19, సెప్టెంబర్ 2010, ఆదివారం
స్వలాభాపేక్షి
విమోచనమా.. విలీనమా.. విద్రోహమా.. సెప్టెంబర్ 17కు ఏది కరెక్టనే విషయంపై ఈ మూడింటిలో తెలంగాణ వాదులు తలలు పగలుకొట్టుకుంటూ ఉండగానే, ఆ రోజు వచ్చేసింది. విద్యార్థుల నుంచి రాజకీయ పార్టీల నేతలందరివరకూ జాతీయజెండాను ఎగరవేయడానికి ఉత్సాహంగా ఉరికి వచ్చారు. అసెంబ్లీ ఆవరణలో ఎగరవేయడానికి ప్రయత్నించడం, ఆపై పోలీసుల అరెస్టులు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఇదంతా ఒకెత్తైతే, తెలంగాణ ఉద్యమమంతా తన ఒక్కడి సొత్తే అని విర్రవీగే కేసీఆర్ మాత్రం... పార్టీ ఆఫీసులో హాయిగా కూర్చుని కాఫీ తాగుతూ గడిపేశారు. అత్యంత కీలమైన ఈ రోజును, పైగా ఉద్యమం జోరుగా సాగుతున్న ఈ సమయంలో, కేసీఆర్ మాత్రం జెండా ఎగరవేయడానికి రాలేదు. పార్టీ ఆఫీసులోనే ఆయన ఉన్నప్పటికీ, పతాకావిష్కరణను మాత్రం నాయని నర్సింహారెడ్డి కానిచ్చేశారు. కేసీఆర్ ఇలా ఎందుకు వ్యవహరించారు.. ఎంత ఉద్యమనాయుకుడైనప్పటికీ, తానూ ఓ రాజకీయనాయకుడిననే అసలు రంగును బయపెట్టారు. కేసీఆర్ నాలుగు గదులకే పరిమితం అవడానికి కారణం, ముస్లిం ఓట్లు. అవకాశం ఉన్నప్పుడల్లా నిజాం భజన చేసే కేసీఆర్, చివరకు వారి మనసులు గెలుచుకోవడం కోసం, కీలకమైన రోజును కూడా తాకట్టు పెట్టేశారు. మూడుకోట్లకు పైగా ఉండే తెలంగాణ ప్రజలకన్నా.. వారి ఓట్లకన్నా.. అరకోటి మంది కూడా లేని ముస్లింలంటేనే కేసీఆర్కు ఎక్కువ ప్రాధాన్యమేమో.. (ముస్లింలను కించపరచాలని ఈ పోస్టు రాయడం లేదు, ప్రతీ విషయంలోనూ మైనార్టీ వారి ప్రయోజనాల కోసం మెజారీటీ ప్రజల హక్కులను తాకట్టు పెట్టడంపైనే నా ఆవేదనంతా). నిజాం చేసిన పనులకు, ఇప్పటి ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు. అయినా, నిజాంను వ్యతిరేకిస్తే, యావత్ ముస్లింలను వ్యతిరేకించినట్లవుతుందేమోనన్న సంకుచిత భావాలను మన రాజకీయనేతలో వారి మనసుల్లో చొప్పిస్తున్నారు. ఇది సరికాదు. తప్పును తప్పని చెప్పాలి.. ఒప్పును ఒప్పని చెప్పాలి.
తెలంగాణ నేతల్లో కేసీఆరే ఓ వ్యక్తి మాత్రమే. అతన్ని మించిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ, కేసీఆర్ను పెంచి పెద్ద చేస్తున్న మేథావులు, తెలంగాణ నేతలు, ఆయన అసలు స్వరూపాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఉద్యమం కూడా కేసీఆర్ చేతుల్లో లేదు. గ్రామగ్రామాన పాకింది. ఉద్యోగుల్లోకి చేరింది. విద్యార్థులు ఉప్పెనలా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రతీక్షణం సిద్ధంగానే ఉన్నారు. ఈ ప్రజా ఉద్యమాన్ని రాజకీయరంగంనుంచి విడదీసి, ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Why to just point KCR ? Who is not ?