2, ఏప్రిల్ 2010, శుక్రవారం
పెళ్లి తారలు...
గ్లామర్.. యాక్షన్.. ఈ రెండింటితో.. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్లో సీనియర్ అయిపోయాడు.. జూనియర్ ఎన్టీఆర్. పేరుతో పాటు.. పోలికలనూ తాతనుంచి పుణికిపుచ్చుకున్న ఈ హీరోకి ఇప్పుడు పెళ్లి కళ వచ్చేసింది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి.. పెళ్లి తేదీకూడా ఫిక్స్ అయిపోయింది. అందుకే.. ఎన్టీఆర్ చూపించిన దారిలోనే.. నడవాలన్న నిర్ణయానికి వచ్చేశారు చాలా మంది తెలుగు కుర్ర హీరోలు.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో అందరికన్నాముందుగా సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్.. పెళ్లి విషయంలోనూ.. అంతే తొందర చూపించాడు. తోటి హీరోలు సినిమాల జపం చేస్తుండగానే... ఈ నందమూరి వారసుడు మాత్రం మూడుముళ్లవైపు మొగ్గుచూపాడు. నార్నే వారి అమ్మాయి లక్ష్మీప్రణతితో పెళ్లికి ఒప్పేసుకున్నాడు. గురువారం ఉదయమే.. నిశ్చితార్థం కూడా జరుపుకొని.. పెళ్లితంతుకు తెరలేపాడు.
లక్ష్మీ ప్రణతి టీడీపీ అధినేత చంద్రబాబు బంధువుల అమ్మాయి. ఈ పెళ్లి కుదరడంలోనూ బాబుది కీలక పాత్రే. ఉదయం ఉదయం 8గంటల 15 నిమిషాలకు ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతిల నిశ్చితార్థం అత్యంత వైభవంగా జరిగింది. చంద్రబాబు, బాలకృష్ణలు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇరుకుటుంబాలకు చెందిన మరికొంతమంది సన్నిహితుల సమక్షంలో.. పెళ్లిముహూర్తాన్ని కూడా నిర్ణయించేశారు. నవంబర్ 18న అత్యంత వైభవంగా వీరి విహాహం జరగనుంది.
నందమూరి, నార్నే కుటుంబాల మధ్య ఈ వివాహం జరుగుతున్నా.. నారావారికే.. దీనివల్ల ఎక్కువ లబ్ది చేకూరవచ్చని తెలుస్తోంది. టీడీపీ తరపున ఇటీవల ఎన్నికల్లో ప్రచారం చేసిన ఎన్టీఆర్.. ఈ పెళ్లితో చంద్రబాబుకు మరింత సన్నిహితుడయ్యాడు. చంద్రబాబుకు, ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య ఈ పెళ్లితో కొత్త బంధం, బంధుత్వం ఏర్పడుతోంది. ఈ పెళ్లి తర్వాత.. టీడీపీకి అవసరమైనప్పుడల్లా.. ఎన్టీఆర్ తన సేవలు అందిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దీనివల్ల పార్టీకి కూడా మేలే ఎక్కువగా జరుగుతుందన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. బాలకృష్ణతో వియ్యమందడం ద్వారా.. ఆ కుటుంబం పూర్తి సపోర్ట్ సంపాదించిన చంద్రబాబు... ఎన్టీఆర్ పెళ్లితో.. రెండో వైపు సపోర్ట్ కూడా సులువుగానే అందుకున్నారు.
మళ్లీ పెళ్లికూతురైన సానియా...
సానియామీర్జాకు మరోసారి పెళ్లికళ వచ్చింది. ఇంతకు ముందే.. హైదరాబాద్ అబ్బాయి సోహ్రబ్ మీర్జాతో నిశ్చితార్థం జరిగనప్పటికీ.. వ్యక్తిగత కారణాలతో ఆ వివాహం రద్దయ్యింది. ఇంకా ఆటకు దూరం కావాల్సిన సమయం రాలేదని అప్పట్లో అనౌన్స్ చేసిన సానియా.. సైలెంట్‌గా.. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు లవ్ సిగ్నల్ ఇచ్చేసింది. పెళ్లికి రూట్ క్లియర్ చేసుకుంది.
