గదిలో కట్టేసి కొడితే పిల్లైనా పులిలా తిరగబడుతుందన్నది సామెత. ఇక్కడ గోండుల కూడా అంతే. అన్యాయాలు.. అక్రమాలు.. నిజాం అండతో దొరలు చేసిన దౌర్జన్యాలతో విసిగిపోయిన గోండులు తిరగబడ్డారు. లేదు..లేదు తిరగబడేలా చేశాడు.. కొమరం భీమ్. కానీ.. అంతటి మహావీరుడి పోరాటం గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. ఆ లోటును ఇప్పుడు కొమరం భీమ్ సినిమా తీర్చనుంది.
రెండు దశాబ్దాల చీకట్లను చీల్చుకొని.. వెండితెరపైకి దూసుకువచ్చింది కొమరం భీమ్. అడవిబిడ్డల పోరాటాన్ని.. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన ధీరత్వాన్ని అందరికీ చూపించడానికి సిద్ధమయ్యింది. కొమరం భీమ్ కేవలం సినిమా మాత్రమే కాదు.. ఓ చారిత్రక గాథ.. అడవిబిడ్డల కోసం ప్రాణత్యాగం చేసిన ఓ వీరుడి జీవితం. ఆదిలాబాద్ అడవుల్లో జరిగిన చారిత్రక పోరాటానికి దృశ్యరూపంగా ఈ సినిమా 20 ఏళ్లక్రితమే సిద్దమయ్యింది. కానీ.. విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఇన్నాళ్లూ.. బాక్సుల్లోనే రీళ్లు మగ్గిపోయాయి. చెప్పాలంటే.. కొమరం భీమ్లానే.. మరుగున పడిపోయాయి. కానీ.. ఎంతోమంది చొరవ ఫలితంగా ఇప్పుడు విడుదలకు నోచుకుంది.
నిజాం నిరంకుశత్వాన్ని ధైర్యంగా ఎదిరించి నిలబడ్డ కొమరంభీమ్ చరిత్రే సినిమాకు ఆధారం. ఆనాటి పరిస్థితులను కళ్లకు కడుతూ.. చిత్ర కథను తయారు చేశారు. ప్రతీ సన్నివేశాన్ని హృదయాన్ని హత్తుకునేలా చిత్రీకరించారు డైరెక్టర్ అల్లాడి శ్రీధర్. సంభాషణల విషయంలోనూ వాస్తవికత ఏమాత్రం తగ్గిపోకుండా జాగ్రత్త వహించారు.
కొమరం భీమ్ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 1990లో తీసిన ఫిల్మ్ పాడవడంతో.. దానికి అదనపు హంగులు అద్దాల్సి వచ్చింది. సినిమా పాతదే అయినా.. డీఐ టెక్నాలజీతో క్వాలిటీని చాలా పెంచారు. అందుకే.. అప్పటి చిత్రానికి ఇప్పుడు విడులయ్యే సినిమాకు మధ్య ఎంతో తేడా ఉన్నట్లు కనిపిస్తుంది..
కొమరం భీం ఎవరు?
ఆదిలాబాద్ జిల్లా
అసిఫాబాద్ అడవులు..
ఇంకా చెప్పాలంటే.. జోడేఘాట్ ప్రాంతం.
ఒకప్పుడు అడవి చెట్ల ఆకుల గలగలలతో కళకళలాడిన చోటు. అడవితల్లినే నమ్ముకొని గోండులకు.. ఆ అడవే జీవనాధారం. వారిని అడవి ఎప్పుడూ మోసం చేయలేదు.. కానీ.. అడవితో సంబంధం లేని వారు మాత్రం అడుగడుగునా మోసం చేస్తూనే ఉండేవారు. ఎలాంటి సదుపాయాలు కల్పించకపోయినా.. ప్రభుత్వం సాయం అందించకపోయినా... కేవలం చెట్టూపుట్టను నమ్ముకొని బతుకుతున్నందుకే.. నిజాం నవాబు బలవతంగా పన్ను వసూలు చేసేవాడు. నిజాం పేరు చెప్పి.. అధికారులు దౌర్జన్యం చెలాయించేవారు. పన్ను కట్టకపోతే ప్రాణం తీసేవారు..
