భారత్కు పోటీగా పాకిస్తాన్ తయారు చేసుకున్న అణ్వాస్త్రాలు ఆ దేశ పాలకుల నియంత్రణ నుంచి అమెరికా చేతుల్లోకి వెళ్లిపోయేలా కనిపిస్తున్నాయి. పాక్లో ఇటీవలి కాలంలో తాలిబన్ల దాడులు పెరిగిపోవడం.. అణ్వాస్త్ర ప్రదేశాలను టార్గెట్ చేసుకోవడంతో కలవర పడిన అమెరికా కొత్త ప్రతిపాదనకు సిద్ధమయ్యింది.
పాకిస్థాన్లోని కీలక సైనిక స్థావరాలపై ఇటీవలి కాలంలో దాడులు జరగుతూండడంతో ఆందోళన చెందిన అమెరికా ఆ దేశంలోని అణ్వస్త్ర స్థావరాలున్న ప్రదేశాలను సీల్ చేసి, అవి ఉగ్రవాదుల చేతుల్లో పడకుండా చర్యలు తీసుకునేందుకు తమ సైనిక దళాలకు చెందిన ఒక బృందాన్ని పంపనుంది.'సన్ డే టైమ్స్' పత్రిక ఇటీవల ఈ విషయాలు పేర్కొంది. పాకిస్తాన్ భద్రతా వ్యవస్థలోని వారి సాయంతో ఉగ్రవాదులు ఆ దేశ అణ్వస్త్రాలను గాని, వాటిని తయారు చేసే పదార్థాలను గాని చేజిక్కించుకునే పరిస్థితి ఏర్పడిన పక్షంలో వాటిని మూసివేయడం లేదా తిరిగి స్వాధీనం చేసుకునే విధంగా ఈ బృందానికి అమెరికా సైన్యం శిక్షణనిస్తోందని ఆ పత్రిక తెలిపింది. గత రెండు సంవత్సరాలుగా పాకిస్థాన్లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు జరుగుతున్నాయి. వాటిలో కొన్నిటిలో అణ్వస్త్రాలు కూడా ఉన్నాయి. దీనితోగత పక్షం రోజుల్లో అమెరికా అధికారులు పాకిస్తాన్ నాయకత్వానికి అధికారికంగా పలు ఫిర్యాదులు పంపారు. ఈ సందర్బంగా ఆ పత్రిక సిఐఎ మాజీ అధికారి రాల్ఫ్ మౌలట్ లార్సన్ వ్యాఖ్యలను ఉటంకించింది. పాకిస్థాన్లో అణ్వస్త్రాలు ప్రపంచంలోఎక్కడా లేనంత ఎక్కువ మంది ఉగ్రవాదులకు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నట్టు ఆ పత్రిక తెలిపింది. అణ్వస్తాలున్న స్థావరాలపై దాడులతో బాటు వాటిలోకి ఉగ్రవాదుల చొరబాట్లు, దాడులు జరిగాయని ఆపత్రిక పేర్కొంది.పాకిస్థాన్ వద్ద 80వరకూ అణ్వస్త్రాలున్నట్లు భావిస్తున్నారు. ఇవి ఉగ్రవాదులకు చిక్కితే ఘోర ప్రమాదం సంభవిస్తుంది కాబట్టి.. వాటిని కాపాడే పనిలో పడింది అమెరికా.
18, జనవరి 2010, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అపాత్ర దానం చెయ్యనేల ఇలా కళవెళపడనేల. అమెరికా ఎప్పుడూ ఇలాంటి పనులే చేసి అనవసర అప్రదిష్ట తెచ్చిపెట్టుకుంటూనే ఉన్నది.
this is to "ckeck" India on one side and Iran on the other side.
it is no big secret.
ఆ టైమ్స్ లంకే కూడా ఇచ్చి ఉంటె బావుండేది. వెతుక్కునే శ్రమ తప్పేది.