29, సెప్టెంబర్ 2010, బుధవారం
టీ.వీ ఛానళ్లలో వింత శిక్షలు
తప్పు ఎవరు చేసినా తప్పే. జర్నలిస్టులేమీ దీనికి అతీతులు కాదు. అందుకే, న్యూస్ ఛానళ్ల స్కోలింగ్స్‌లో ఎవో ఓ తప్పులు దొర్లుతుంటాయి. అయితే, చాలా వరకూ ఇలా పొరపాట్లు చేసేవారిని వారి పై నున్న వారు తిట్టి వదిలేస్తారు. కానీ, తెలుగ ఛానళ్లలో ఓ రెండింటిలో మాత్రం వింత శిక్షలను అమలు చేస్తున్నారు.. అవేమిటో తెలుసా...?
సాష్టాంగ ప్రణామం
తెలుగు న్యూస్ ఛానళ్లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న టీవీ 9 గురించి ముందు చెప్పుకుందాం. ఇక్కడ అవుట్‌పుట్ వ్యవహారాలన్నీ అరుణ్‌సాగర్ చూస్తుంటారు. స్కోలింగ్స్‌లో తప్పొచ్చినా, వార్తలను తప్పుగా ఇచ్చినా సబ్ ఎడిటర్లకు, షిఫ్ట్ ఇంఛార్జులకు ఆయన వేసే శిక్ష చాలా ఫన్నీగా ఉంటుంది. తప్పు చేసిన వారి వద్దకు వచ్చి, అమాంతం నేలపై పడి సాష్టాంగ ప్రణామం చేస్తారు అరుణ్ సాగర్. టీవీ9 లో పనిచేసే వారిలో చాలామంది ఇది ఎదురైన అనుభవం. చాలాకాలంగా ఈ శిక్షను ఆయన అమలు చేస్తున్నారు. చాలామందిలా నోటికి వచ్చినవన్నీ తిట్టకుండా, వారు మరోసారి తప్పు చేయకుండా, వారు ఇబ్బంది పడేలా అరుణ్‌సాగర్ వేస్తున్న ఈ శిక్ష ఆయన కింద పనిచేసేవారిలో మార్పు తెచ్చిందో లేదో టీవీ9 వారే చెప్పాలి.
ఒకటికి రూ.25లు
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు, టీవీ9 ను మాత్రమే పోటీగా భావించే ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. టీవీ 9ను ఎప్పుడెలా ఇరుకున పెడదామా అని ఎదురుచూసే ఎబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణకూ ఇలా వెరైటీ శిక్షలు వేసే అలవాటుంది. అయితే.. అరుణ్ సాగర్‌లా ప్రణామాన్ని ఆయన చేయరు. తప్పుకు రూ.25ను వసూలు చేస్తారు. చిన్నవాళ్ల నుంచి డెస్క్ ఇంఛార్జ్ వరకూ ఎవరు తప్పు చేసినా దానికి రూ.25ను రాధాకృష్ణకు చెల్లించుకోవాల్సిందే. చివరకు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు స్రోలింగ్‌లో తప్పు కనిపించినా, దానికి ఫోన్ చేసి మరీ కనుక్కొని, డబ్బులు వసూలు చేస్తారు.
ఇలా రెగ్యులర్‌గా డబ్బులు తీసుకోవడంపై అంతా గుసగుసలాడుకుంటున్నారని తెలుసుకొని, స్వీట్లు తెప్పించి ఆఫీసులు పంచారట రాధాకృష్ణ.
ఈటీవీలోనూ ఇలాంటి శిక్షలే అమలయ్యేవి. అప్పట్లో శాస్త్రి డెస్క్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పుడు పొరపాట్లు చేసిన వారిని బూతులు తిడుతూ రాసిన స్లిప్‌ను.. నోటీస్‌బోర్డులో పెట్టేవారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బావున్నాయి, వింత శిక్షలు...సాష్టాంగ ప్రణామాలు అదిరాయి
we used to have a fun punishment in office. if u r late to a meeting by 5 minutes, u buy coffee for everyone at the end of the meeting :) used to work like a charm..becoz one round of coffee for team used to cost 20-25$.
మీడియా సంగతి నాకు తెలియదు గానీ హైదరాబాద్ వెంగళరావునగర్‌లో విద్యాసంస్థలు స్థాపించి పైకొచ్చిన ఒక క్షత్రియుడు తన సంస్థలో తప్పుచేసిన ఉపాధ్యాయుణ్ఝ్ణి తన ఛాంబర్ లోకి పిలిపించి తిట్టి ఆ తరువాత ఆ కోపంలో అతని చొక్కా చించి, అనంతరం తన డెస్కులోంచి ఒక కొత్త చొక్కా తీసి తొడిగి మళ్ళీ క్లాసుకు పంపిస్తాడని ప్రతీతి. ఈ పని కోసం అతని డెస్కులో ఎల్లప్పుడూ రెండుమూడు కొత్త చొక్కాలు నిలవగా ఉంటాయట.