ఇక వ్యాపారులు చేసే దారుణాలకు అంతూపొంతూలేదు. గోండుల దగ్గర డబ్బుండదు కాబట్టి.. వస్తుమార్పిడి పద్దతే ఎక్కువగా అమలయ్యేది. పోడు వ్యవసాయంలో పండించిన కందులు తీసుకుని.. దానికి బదులు అతి తక్కువ ధరకు దొరికే ఉప్పును అంటగట్టేవారు. కిలో కందులు తీసుకుంటే పావుకిలో ఉప్పుకూడా ఇచ్చేవారు కాదు. ఇలా అడవుల్లో అష్టకష్టాలు పడి సేకరించిన విలువైన వస్తువులను దోచుకునేవారు. దారుణంగా అమాయక గోండులను మోసం చేసేవారు.
పోడు వ్యవసాయం పూర్తిగా ప్రకృతి ఆధారం. వాతావరణం అనుకూలిస్తే.. ఏదో కొద్దిగా పంట చేతికందేది. సరిగ్గా... అదే సమయానికి నిజాం బంటులు గోండుగూడేలపై విరుచుకుపడేవారు. పన్ను కట్టాలంటూ కనిపించినదంతా ఎత్తుకెళ్లేవారు. ఎదురు తిరిగినవారిని చిత్రహింసలు పెట్టేవారు. అందమైన అమ్మాయిలను కర్కశంగా అనుభవించేవారు. ఇలా ఎన్నో దౌర్జన్యాలను కళ్లముందే చూస్తే పెరిగాడు కొమరం భీం. చివరకు.. తన తండ్రినే అటవీశాఖ అధికారులు చంపడం చూసి చలించిపోయాడు. అయినా.. అధికారానికి ఎదురు తిరగలేక.. మరో ప్రాంతానికి వలస పోతుంది భీమ్ కుటుంబం. అక్కడా అధికారుల దౌర్జన్యాలే. భీమ్ సాగుచేసుకుంటున్న ప్రాంత మొత్తాన్ని సిద్దిఖీ అనే జాగీర్దార్ దురాక్రమించుకుంటాడు. గోండులచేత వెట్టి చాకిరీ చేయిస్తాడు. అణిగిమణిగి ఉండే కొద్దీ.. అధికార్ల పెత్తనం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని అర్థం చేసుకున్న కొమరంభీం.. ఆ జాగీర్దార్ను హత్య చేస్తాడు..
అయితే.. ఈ హత్యతోనే గోండుల పోరాటం మొదలుకాలేదు. నిజాం పోలీసులకు దొరకకుండా ఉండడానికి దేశం విడిచి వెళ్లిపోయాడు కొమరంభీమ్. అలా వెళ్లిన కొమరం భీమ్.. కొన్నాళ్లకే తిరిగి వచ్చాడు. అయితే.. ఇలా వచ్చింది కేవలం తనకోసం మాత్రమే కాదు.. యావత్ గోండుల కోసం.
అసలైన పోరాటం
కొమరం భీమ్ జోడేఘాట్‌కు మళ్లీ తిరిగివచ్చిన తర్వాత అసలైన పోరాటం మొదలయ్యింది. ప్రకృతి ఉచితంగా ఇస్తున్న వనరులను ఉపయోగించుకుంటుంటే. .మధ్యలో నిజాం పెత్తనం ఎందుకంటాడు కొమరం భీమ్. అందుకే.. గోండులకు నిజాం వేసిన బానిసత్వపు సంకెళ్లను తెంచడానికి పోరు బాట పట్టాడు..
జల్... జంగల్.. జమీన్.. హమారా...
జోడేఘడ్కు తిరిగివచ్చాక.. కొమరంభీం లేవనెత్తిన నినాదం. తమ ప్రాంతంలోని అడవి.. .నీరు.. భూమి.. వీటన్నింటిపై పూర్తి హక్కుండాలంటూ.. పెద్ద ఉద్యమానికే శ్రీకారం చుట్టాడు. దీనికోసం.. ఆయన చేసిన మొదటి పని గోండులను సమైక్య పరచడం. అధికారులు.. దొరలు.. వ్యాపారులు చేస్తున్న దౌర్జన్యాలను అర్థమయ్యేలా చెప్పడం. గిరిజనుల్లో మార్పు తీసుకొచ్చిన కొమరం భీం.. తమ హక్కుల సాధన కోసం ముందు అధికారులను కలిశాడు.. కానీ.. ఫలితం దక్కలేదు. ఇక తప్పని సరి పరిస్థితుల్లో పోరాటమే మార్గమనుకున్నాడు.. అడవితల్లి ఒడిలో స్వేచ్ఛగా బతికేందుకు స్వతంత్ర గోండు రాజ్య స్థాపన దిశగా అడుగులు వేశాడు..
