26, జూన్ 2010, శనివారం
రసిక రాజధానులు
Categories :
ఒకప్పుడది చీకటి వ్యాపారం. చీకట్లు కమ్ముకుంటుంటే...వ్యాపారం జోరందుకునేది. పేద కుటుంబాల్లోనే వారే.. ఆ రొంపిలోకి దిగేవారు. కానీ.. ఇప్పుడు.. చీకట్లను దాటుకొని అది విస్తరిస్తోంది. హైక్లాస్ పేరుతో హైటెక్ సిటీనే మార్చేస్తోంది.
హైదరాబాద్‌లో జోరుగా సాగే బిజినెస్ అదే..
ఏ కాలమైనా.. ఏ సీజన్ అయినా... ఫుల్ బిజినెస్..
మాంద్యంలోనూ హవా తగ్గలేదు..
రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది
టర్నోవర్ పెంచుకోంటోంది..
ఇప్పుడు ఇంపోర్టెడ్ సరకునూ అందుబాటులోకి తెచ్చింది..
వేలకు వేలు పోయగలిగితే చాలు.. సర్వసుఖాలు క్షణాల్లో...
ఇంత హిస్టరీ చెబుతోంది.. ఒకే ఒక్క బిజినెస్ గురించి.. అదే వ్యభిచారం. అవును.. హైదారాబాద్‌కు ఇప్పుడు ఇదే అట్రాక్షన్. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వారంతా ముందుగా ఆరాతీస్తోంది కూడా దీనిగురించే. క్షణికానందం కోసం.. ఎంతైనా ఖర్చుపెట్టగలిగేవారు పెరుగుతుండడంతో... కాల్‌గర్ల్స్‌కు క్రేజ్ ఎక్కువవుతోంది. అందుకే.. రాష్ట్ర రాజధాని ఇప్పుడు రసిక రాజధానిగా మారిపోయింది. ఘనమైన చరిత్రను తోసిరాజని.. వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.
కుర్రాళ్ల బలహీనతను ఆసరా చేసుకుంటున్న సెక్స్‌ముఠాలు.. రాజధానిపై పట్టుబిగిస్తున్నాయి. రాష్ట్రం నలుమూల నుంచే కాక.. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నవారిని టార్గెట్ చేసుకుంటూ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అందమైన అమ్మాయిలను ఎరగా వేసి ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రతీ చోటా ఈ బ్రోతల్ హౌస్‌ల ఉనికి కనపడుతూనే ఉంది. ఇద్దరు ముగ్గురు అమ్మాయిల దగ్గర నుంచి మొదలుపెడితే.. నెట్‌వర్క్‌గా వందలాదిమందితో బిజినెస్ చేస్తున్న ముఠాలు కూడా ఇప్పుడు రాజధానిలో పాగా వేశాయి. పైగా.. మారుతున్న టెక్నాలజీని ఊతం చేసుకుని ఫోన్‌కాల్స్‌లోనే పని కానిచ్చేస్తున్నాయి. హైటెక్ పద్దతుల్లో తమ కస్టమర్లను సెట్ చేసుకుంటున్నాయి.
హైదరాబాద్‌లో మెయిన్ సెంటర్లైన.. బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్.ఆర్.నగర్‌లలోనే వందలాది సెక్స్‌ముఠాలు పనిచేస్తున్నాయి. వీఐపీలు, హైక్లాస్ వారి కోసం ప్రత్యేకంగా అమ్మాయిలను ఏర్పాటు చేస్తున్నాయి. వెరైటీ కోరుకునే వారికోసం ఏకంగా విదేశాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకువస్తున్నాయి. కస్టమర్ల ఎంపిక విషయంలోనూ ఈ సెక్స్ సెంటర్ల యజమానులు చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ఎంతో నమ్మకం కుదిరితేగానీ డీల్ కుదుర్చుకోరు. హైదరాబాద్ మొత్తం మీద చూస్తే.. ప్రతీరోజు కోట్లల్లోనే ఈ వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది.
కాస్ట్‌లీ వ్యాపారమే...
అబ్బాయిలకు ఎరవేసే బ్రోకర్లు హైదరాబాద్‌లో వేలల్లో ఉన్నారు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్, కాలేజ్ స్టూడెంట్స్, బ్యాచ్‌లర్స్‌ను వీరంతా ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి అందమైన అమ్మాయిలను రాజధానికి రప్పిస్తున్నాయి. కాస్ట్‌లీ ఏరియాల్లో డెన్‌లను ఏర్పాటు చేసుకొని.. సీక్రెట్ బిజెనెస్‌ను నిర్వహిస్తున్నాయి.