సానియా-మాలిక్‌ల పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించడం.. వీసాల కోసం దరఖాస్తులు చేసేసుకోవడం.. రిసెప్షన్ తేదీలు ఫిక్స్ చేసుకోవడమూ జరిగిపోయింది. పాక్ టెలివిజన్ ఛానల్ చెప్పడంతో.. ఈ పెళ్లి వ్యవహారం బయటపడింది. ఆ తర్వాత దీన్ని సానియా అంగీకరించింది. ఎప్పుడూ లేనంత సంతోషం ఇప్పుడు సానియా ఫేస్‌లో కనిపిస్తోంది. సోహ్రబ్‌తో నిశ్చితార్థం సమయంలోనూ మూడీగానే ఉన్న సానియా... ఇప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంది. అయితే.. ఆమె ఆశలపై నీళ్లు చల్లుతూ.. కొత్త కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. షోయబ్ మాలిక్ ఇంతకు ముందే హైదరాబాదీ అమ్మాయి ఆయేషాను పెళ్లి చేసుకున్నాడని.. ఆమెకు ఇంకా విడాకులు ఇవ్వలేదన్న ఆరోపణలు.. సానియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతేకాదు.. షోయబ్‌మాలిక్ పై కేసు కూడా పెడతానంటూ... ఆయేషా తండ్రి బెదిరించడమూ సానియా పెళ్లిపై అనుమానాలు కలిగిస్తోంది.
అంతేకాదు.. పెళ్లైనా భారత్‌కే ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించింది సానియా. కానీ.. పాకిస్తాన్ టెన్నిస్ కోచ్ మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. మాలిక్‌ను పెళ్లి చేసుకుంటే.. సానియా పాకిస్తాన్ పౌరురాలవుతుందని.. పాక్ తరపునే టెన్నిస్ ఆడాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇలా ఒక్కో సమస్య.. టెన్నిస్ స్టార్‌ను ఇబ్బందిపెడుతున్నా... పెళ్లికి మాత్రం పనులు జరిగిపోతున్నాయి. ఇప్పటికీ డేట్ ఫిక్స్ కాకపోవడంతో.. పెళ్లి ఏ క్షణమైనా... ఎక్కడైనా జరగొచ్చని తెలుస్తోంది.
అల్లు వారి నోట పెళ్లి మాట
వరుడిగా అందరి ముందుకూ వచ్చిన అల్లు అర్జున్ రియల్ లైఫ్‌లోనూ పెళ్లి కొడుకుగా మారాలని ఉత్సాహపడుతున్నాడు. పాతికేళ్లు పూర్తి చేసుకోవడంతో పాటు.. కెరీర్ కూడా హాయిగా సాగిపోతుండడంతో.. మనసు పెళ్లి వైపుకు మళ్లినట్లుంది. అందుకే.. వరుడి గెటప్‌తో నిజంగా పెళ్లి చేసుకున్నంత యాక్షన్ చూపించాడు వరుడు సినిమాలో. సిక్స్ ప్యాక్ ఫిజిక్.. స్పెషల్ లుక్స్.. స్టైలిష్ మూవ్మెంట్స్... వీటికి అదనంగా దుమ్ములేపే డ్యాన్స్.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి.. ఇప్పటికే బన్నీకి ఎంతోమంది అమ్మాయిలు ట్రై చేసి ఉంటారు. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకనుకున్నారో ఏమో... పెళ్లికి సమయం వచ్చేసిందన్న విషయాన్ని అల్లుఅర్జున్ పేరెంట్స్ గుర్తించారు. మనసులో ఎవరైనా ఉంటే చెప్పమనీ అడిగారు. ఓ చిరునవ్వు నవ్వేసిన అర్జున్.. పెళ్లి కుదిర్చే బాధ్యతను వారి చేతుల్లోనే పెట్టేశారు. అమ్మాయి ఎలా ఉండాలన్న విషయంలో మాత్రం కొన్ని కండిషన్స్ కూడా పెట్టాడు.. తను సినిమాల్లో అల్లరిగా ఉన్నా.. రియల్ లైఫ్‌లో కూల్‌గానే ఉంటాను కాబట్టి అమ్మాయి కూడా పద్దతిగానే ఉండాలంటున్నాడు..