జోడేఘాట్ చుట్టుపక్కల మొత్తం 12 గ్రామాలను నిజాంకు వ్యతిరేకంగా కదిలించాడు కొమరం భీమ్. ముందు చిన్నదే అనుకున్నప్పటికీ.. గోండుల పోరాటం ఎంత తీవ్రంగా సాగుతోందో ప్రభుత్వానికి అర్థమయ్యింది. పన్నుల వసూళ్ల కోసం వచ్చిన పోలీసులపై తిరగబడడంతో.. అడవిలో అడుగు పెట్టడానికి ఎవరూ సాహసించలేకపోయారు. కొమరం భీమ్‌ను లొంగదీసుకోవడానికి నిజాం బంట్లు ఎన్నో ఎత్తులు పన్నారు. కానీ.. వాటికి ఆ అడవి వీరుడు ఏమాత్రం లొంగలేదు. చివరకు.. కొమరంభీంతో కలిసి పోరాటం చేస్తున్న 12 గ్రామాలను ఏలుకోమంటూ ప్రలోభ పెట్టారు. అయినా.. భీంను తమవైపు తిప్పుకోవడం సాధ్యం కాలేదు.
కొమరం భీమ్ బలపడడాన్ని తట్టుకోలేకపోయిన నిజాం ప్రభుత్వం.. తనకు అలవాటైన కుట్రలను ఎంచుకొంది. కొమరంభీం వైపునున్న కొంతమందిని లోబర్చుకుంటుంది. భీమ్ వద్ద హవల్దార్‌గా పనిచేసిన కుర్దుపటేల్ ఇచ్చిన సమాచారంతో.. నిజాం పోలీసులు అడవిని చుట్టుముట్టారు. గెరిల్లా దళాలున్న ప్రాతంపై దాడి చేశారు. అయితే.. తమ వద్ద ఉన్న కొద్దిపాటి సంప్రదాయ ఆయుధాలతోనే పోలీసులను మూడు రోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టారు గోండు వీరులు. కానీ.. ఆహారం, ఆయుధాలు అయిపోవడంతో చివరకి వెనెక్కి తగ్గక తప్పలేదు. దీనికోసమే కాచుకొని ఉన్న పోలీస్ పటాలం.. మరింతగా విరుచుకుపడింది. కుర్దు చేసిన సైగల ఆధారంగా కొమరంభీమ్ను గుర్తించిన పోలీసులు ఆయన గుండెల్లో బుల్లెట్లు దింపారు. భీం మరణంతో గోండులు నిజాం సైన్యానికి లొంగిపోవాల్సి వచ్చింది. స్వతంత్ర్య గోండు రాజ్య స్థాపన కలగానే మిగిలిపోయింది.
అల్లూరి కన్నా తక్కువా?
అల్లూరి... ఇంటి పేరు చెబితే చాలు రాష్ట్రంలో ఎవరైనా.. అల్లూరి సీతారామరాజు గురించి చెబుతారు. మన్యంలో జరిగిన పోరాటాన్ని తలచుకుంటారు. దొరల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన తీరును వర్ణిస్తారు. అల్లూరిపై ఎన్నో పుస్తకాలు.. మరెన్నో కథలు.. మన్యం వీరుడిగా.. స్వాతంత్ర్య సమరయోధుడిగా అల్లూరికి ఎంతో కీర్తి దక్కింది.. దానికి ఆయన అర్హుడు కూడా..
