17, డిసెంబర్ 2009, గురువారం
ఏది నటన ? ఏది నిజం ?
దగా పడిన తెలంగాణ అన్నాడు.. జగిత్యాల సాక్షిగా.. సామాజిక తెలంగాణ సాధిస్తామని ప్రకటించాడు.. ఆయన మన మెగాస్టార్. ఇంతకాలం జనం గుండెల్లో సుప్రీంహీరోగా ఉన్న చిరంజీవి.. తొలిసారి విలన్గా మారిపోయారు. ప్రజల మనోభీష్టం మేరకే నిర్ణయం మార్చుకుంటున్నాటంటూ.. ఇప్పుడు సమైక్యకు జై కొట్టాడు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్యమం కారణంగా ప్రజారాజ్యం పార్టీ నిర్ణయంలో మార్పు వచ్చిందని ప్రకటించారు చిరంజీవి. రాష్ట్రంలో మార్పు తెస్తానంటూ.. ప్రగల్భాలు పలికి.. చివరకితానే మారిపోయారు. ఇంకా చెప్పాలంటే.. రంగు మార్చడమే రాజకీయమన్న భాష్యానికి అసలు సిసలు అర్థాన్ని చెప్పారు. అందరి రాజకీయనేతల్లాగే.. తానూ పొలిటికల్ లీడర్నే అని అనిపించుకున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అడుగడుగునా అన్యాయం జరిగిందంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టి.. ఇప్పుడు చిన్నరాష్ట్రమైతే అభివృద్ధి సాధ్యం కాదంటూ ప్రకటించారు. రాష్ట్రం కలిసికట్టుగా ఉంటేనే అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధ్యమంటున్నారు. రాష్ట్రం విడిపోవడానికి ఉద్యమాలు జరిగాయి కానీ, సమైక్యం కోసం ఉద్యమం జరగడం ఇదే తొలిసారంటూ సీమాంధ్రలో సాగుతున్న ఆందోళనలకు ఆయన మద్దతు పలికారు. సమైక్య రాష్ట్రం కోసం గురువారం నుంచి విస్తృతంగా పర్యటించడానికీ సిద్ధమయ్యారు. పైగా.. జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలకూ సరిగ్గా సమాధానం చెప్పకుండానే ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి హడావిడిగా వెళ్లిపోయారు. ఇప్పటికే తెలంగాణలో చిరంజీవికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలయ్యింది. ఆర్య, మగధీర సినిమా ప్రదర్శనలను అడ్డుకుంటున్నారు. ఇది మరింత తీవ్రం కావచ్చు.. ఉద్యమం సంగతి అటుంచితే.. చిరంజీవి సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి...
1. ప్రజల మనోభీష్టం కోసమే నిర్ణయాన్ని మార్చుకున్నామంటున్న చిరంజీవి దృష్టిలో ప్రజలంటే ఎవరు.. సీమాంధ్రులా.. తెలంగాణ ప్రజలా....
2. ఏ పార్టీ అధినేత కూడా రాజీనామా చేయకుండానే.. చిరంజీవి సమైక్యకు మద్దతుగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
3. అందరితో చర్చించిన తర్వాతే సమైక్యకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామంటున్నారు చిరంజీవి.. సామాజిక తెలంగాణ అన్నప్పుడూ ఇదే మాట చెప్పారు.. మరి ఈ రెండింటిలో దేన్ని మనం నమ్మాలి
4. ఎన్నికల సమయంలో తెలంగాణ .. ఇప్పుడు సమైక్య నినాదం ఎత్తుకున్న చిరంజీవి.. మళ్లీ తెలంగాణలో ఆందోళనలు జరిగితే నిర్ణయం మార్చుకోరని గ్యారెంటీ ఉందా?
సిరిసిల్ల చావులు చూసి చలించిపోయారు.. పోలేపల్లి సెజ్ బాధితులను పరామర్శించారు.. సామాజిక తెలంగాణ ఇస్తామన్నారు.. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెస్తామన్నారు.. ఎమ్మెల్యేగా గెలిచారు.. తానే మారిపోయారు.. మాట కూడా మార్చారు.. తాను నటుడిని కాదు.. పక్కా రాజకీయనాయకుడినేనని నిరూపించుకున్నారు. ఇందులో ఏది నటన ? ఏది నిజం?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీ అవేదన అర్ధం చేసుకోదగ్గదే. అయితో ఒక పచ్చి నిజాన్ని కూడా నమ్మాలి. మెజారిటీ ప్రజల అభిప్రాయాల్ని బైపాస్ చేసిన ప్రతి తెలంగాణేతర నేతలందరిదీ ఇదే దుస్థితి. ఇక మీ రెండో పాయింట్ కి ఓ సమాధానమిచ్చారు చిరంజీవి. అదేమంటే తాను ఎలక్షన్ల ముందు రాష్ట్రాన్ని విడదీయటానికి మద్దతిస్తానని చెప్పి, ఈ రోజు మనసు మార్చుకున్నందుకు గాను రాజీనామా చేస్తున్నానన్నారు. ఈ సమస్యపై చాలా లేటుగా స్పందించారు ప్రజరాజ్యం పార్టీ నాయకుడు. మొన్నటిదాకా మగధీర సినిమాని పొగిడి, చిరంజీవి అభిమానులమన్నవారెందరో ఈరోజు ఆ సినిమా ఆడే ధియేటర్లపై దాడి చేస్తున్నారు. అంటే వాళ్ళ అభిమానమంతా నటనేనంటారా? పరిస్థితులనిబట్టి అభిప్రాయాలు మారటం మానవ సహజం.
One small correction:
"మెజారిటీ తెలంగాణేతర తెలుగు ప్రజల అభిప్రాయాల్ని బైపాస్ చేసిన తెలంగాణేతర నేతలందరిదీ ఇదే దుస్థితి." This looks right.
ఒక చిరంజీవే కాదు దాదాపు అన్ని పార్టిల నాయకులు ముక్తకంఠంతో ప్రత్యేక రాష్ట్రం కొరకు తెలంగాణ ప్రజల్లోకి వచ్చి ప్రతిజ్ఞలు చేసి నిజమైన మాటలేనని అమాయక వోటర్లను నమ్మించి మోసం చేసి కాంగ్రెస్ రంకు పార్టీని గెలిపించారు. ఇది తడిగుడ్డ కప్పేసి గొంతుకోసి గిలగిలా తన్నుకు చస్తుంటే చూసి ఆనందించటం కాదంటారా? ఇలాంటి నేరానికి గల్ఫ్ దేశాల్లో ఏం శిక్ష వేశ్తారో తెలుసా... చచ్చేదాకా జనాలచేత నడి వీధిలో రాళ్ళతో కొట్టిస్తారు. అలా చేస్తే ఇంకో నాయకుడు ఇలాంటి నేరాలు చేయడు. తెలంగాణలో నక్సలిజం ఎక్కువగా ఇందుకే వుండేది మరి.