12, సెప్టెంబర్ 2010, ఆదివారం
మాటల పులి
శనివారం సెకండ్ షోకు వెళ్లి కొమరం పులి సినిమా చూశా. సినిమా షూటింగుకు పట్టిన సమయం, పోలీస్ ఆఫీసరుగా పవన్ కొత్త వేషం.. తెరపైన ఎలా కనిపిస్తుందోనని వెళ్లా. ఇప్పటికే సినిమాకు ప్లాప్ టాక్ వినిపిస్తోంది. సినిమా స్టోరీలైన్ చిన్నదే అయినా, పకడ్బందీగానే తీశారు. బహుశా మన భారతదేశంలో భవిష్యత్తులోనూ సాధ్యం కానటువంటి పోలీస్ స్టేషన్ ను ఈ సినిమాలో చూపించారు. పవన్ కళ్యాణ్ అంటే సాధారణంగా యాక్షన్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కానీ, కొమరం పులిలో మాత్రం మనకు కొత్త పవన్ కనిపిస్తాడు. చేతలకు బదులు మాటలనే నమ్ముకున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాల్సిన దాన్ని చెప్పీచెప్పీ, సాగదీసి డైలాగులతో ప్రేక్షకులపై దాడి చేస్తాడు. చెప్పాలంటే పోలీస్ స్టోరీలో సాయికుమార్ ని మించిపోయాడు పులిలో పవన్.
ఈ సినిమాకు హీరోయిన్ పెట్టడం అనవసరమే అయినా, కొత్తమ్మాయి నికేషా పటేల్ అవకాశం ఉన్నంతవరకూ బాగానే నటించింది. సినిమాలో డైలాగ్ లను సగానికి సగం తగ్గిస్తేనే సినిమా బోర్ కొట్టదు. చేతల పులికి బదులు తెరపై మనకు మాటల పులే కనిపిస్తుంది. డైలాగ్స్ కూడా నేనే రాశానంటూ డైరెక్టర్ ఎస్.జె.సూర్య పేరు కూడా వేయించుకున్నాడు, కానీ, పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అంత కేర్ ఎందుకు తీసుకోలేదో అర్థం కాదు.
ఇక నా సలహా చెప్పాలంటే, ఓపిక ఎక్కువగా ఉంటే ఈ సినిమాను ఒక్కసారి చూడొచ్చు.
--- అన్ని తెలుగు సినిమాల్లానే, కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో సీన్లు ఈ కొమరం పులిలోనూ కనిపిస్తాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Nijame..enno asalatho innallu eduru chusina abhimanulaku pavan puli lo chukkalu chupinchadu.okka dialogue tho poyachota 15mts lecture isthu....... pavan veerabhimaninaina nake mental ekkinchadu.Au dialogues length taggiste cinema baneuntundi. ika police officer ga pavan getup kekaaaaa..
జీవితాన్ని ఓ సారి గమనించు గమ్యం ఎటు వెళ్ళుతుందో
నీవు ఎటు వెళ్ళాలో వెళ్ళుతున్న గమ్యం సరైనదా ఆలోచించు
సరికాని గమ్యమైతే వెళ్ళే దారిని మార్చుకుంటూ అధిగమించు
సరైన గమ్యంతో జీవితాన్ని సరి చూసుకొని విజ్ఞానంగా జీవించు
hi
welcome to my blog
gsystime.blogspot.com
read so much of social and spiritual knowledge
thanks
పవన్ కళ్యాణ్ లో ఒక మంచి నటుడు ఉన్నాడు. అంతకు మించిన మానవతావాది ఉన్నాడు. నో డౌట్. కానీ ఈ మధ్య (ఖుషీ సినిమా దగ్గరనుండీ) తానేం చేస్తే అదే కరక్ట్ అనిగానీ, లేదా తనకేది నచ్చితే అదే జనాలకు నచ్చితీరుతుందనే ఒకరకమైన ఒవర్‌కాంఫిడెన్స్ వచ్చినట్లుంది. లేకపోతే ఏంటండీ, ఖుషీలో ఏదో కొంచం భూమిక పుణ్యమా అనీ+అతను మొదటి సారిగా చేసాడు కాబట్టి ఆ వెకిళి మేనరిజంతో కూడిన కామెడీ అందరూ ఎంజాయ్ చేసారుగదా అని తరువాత్తరువాత అన్ని సినిమాలలో అదే కొనసాగించాడు. ఇప్పుడుకూడా ఏదో చెయ్యబోయి బొక్కా బోర్లా పడ్డాడు. I pity him.
సరే! ఈ గోలంతా వదిలేసి కాసేపు సరదాగా బుర్రకు పదును పెట్టుకుందాం. ఒక్క సారి నా బ్లాగు http://dare2questionnow.blogspot.com/ లోకి తొంగి చూడండి.
12 సరదా ప్రశ్నలు...మీ కోసం. సమాధానాల కోసం సరదాగా ట్రై చేయండి. వస్తే హ్యాపీ... రాకపోయినా ఎటూ త్వరలో నేను ఇస్తాను... మరిన్ని ఇలాంటి ప్రశ్నలతో.
1. మనం పుట్టినప్పటినుండీ ఒకే సైజ్ లోవుండే అవయవం ఏది? మరియు చనిపోయేంతవరకూ పెరుగుతూనే వుండే అవయవాలు ఏవి?
2. ప్రపంచంలో ప్రస్తుతం బ్రతికున్న మనుష్యుల సంఖ్య, కుక్కల సంఖ్య, కోళ్ళ సంఖ్య లలో ఏది ఎక్కువ?
3. ‘‘దౌస్’ అక్షరాలతో అంతమయ్యే 4 ఇంగ్లీషు పదాలను ప్రయత్నించండి. ఇఒకా ఎక్కువ వీలవుతాయా?
4. ఇంగ్లీషు అచ్చులు అయిన ‘అ,ఎ,ఇ,ఒ,ఉ’ లు అదే వరస క్రమంలో వచ్చేట్లు ఏవైనా రెండు పదాలు వ్రాయండి?
5. కళ్ళు కొట్టడంలో, సారీ ఆర్పడం (బ్లింక్) లో మగవారిది పైచేయా? ఆడవారిదా?
12 more సరదా ప్రశ్నలు-brain teasers. try solving them and enjoy.