మన్యంలో అల్లూరి దేనికోసమైతే పోరాడాడో... సరిగ్గా దానికోసమే ప్రాణం అర్పించాడు కొమరం భీమ్. అంతేకాదు.. ఎంతో ఆధునికంగా ఆలోచించి.. అప్పట్లోనే జల్..జంగల్..జమీన్ అంటూ సర్వ హక్కులూ కావాలన్నాడు. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన ఓ మనిషి.. ఇంతగా ఆలోచించడం గొప్పవిషయమే. పైగా నిరంకుశ నిజాం ఎదురిస్తూ.. స్వతంత్రరాజ్యస్థాపనకు కృషి చేయడం అసమాన్య విషయం. కానీ.. అల్లూరికి దక్కిన కీర్తిలో వీసమంతైనా కొమరం భీమ్‌కు దక్కలేదు.
3, జులై 2010, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Thanks for sharing this info. I am very proud of having such a hero on this soil.
దీని వెనుక సమైఖ్య వాదుల కుట్ర ఉంది . అందుకే అల్లూరికి పేరు వచ్చింది భీం కి రాలేదు.
meeru KCR hero gaapetti cinimaateeyamDI, meeranna samaikhyavaadulaki boddi vastumdi.
ఏమి తక్కువో మాకి తెల్వద్ , గాని మీకి మాత్రం బుర్ర తక్కువ అని తెలుస్తున్నాది. మీరు పణ్కిమాలిన ఎదవల్ అని మాత్రం సెప్పగలను. అట్లా కంపార్ చెస్తారు బే సువ్వర్ కె బచ్చె.
మీ పోలిక పక్కన పెడితె, కొమరం భీం గారి గురించి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
కొమరం భీం గురించిన పుస్తకాలు ఎమన్న వుంటె తెలుపగలరు.
komaram bheem mahaa yodhude
ilaa polikalu tevatam bhaavyam kaadu
komaram bheem mahaa yodhude
ilaa polikalu tevatam bhaavyam kaadu
ఈ వ్యాసంలోను, దీనికింద ఒక వ్యాఖ్యలోను చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ప్రతిదాన్నీ ప్రాంతీయ పట్టకంలోంచి చూడ్డం చాలా తప్పు. అల్లూరి సీతారామరాజు మీద హీరో కృష్ణ సినిమా తీసేదాకా (1971-72) ఆంధ్రా ఏరియాలో కూడా ఆయన గురించి తెలిసినవారు తక్కువే. అందాకా ఆయన పేరు మాత్రమే చూచాయగా వినపడేది. ఆ మనిషి గొప్పతనం గట్రా ఏమీ తెలియదు. నిజానికి ఆయన మీద సినిమా తీయడానికి తగినంత సబ్జెక్టు దొరకక అంతకుముందు ఎవరూ సాహసించలేదు కూడా. అలా వెనుకంజ వేసినవారిలో ఎన్.టి.ఆర్. కూడా ఉన్నారు. కృష్ణ మాత్రం అదనపు మేటర్ దొరక్కపోతే ఉన్న మేటర్ తోనే తీద్దామని నిర్ణయించుకున్నాడు.
అల్లూరి సీతారామరాజు బతికున్న రోజుల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆంధ్రవిభాగం ఆయన దేశభక్తుడు కాడనీ, ఒక దోపిడిదొంగ అని, ఆయన పద్ధతులతో కాంగ్రెస్ ఏకీభవించడం లేదనీ ప్రకటించడంతో ఆయన ప్రతిష్ఠకి చాలా నష్టం కూడా వాటిల్లింది.
కొమరమ్ భీమ్ చరిత్రమరుగున పడేసింది ఆంధ్రావారని ఆరోపిస్తే అసలు కొమరమ్ భీమ్ గురించి తెలంగాణవాళ్ళకే తెలియదు. ఇక ఆంధ్రావాళ్ళకేం తెలుస్తుంది ? బొత్తిగా తెలియని వ్యక్తిని మరుగున పడేసేది ఏముంటుంది ? తెలంగాణవారు ప్రతిదాన్నీ ప్రాంతీయంగా చూస్తారు కాబట్టి ఇతరులు కూడా అలాగే చూస్తారని భ్రమపడుతూంటారు. కానీ తెలంగాణతో పోల్చినప్పుడు నాన్-తెలంగాణ ప్రాంతాల్లో ప్రాంతీయభావాలు లేనేలేవు. ఇలాంటి సంకుచితాలన్నీ తెలంగాణలోనే ఉన్నాయి.