హైదరాబాద్‌లో సెక్స్ ట్రేడ్ డైలీ టర్నోవర్.. దాదాపు కోటి రూపాయలు. రాజధానిలో ఎంత హైరేంజ్‌లో వ్యభిచారం జరుగుతోందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి.. మనుషులను బట్టి రకరకాల లెవల్స్‌లో ఈ వ్యాపారం జరుగుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. మురికివాడల నుంచి ఫైస్టార్ హోటల్స్‌దాకా అన్నమాట. బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు, పార్కుల దగ్గర లోక్లాస్ వ్యభిచారం జరుగుతుంటుంది. ఇక మిడిల్ లెవల్ అంతా బ్రోకర్ల ద్వారా జరుగుతుంది. అమ్మాయిల ఫొటోలు చూపించి ఈ తరహా దందా నిర్వహిస్తారు. రోజుకు 1500 నుంచి 3 వేల దాకా వసూలు చేస్తారు. మూడోది హైటెక్ వ్యవహారం. హైటెక్‌లోనూ రకరకాల సర్వీసులున్నాయి. అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్‌ను అద్దెకు తీసుకుని వాటినే వ్యభిచార గృహాలుగా మార్చేస్తారు. విటులను రప్పించుకొని.. అక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఒక్కొక్కరి నుంచి 5 నుంచి 10 వేల దాకా వసూలు చేస్తారు. దీని తర్వాత స్థాయి హైక్లాస్ ఏరియాది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టల్లో ఈ తరహా దందా కొనసాగుతోంది. ఇండిపెండెంట్ హౌసుల్లో ఈ వ్యాపారం కొనసాగుతోంది. ఒక్కోరోజుకు 20 వేలకు పైగా ఖర్చుపెట్టగలిగితే తప్ప.. వీటిల్లోకి ఎవరూ అడుగుపెట్టలేరు.
ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెక్స్‌ట్రేడ్ కూడా జతకలుస్తోంది. పార్టీల పేరుతో నగర శివార్లలోని రిసార్టుల్లో ఈ తరహా బిజినెస్ ఎక్కువగా జరుగుతోంది. అశ్లీల నృత్యాలు.. ఆ పై అందాల విందులు వీటిల్లో కామన్. ఇక ఫామ్‌హౌసుల్లోనూ.. అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న సంఘటనలూ ఎక్కువగానే జరుగుతున్నాయి. గ్రూప్‌గా బుక్ చేసుకుంటారు కాబట్టి.. లక్షల్లోనే చెల్లించాల్సి ఉంటుంది.
ఇలా ప్రతీ చోటా జరుగుతోందనడానికి ఆధారం.. ఇటీవల వరసగా పోలీసులకు దొరుకుతున్న వ్యభిచార ముఠాలే. ఫాంహౌసులు, రిసార్టులపై దృష్టి పెట్టిన పోలీసులు.. పెద్ద సంఖ్యలోనే డ్యాన్సర్లను అరెస్ట్ చేశారు. ఇక బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనూ ఎన్నో వ్యభిచార ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ రెండు మూడు నెలల్లోనే వంద మందికి పైగా సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేశారు. అందరూ.. హైటెక్ సెక్స్ రాకెట్‌లో మునిగి ఉన్నవారే..
రాష్ట్రమంతా ఇదే రూటు
రాష్ట్రంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటి బెజవాడ. అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మ వెలసిన ఈ క్షేత్రం క్రమంగా వ్యభిచార కూపంలో కూరుకుపోతోంది. భక్తికి బదులు రక్తి రాజ్యమేలుతోంది. బెజవాడ బస్టాండ్ ఆధారంగా ఎంతోకాలంగా వ్యభిచార దందా జరుగుతున్నా ఎవరూ అరికట్టలేకపోతున్నారు. బస్సుదిగే ప్రతీ ప్రయాణీకుడిని.. ఎవరో ఒకరు లాడ్జీకి వెళదామంటూ అడగడం సర్వసాధారణం.
ఇప్పుడు మాత్రం ఈ బిజినెస్ కొత్త పుంతలు తొక్కుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్స్‌నే వ్యభిచార కేంద్రాలుగా మార్చేస్తున్నారు. ఫ్లాట్స్ అద్దెకు తీసుకోవడం.. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి విటులను ఆకర్షిస్తున్నారు.
