21, డిసెంబర్ 2010, మంగళవారం
జగన్ దీక్షకు హెలికాప్టర్ అవసరమా..?
రాజకీయ పార్టీని ప్రారంభించకుండానే జగన్ తొలి ప్రజాపోరాటాన్ని దిగ్విజయంగా మొదలుపెట్టారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువన ఇసుకతిన్నెలపై ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం వేలాది మందితో జనసంద్రాన్ని తలపించింది. జగన్ శిబిరం ప్రయత్నాలు ఫలించి, ఊహించినదాని కన్నా ఎక్కువమందే తరలివచ్చారు. ఈ దీక్షను ప్రతీక్షణం లైవ్‌లో అందించేందుకు సాక్షి ఛానల్ ప్రత్యేక ఏర్పాట్లు చేయడమే కాకుండా, దాన్ని ఫ్రీగానే అన్ని ఛానళ్లకు అందించింది. అయితే.. సాక్షిని మించి ఈ దీక్షను కవర్ చేయడానికి ఎన్టీవీ ఆతృత చూపడమే అనుమానాలకు తావిస్తోంది. ఎన్టీవీ ఏం చేసిందంటే..
జగన్ దీక్ష కవరేజ్ మిగిలిన ఛానళ్లతో పోల్చితే తన ప్రత్యేకతను చాటుకొంది ఎన్టీవీ. ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకొని అందులోనుంచి విజయవాడను, కృష్ణాతీరంలో జగన్ దీక్షకు, జనం గుంపులను, రోడ్లపై నిలిచిపోయిన వాహనాలను ప్రత్యేకంగా షూట్ చేసి పదే పదే ప్రసారం చేసింది. తమకు మాత్రమే ప్రత్యేకమంటూ ఎక్స్ క్లూజివ్ బ్యాండ్ ను కూడా వేసుకొంది. ఎన్టీవీ విజయవాడ రిపోర్టర్ హెలికాప్టర్లో నుంచే కింద కనిపిస్తున్న దృశ్యాలను వర్ణిస్తూ పూర్తిస్థాయిలోనే కవర్ చేశారు. బహుశా ఓ రాజకీయ పోరాటానికి సంబంధించి హెలికాప్టర్ ద్వారా అదీ ఓ తెలుగు ఛానల్ కవర్ చేయడం ఇదే తొలిసారి కావచ్చు. అయితే.. జగన్ దీక్షను హెలికాప్టర్‌తో కవర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఇదే ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.
ఎన్టీవీ యజమాన్యం దగ్గర కుప్పలుతెప్పలుగా డబ్బులు మూలుగుతుండొచ్చు. దాన్ని ఇలా ఖర్చుపెట్టడంలో ఎవరికీ ఏమీ అభ్యంతరం లేకపోయినా, ఈ విషయంలో కొన్ని తెరచాటు ఒప్పందాలు జరిగి ఉండొచ్చన్న అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లపైన ఉన్న ఐరెన్ బ్రిడ్జినుంచి ఎక్కి విజువల్స్ తీసినా, హెలికాప్టర్లో నుంచి తీసిన ఎఫెక్టే వస్తుంది. మరో యాంగిల్ తీసుకోవాలనుకుంటే సీతానగరం వైపున్న సీతారామఆలయాన్ని ఆనుకొన్న కొండ ఎలానూ ఉంది. ఇక దుర్గగుడి టెంపుల్ పైనుంచీ ట్రై చేయొచ్చు. కానీ వీటన్నింటినీ కాదని హెలికాప్టర్‌ను అద్దెకు తెచ్చుకోవడంలోనే అసలు ఆంతర్యం దాగి ఉంది. అదే జగన్‌కు, ఎన్టీవీ నరేంద్ర చౌదరికి మధ్య ఒప్పందం. (అయితే, ఇది అనుమానం మాత్రమే)
తొలిసారి చేస్తున్న పోరాటం ద్వారా తన బలాన్ని రాజకీయ పక్షాలకు ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు చాటి చెప్పాలనుకున్నారు జగన్. అందుకే విస్తృతమైన కవరేజీ ఏర్పాట్లను తన ఛానల్ ద్వారా చేసుకున్నారు. అయితే.. విజయవాడ మొత్తం పైనా తన ప్రభావం ఎలా ఉందో చూపిస్తే, దాని ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంటుందన్నది జగన్ అంతరంగం. ఆ పనిని హెలికాప్టర్ ద్వారా షూట్ చేసి తన ఛానల్ లో చూపిస్తే, మెచ్చుకోళ్లకు బదులు విమర్శలు కురవచ్చు. పైగా రైతుదీక్ష అంటూ చెప్పి, తన ప్రచారానికే చేసారన్న అపనింద కూడా రావచ్చు. అదే పక్క ఛానల్లో వస్తే, ప్రచారానికి ప్రచారం దొరుకుతుంది. తన కోరికా తీరుతుంది. విమర్శలూ రావు. అందుకే ఎన్టీవీ హెలికాప్టర్‌ను జగనే అందించి ఉండొచ్చన్న అనుమానాలు మీడియాలో వ్యక్తమవుతున్నాయి. చాలా విషయాల్లో సాక్షి ఛానల్‌కు, ఎన్టీవీకి మధ్య తెరచాటు ఒప్పందాలు ఎన్నో జరిగాయి కూడా. ఇప్పటికే ఈ దీక్ష కోసం భారీగా డబ్బులు వసూలు చేశారని, కోట్లల్లో ఖర్చు పెడుతున్నారని నేషనల్ మీడియా ప్రచారం మొదలుపెట్టింది. ఈ విషయమూ తెలిస్తే.. జగన్ కు మరిన్ని మరకలు అంటడం ఖాయమే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
డబ్బులెక్కువయితే ఇలాగే ఉంటుంది.
ఇది అంతా కిరస్తానీ షొ గా వుంది. జగన్, సొనియా, పరొన్ని రొయ్ అందరు కిరస్తానీలే.
దేశాన్ని ఎంత గా దొచారొ దీన్ని బట్టి తెలుస్తుంది. మీడియా + పొలిటిక్స్ + మత మార్పిడులు.
jagan thanaku unna balalanni chupincharu . jagan ku prajabi manam undi
neku blog avasarama musuko
అయ్యప్ప దీక్ష కూడా చెయ్యొచ్చు. పుణ్యమేమో కాని ఒంట్లో కొవ్వు కరిగి, మాలిన్యాలు తగ్గుతాయని చైనాలో వాంగ్ ఛూ చేసిన పరిశోధనల్లో తేలింది. మా తాత గారు కూడా చేసి ఆరోగ్యంగా పోయారు. నేను మతాన్ని నమ్మను, కాని మనుషులను నమ్ముతాను.
కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యల లాంటి చేతకాని వాళ్ళ కన్నా జగనే నయమేమో అనిపిస్తోంది. తెలంగాణా అందరినీ ఓదార్చి, రాష్ట్రాన్ని ఏకతాటి మీద నడిపించగల సమర్ఠుడు.