అన్నట్టు ఈ సినిమాకి ఇప్పటికైనా మోక్షం కలగడానికి కారణం పవన్ కల్యాణ్ "కొమరం పులి" సినిమా టైటిల్ వల్లే కదా :-)
ఈ టపాలో చాలా విలువైన సమాచారం ఇచ్చారు. అవును చరిత్ర చీకటికోణంలో పడి కనిపించని గాధలెన్నో కావాలిప్పుడు........దురదృష్టమేమిటంటే గొప్పవీరులకీ, ఉదాత్తమైన పోరాటభావజాలానికీ కూడా సంకుచిత ప్రాంతీయ ధోరణులను ఆపాదించుకుని చూడటం. మొదటి అజ్ణాత "ప్రత్యేక" సంస్కారంతో చక్కగా వ్యాఖ్యానించారు. .........అవును స్వాతంత్ర్యం వచ్చేవరకూ కాంగ్రేస్‌తో కలవని వాళ్ళంతా దోపిడీ దొంగలుగానే పరిగణించబడ్డారు. అది చారిత్రిక సత్యం. మన గాధలు మనమే తవ్వుకోవాల్సిన సమయమిది. చూద్దాం ఇంకా ఎందరు వీరులు ఈ నేల మీద కీర్తించబడకుండా ఉన్నారో.....
అనవసరమైన వివాదం ఎందుకని వ్యాసంలో చాలా విషయాలు రాయలేదు. పోలిక పెట్టడంలో ఉద్దేశం అల్లూరితో పోల్చితే కొమరం భీమ్‌కు కీర్తి దక్కలేదన్న ఉద్దేశాన్ని చాటి చెప్పడానికే. మరే ఉద్దేశం లేదు. ఇక ఎలాగూ వివాదం వచ్చింది కనుక అల్లూరి గురించి కొన్నివాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది.
అల్లూరి సీతారామరాజు కాదు.. అల్లూరి శ్రీరామరాజు. ఓ ప్రేమకథను, సీత అనే మహిళను శ్రీరామరాజు జీవితంలో భాగం చేసి.. ఆయన చరిత్రను కొంతమంది కళంకపరిచారు. ఆయన చదువుకున్న రికార్డుల్లోనూ.. చివరకు సమాధిపైన కూడా.. శ్రీరామరాజు అనే ఉంటుంది తప్ప.. సీతారామరాజని కాదు.
అల్లూరి చేసింది స్వాతంత్ర్య పోరాటం కాదు..
మన్యంలో అల్లూరి పోరాడింది గిరిజన హక్కులకోసమే తప్ప భారతదేశానికి స్వాతంత్ర్యం తేవాలని కాదు. గిరిజనులను హింసిస్తున్నవారిని, దోచుకుంటున్న వారినీ ఎదిరించాడు. గిరిజనులను చైతన్యపరిచి పోరాటానికి సిద్ధం చేశాడు. గిరిజనుల కోసం ప్రాణత్యాగం చేశాడు. నిజంగా అది గొప్ప విషయం. కానీ, అతన్ని స్వాంత్రత్య పోరాట యోధుడిగా చిత్రీకరించి విశేషమైన ప్రచారాన్ని కల్పించారు. అల్లూరి స్వాతంత్ర్యపోరాటం చేశాడన్ని అక్షరాలా అవాస్తవం.
వాస్తవానికి కొమరం భీం గిరిజనులకు ప్రత్యేకరాజ్యం కావాలని పోరాడాడు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. 12 గ్రామాలు ఏలుకోమంటూ ప్రలోభపెట్టినా లొంగలేదు.
ఇప్పుడు చెప్పండి.. అల్లూరికి, కొమరం భీమ్‌కి పోలిక పెట్టడం తప్పా..
" అల్లూరికి, కొమరం భీమ్‌కి పోలిక పెట్టడం తప్పా.."
మళ్ళీ గ్ట్లనే అడుగుతుండవ్. ఎందుకు పోల్చాల? కొమొరం భీం లేకుంటే బ్రిటిష్ వాళ్ళు పోయేటోళ్ళే కాదు అని, మేమన్న వద్దంటామా?