అంతేకాదు.. మైనర్లతో వ్యభిచారం చేయించడంలోనూ విజయవాడది నెంబర్‌వన్ ప్లేస్. చిన్న పిల్లలను ఈ రొంపిలోకి దింపుతూ.. బ్రోకర్లు లక్షలు సంపాదిస్తున్నారు. అమ్మాయిలు కావాలంటూ.. జీ24 గంటల ప్రతినిధి అడిగితే.. బ్రోతల్ హౌస్ నిర్వహాకులు చెబుతున్న మాటలు వినండి.. పారిశ్రామికంగా.. పర్యాటకంగా ఎదుగుతున్న విశాఖలోనూ ఇదే పరిస్థితి. ఫ్రెండ్‌షిప్ క్లబ్‌ల పేరిట కుర్రాళ్లను బురిడీ కొట్టించి.. వ్యభిచారానికి అలవాటు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ వ్యభిచారం జోరుగానే సాగుతోంది. ప్రతీ పట్టణంలోనూ.. ముఠాలు భారీ ఎత్తున సెక్స్‌ట్రేడ్‌ను నిర్వహిస్తున్నాయి. లాడ్జీలు, హోటళ్లనే స్థావరాలుగా మార్చుకొంటున్నాయి. అప్పుడప్పుడూ పోలీసుల దాడుల్లో ఒకటీ అరా ఇలాంటి ముఠాలు దొరుకుతున్నా.. బయటకురాని ముఠాలు చాలానే ఉన్నాయి.
లక్షమంది సెక్స్‌వర్కర్లు
వ్యభిచారంపై రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహించిన ఓ సర్వే ఒళ్లు జలధరించే నిజాలను బయటపెట్టింది. గతంతో పోల్చితే రాష్ట్రంలో వ్యభిచారం పదిశాతానికి పైగా పెరిగిందని ఈ సర్వేలో తేలింది. దాదాపు 211 పట్టణాల్లో వ్యభిచారం పెద్దఎత్తున సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే.. మిగిలిన జిల్లాల్లోనే 56 వేలకు పైగా సెక్స్‌వర్కర్లు ఉన్నారని సర్వే చెబుతోంది. రాజధాని కావడంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే దాదాపు పదివేల మంది సెక్స్ వర్కర్లు ఉంటారని అంచనా. ఇదంతా అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఉన్నవారు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పోతున్నవారూ కలుపుకుంటే.. దాదాపు లక్షమంది మహిళలు.. వ్యభిచార వృత్తిలో కూరుకుపోయి ఉన్నారు.
వ్యభిచారానికి సంబంధించి 65 శాతం బుకింగ్‌లు కేవలం సెల్‌ఫోన్‌ల ద్వారానే జరుగుతున్నాయి. స్టార్‌హోటల్స్ నుంచి చిన్న చిన్న లాడ్జీల దాకా అన్నింటిలోనూ వ్యభిచారం జరుగుతూనే ఉంటోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖల్లో అయితే.. మసాజ్ సెంటర్ల రూపంలోనూ సెక్స్‌ట్రేడ్ కొనసాగుతోంది. పైకి మసాజ్ సెంటర్లలానే కనిపించినా.. అక్కడే.. బుకింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకప్రాంతానికి చెందిన వారు.. మరో ప్రాంతానికి వెళ్లి వ్యభిచారంలో పాల్గొంటున్నారు. ఈ నీచవృత్తిలో ఇరుక్కుంటున్న వారిలో మూడు రకాలున్నారు. పొట్టకూటి కోసం.. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యభిచారం చేస్తున్నవారు మొదటి రకమైతే.. రెండో రకం జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం ఒళ్లు అమ్ముకుంటున్నవారు. ఇక మూడోరకం.. బలవంతంగా ఈ రొంపిలోకి దిగినవారు. డబ్బుకోసం ఎవరో ఒకరు అమ్మేస్తే..వ్యభిచార గృహాలకు వీరు చేరతారు. అక్కడ బందీలై.. అందులోనే జీవిస్తారు.
