు ఫ్యామిలీతో కలిసి హాజరవుతున్న శ్రీజ.. మళ్లీ కుటుంబానికి దగ్గరవడం.. శిరీష్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టడంతో హైక్లాస్ ప్రేమకథలు ఎప్పుడూ ఒకేరీతిలో అంతమవుతాయన్న విషయం మరోసారి స్పష్టమయ్యింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
* అత్తింటి ఆరళ్లు ఎక్కువయ్యాయంటూ వరకట్నవేధింపుల కేసును తన భర్త శిరీష్, అత్తామామలపైనా పెట్టింది.*
పెళ్ళి కాక మునుపు తండ్రికి, కుటుంబ సభ్యుల కు షాక్ ఇచ్చింది ఐన తరువాత ఇప్పుడు అత్తామామలకు ఇచ్చింది. పాపం వాళ్ళ పని కటకటాల ఊచలు లెక్కించు కోవలసి వస్తున్నాది. ఇటువంటి వారితో వియ్యం కొరివితో తలగొక్కోవడమని ఇప్పుడు వారికి అర్థమై ఉంట్టుంది. మొత్తానికి అటు తండ్రిని, ఇటు అత్తామామలను ఇరికించగల సామర్థ్యమున్న ఆధునిక యువతి.
*పెళ్లైన దగ్గరనుంచి ఏ పనీ చేయకుండా, తన కుటుంబం నుంచి వచ్చే ఆస్తులకోసం ఎదురుచూస్తున్నాడని శ్రీజ ఆరోపిస్తోంది.*
పెళ్ళి చేసుకొనే ముందర శిరిష్ భరద్వాజ్ ఏ పని చేసి ఆమేను పోషించగలడు అని ఆలోచించుకోలేదా? అయినా ఈ రోజూలలో 50లక్షలు పెద్ద మొత్తం కాదు. చిన్న రెండు గదుల అపార్ట్ మేంట్ దాదాపు 60 లక్షలు చేస్తున్నాది. అటువంటి అతి చిన్న మొత్తం అతను అడిగితే ఇచ్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడన్న మాట చంటబ్బాయ్. హీరోగా సంపాదించడమేకాకుండా పార్టి పేట్టి, దానిని ఇంకొక పార్టిలోకలిపి ఇలా పార్టిలను రోటేట్ చేస్తూ పవర్ ని, డబ్బులని ఎంతో సంపాదించుకొనే వీరు అల్లుడికి 50లక్షలు ఇవ్వలేక పోలిస్ కేసు పేట్టారంటె. ఆ అల్లుడిని ఇన్నిరోజులు ఎంత అవమానిచ్ని ఉంటారో కదా! పాపం భరద్వాజ్.
ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఉద్యోగం గానీ వ్యాపారం గానీ లేనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? విడాకులు తీసుకుంటే పెట్టుకుంటే ఇద్దరికీ మంచిది.
మార్థండా నీ వ్యాఖ్య వాళ్ళ పెళ్ళి పూటకు గడవక పేటాకులైనదనే విధంగా ఉంది. తినటానికి అన్నం లేక ఇల్లు గడవటం లేక విడి పోతున్నారా వాళ్ళు? అసలికి వాళ్ళకి 50 లక్షలు ఒక లెక్కా? జిల్లా కేంద్రాలలో నే ఒకచిన్న స్థలం చెస్తున్నాది 50లక్షలు. ఇక సినేమావారి డబ్బులన్ని స్థలాలపైన పెడతారు. నిర్మాతలు నగదు కన్నా స్తలాలు రూపంలో పారితోషికం ఇస్తారు. చంటబ్బాయి ఇల్లే హైదరాబద్ లో అతి ఖరీదు ఐన ఇళ్ళలో ఒకటని చదివాను. ఆయన కొన్న కొత్త కారు 2-3 కోట్ల పై చిలుకే. కూతురి జీవితం కన్నా 50లక్షలు ఎక్కువా? ఆయన కి ఉన్న ప్రస్తుత పలుకు బడి ముందు ఆ అబ్బాయి అమ్మా నాన్నలు కట్నం పేరుతో అనవసరం గా తోకజాడించ గలరా? వాళ్ళది మధ్యతరగతి కుటుంబం ఎమి చంటబ్బాయితో తగువు పెట్టుకొని ఎమీ చేయగలరు?
ఈ రోజుల్లో తల్లి తండ్రులు కొడుకు దగ్గర ఉండటానికి భయ పడుతున్నారు. కోడళ్ళు అత్తా మామలపై ఎప్పుడైనా పోలీసు కేసు పెడతారేమోనని భయపడుతూ నోరు మూసుకొని పడి ఉంటున్నారు. కొడుకులు కూడా తల్లి తండ్రులను వృద్దాశ్రమం లో ఉంచాడని కి కూడ వెనుకాడడం లేదు.
ఇంకేమీ దొరకనట్టు సినిమా వాళ్ళ గురించి, రాజకీయ నటుల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి మనం మాట్లాడు కోవటం అనవసరమేమో ఆలోచించండి.
సినిమాల్లో చూపే బీద అబ్బాయి గొప్ప పిల్లని ప్రేమించి లేపుకు పోవటం, ఒంటి చేత్తో వంద మందిని కొట్టిపడేయటం మిర్రర్ ఎఫ్ఫెక్ట్ లో జరిడింది అంతే.
ఈ సెలెబ్రిటీ లు, లెజండుల పిల్లలు డబ్బులెక్కువై వయసు వేడిలో ఏదో చేసేసి, ఆనక నాన్నల కౌన్సిలింగ్ లు పని చేసి బుద్ది గా విడి పోదామనుకోవటం మన ఆంధ్రా లో మామూలే.
ఆంధ్రా అని ఎందుకన్నానంటే పొరుగు రాష్ట్రము లో ఇంతకన్నా పెద్ద హీరో ఉన్నాడు సినిమాల్లో చూపే ఆదర్శాలు నిజ జీవితం లో చేసి చూపాడు, అయన ..oక నాకమనండి బుద్ది వస్తుంది.
"కానీ, ఫిబ్రవరి 14 నాడు ఓ ఛానల్‌లో కనిపించి మరీ తమ ప్రేమానుబంధాల గురించి గొప్పగా చెప్పుకున్న శ్రీజ శిరీష్‌లకు ఇంతలోనే ఎందుకు తేడా వచ్చిందన్నది సస్పెన్స్"
పద్దెనిమిదేల్ల వయసులో ప్రేమ గురించి గొప్పగా కాకపోతే ఇంకెలా మాట్లాడుతుంది? ఆ వయసు అలాంటిది. తనో పెద్ద హీరోయిన్ లా ఫీలయి సినీ ఫక్కీలో సూపర్ మేరేజ్ చేసుకుంది. పాలపొంగులాంటి ఆకర్షణ చల్లబడగానే ఇపుడు తెలిసొచ్చినట్లుంది ఇద్దరికీ.
because it is chiru;s family, every body is targetting. purandeswari family also the same thing happened. no body opens mouth. we are also ready to poke only the famous and who are in public life