ఆపిల్ ఆపిలే ఆరంజ్ ఆరంజే! నీ ఇంట్లో కొమొరం భీం వ్యాయామశాల పెట్టుకో లేదంటే టాంక్బండ్ మీద్ ఇంకో బొమ్మ పెట్టుకో ఎవలొద్దన్నారు? దమాగ్ ఖరాబ్ పోల్‌కల్ చేయద్దు పటేలా, నీ బాంచన్ కాల్మొక్త.
ఒక్క రాష్ట్రంల ఉండి పోల్కలద్దంటె ఎట్ల గుదుర్తది? ఓడికేమొ పెద్ద పీటేసి, ఇంకోనికేమొ పీటనే ఏయ్యకపోతె ఊర్కుంటర?
మీవోడికి మావోడేం తక్కువని అడిగితె ఓర్వనోల్లు... ఇంక మీర్జెప్పేదేంది... మీ బొంద సమైక్యమా ? గిదేనావయ్య సమైక్యమంటె ?
గిట్లనే ఉంటద ? సిగ్గు లేకుండ మాట్లడ్తరు ... గందుకే ఎవడి రాష్ట్రం వాడికయితె ... ఎవడింట్ల వాడికిష్టమనోడి ఫోటో వెట్కుంటరు. ఏందివయ్య మీ జులుం ? మాట్లడ్తన్కైన సిగ్గనిపిస్త లేద ? గంత సిగ్గు దప్పున్నర ?
సత్యం గారూ.., ఉప్పు తయారు చేసుకోడం కోసం పోరాడారు తప్ప, అది స్వాతంత్ర్య పోరాటమా? ఎవడో ఒక డయ్య్రరును చంపాలని యత్నించాడు తప్ప అది స్వాతంత్ర్య పోరాటమా? ఏదో తమ బతుకమ్మలు తామాడుకోడానికీ, తమ పంటను తాము అనుభవించడానికీ, దోపిడీని ఎదుర్కోడానికీ పోరాడారు తప్ప అది విముక్తి పోరాటమా? విదేశ వస్తువులను బహిష్కరించి, స్వదేశ వస్తువులను వాడబూనారు గానీ, అది స్వాతంత్ర్య పోరాటమా? పన్నులు కట్టమన్నారుగానీ, అది స్వాతంత్ర్య పోరాటమా? చంపారన్ లో జరిగింది రౌతుల తిరుగుబాటే గానీ, స్వాతంత్ర్య పోరాటమా?
భీమ్ గొప్పతనం గురించి చెప్పడం అవసరం, కానీ అందుకు అల్లూరిని చిన్నబుచ్చడమెందుకు? ఒక వీరుణ్ణి గుర్తించకపోవడం తప్పు. అందుకని మరో వీరుణ్ణి అవమానించడం నేరసమానం!
నిజానికి మన నాయకులకు కీర్తి రాకపోవడానికి మనమే కారణం తప్ప మరోడు కాదు. భగత్ సింగును నెత్తినెట్టుకుని ఊరేగుతాంగానీ, అల్లూరిని గొప్పోడనాలంటే మనకు బోలెడు అడ్డొస్తై. కొమరం భీమ్ ను వీరుడిగా గుర్తించాలంటే -మనకే సందేహం గుర్తించొచ్చో లేదోనని. ఎంచేతంటే మనకు భావదారిద్ర్యం, భావ దాస్యం! ఒంటిమీద నాలుగంగుళాల మందాన భావదాస్యాన్ని పులుముకుని తిరుగుతూంటాం.. మనకు విముక్తి ఎక్కడిది? మన వీరులకు మన నేతలకు గుర్తింపెక్కడిది? మన బతుకులింతే.
ఇది చాలదన్నట్టు, మన కుచ్చితత్వం, మన సంకుచితత్వం చూడండి.. భీమ్ కు గుర్తింపు రానప్పుడు అల్లూరిని ఏదో రకంగా చిన్నబుచ్చుదాం అనే చవకబారు తత్వం. ఒక గీతను పెద్దది చెయ్యాలంటే పక్కనున్న గీతను చిన్నది చేస్తే చాలుననుకునే ఈ మనస్తత్వం నుండి బైటపడనంతవరకూ తెలుగువాడి బతుక్కే గుర్తింపనేది గగన కుసుమం. ఇక తెలుగు వీరులకు గుర్తింపు నిచ్చేదెవ్వడు?