ముదురు హీరోలు
ప్రభాస్.. టాలీవుడ్లో సూపర్ హైట్.. హైట్‌కి తగ్గ పర్సనాలిటీ.. ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. అతి తక్కువ కాలంలోనే తన యాక్షన్‌తో మంచి నటుడని ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. అంతేకాదు.. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ కూడా ప్రభాస్ అని ప్రచారం. తక్కువ సినిమాలతోనే మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ యాంగ్రీయంగ్మ్యాన్కీ పెళ్లిపై మనసు పడింది. వయస్సు కూడా పరుగులు పెడుతూ మూడు పదులను దాటేసింది.
ఆరడుగుల రెండు అంగుళాల ఎత్తుతో ఆకర్షణీయంగా ఉండే ప్రభాస్.. సెట్స్‌లో చాలా సరదాగా ఉంటాడు. అందరినీ డార్లింగ్ అంటూ పిలుస్తూ ఆటపట్టిస్తుంటాడు. అయితే.. అమ్మాయిలంటే మాత్రం ఇప్పటికీ కాస్త బెదురే. అందుకే.. ఇప్పటివరకూ ఇంకా ఎవరికీ ప్రపోజ్ చేయలేదు. నవ్వుతూ నవ్వించే అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఎన్టీఆర్, బన్నీల తరహాలోనే.. ఫ్యామిలీ సెలక్షన్కే ఓకే చెబుతున్నాడు.
ఏజ్ విషయంలో ప్రభాస్ దారే.. గోపిచంద్‌ది కూడా. స్క్రీన్ మీద యంగ్‌గా కనపడుతున్నా.. ఈ జూన్ కళ్లా 35 ఏళ్లు వచ్చేస్తాయి. అందుకే.. పెళ్లి చేయాలని గోపీచంద్ ఫ్యామిలీ తొందరపడుతోంది. చూడడానికి అందంగా కనిపించే.. ఈ హీరోకి తగిన జోడు కోసం.. ఇప్పటికే సెర్చింగ్ మొదలయ్యింది.
ఈ ఏడాది కానీ.. వచ్చే ఏడాది కానీ.. కచ్చింతంగా అమ్మాయి మెడలో వరమాల వేసేస్తాడు గోపీచంద్. మొత్తంమీద చూస్తుంటే.. సినిమాల్లో ప్రేమ ప్రేమ అంటూ అమ్మాయిల చుట్టూ తెగ తిరిగే ఈ హీరోలు.. అసలు పెళ్లికి వచ్చేసరికి కుటుంబం చేతిలో పెట్టేస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సానియా కి ఇండియా లో మొగాడే దొరక లేదా..... పాకిస్తాన్ కి వెళ్తే పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే చంపేస్తారు. జగ్రత్హ సానియా
ప్రభాస్ పెళ్ళేంటండి,వాళ్ళనాన్న గారుపోయి ఇంకా నెలకూడా కాలేదు.
రాజేంద్ర గారు..
మన వాళ్ల ఆచారం ప్రకారం.. ఇంటిపెద్ద చనిపోతే ఏడాదిలోగా పెళ్లి చేయాలంటారు. అలా అవకాశం ఉంది. లేదంటే.. మరో మూడేళ్లు ప్రభాస్ ఆగాల్సి ఉంటుంది. మీ అనుమానం చెప్పినందుకు ధన్యవాదాలు. ఏజ్ ప్రకారం ఎవరు నెక్ట్స్ అన్న దానికే ఇక్కడ రాయడం జరిగింది.