దేశవ్యాప్తంగా చూస్తే.. ఢిల్లీ,ముంబై, కోల్‌కతా, పూణేల్లో వ్యభిచారం విశృంఖలంగా సాగుతోంది. ఇక్కడి రెడ్‌లైట్ ఏరియాల్లో ఎక్కువమంది అమ్మాయిలు మనరాష్ట్రం వారే. హైదరాబాద్, విజయవాడ, అనంతపురం కేంద్రంగా హ్యూమన్ ట్రాఫికింగ్ కొనసాగుతోంది. ప్రతీ నెలా కనీసం.. ఇరవై నుంచి ముప్పై మందిని ట్రాఫికింగ్ ముఠాలు తమ వలలో వేసుకుని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లిపోతున్నారు. ఇదంతా కూడా అత్యంత పకడ్బందీగా జరుగుతుంది. పేద కుటుంబాలు.. ఆదాయం కోసం ఎదురుచూసేవారిని టార్గెట్ చేసుకొని ముఠా సభ్యులు పని మొదలుపెడతారు. ఢిల్లీ, ముంబైల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని చెబుతారు. నెలకు ఇరవై, ముప్పైవేల జీతాన్ని ఆశచూపుతారు. చివరకు.. బ్రోతల్ హౌసుల్లో అమ్మేస్తారు. ఇలా దేశంలోని ప్రధాన పట్టణాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో.. ఎంతోమంది మహిళలకు విముక్తి లభించింది. వ్యభిచార గృహాల నుంచి సురక్షితంగా తీసుకొచ్చినప్పటికీ.. వీరందరికీ పునరావాసం కల్పించడమే సమస్యగా మారుతోంది.
మగాళ్లదే తప్పు..
లక్షమంది వ్యభిచారం చేస్తున్నారంటే.. దానికి పదింతల మగాళ్లు.. సెక్స్‌కోసం పక్కదారి పడుతున్నట్లే లెక్క. ఇంత విచ్చలవిడిగా రాష్ట్రంలో వ్యభిచారం సాగుతున్నా.. పూర్తిస్థాయిలో అదుపు చేయలేకపోవడంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని పట్టణాలన్ని రసిక రాజధానులు మారిపోయినా... ఎయిడ్స్ లాంటి మహమ్మారి ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నా.. ఈ వృత్తికి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.
ప్రపంచంలోనే అతిపురాతన వృత్తి వ్యభిచారం. ప్రభుత్వాల అనుమతి లేకున్నా.. విచ్చలవిడిగా సాగుతూనే ఉంది. హైటెక్ రూపానికి మారి. .మరింత రెచ్చిపోతోంది. పెద్దగా కష్టపడకుండానే తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న ఆశే వ్యభిచారం వైపు అమ్మాయిల చేత అడుగులు వేయిస్తోంది. సరిగ్గా ఈ కాసుల వలనే అందమైన అమ్మాయిలపై వేస్తున్నారు బ్రోకర్లు. వ్యభిచారంలోకి దింపుతున్నారు. ముందుగా అడ్డుకోవాల్సింది ఇలాంటి వారినే..
అయితే.. శరీరాలను అమ్ముకుంటూ సాగించే ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైడ్స్‌లో పట్టుబడ్డప్పుడు అమ్మాయిలనే కాక.. విటులను, బ్రోకర్లకు కూడా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. బలవంతంగా అమ్మాయిలను ఈ రొంపిలోకి దింపుతున్న వారిపై.. కఠినాతికఠినంగా వ్యవహరించాలి.
వ్యభిచారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇప్పుడు ఎక్కువగా హైక్లాస్ వ్యభిచారంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. హైటెక్ సెక్స్ బిజినెస్‌లో మునిగితేలుతున్నవారినే అరెస్టులు చేస్తున్నారు.
అయితే.. వ్యభిచారం గుట్టుగా సాగుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఉప్పును అందించాల్సింది స్థానికులే. అంతేకాదు.. మీ పరిసర ప్రాంతాల్లో వ్యభిచారం జరగకుండా చూసుకోవాల్సింది కూడా పబ్లిక్కే.
వ్యభిచారంలో ఉన్న మహిళలంతా కోరుకుని వచ్చినవారు కాదు.. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినవారు. అందుకే.. వీరిని రక్షించడం మాత్రమేకాదు.. పునరావాసమూ దొరికేలా చేయాలి. మరో ఆదాయమార్గం ఉంటే.. మూడొంతుల మంది.. వ్యభిచారం నుంచి బయటపడతారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
thanx for the information
NIJAM CHAPPALANTE EEDO MANADARIDRAM ANI CHAPPALI ANDUKANTA DEENILI 50%&50% ANTE GOVT. TAPPU