ఒకే ఒక్క ప్రకటన.. తెలంగాణలో పది రోజుల ఆందోళనలను చల్లార్చింది.. అదే.. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నామంటూ.. కేంద్ర హోమంత్రి చిదంబరం చేసిన స్టేట్‌మెంట్..
మళ్లీ అదే చిదంబరం.. మళ్లీ ఒకే ఒక్క ప్రకటన.. అంతే.. తెలంగాణ భగ్గుమంది.. సీమాంధ్రలో సాగుతున్న సమైక్య ఉద్యమానికి తలొగ్గుతూ.. తెలంగాణపై పదిహేనురోజుల్లోనే.. మరో ప్రకటన చేయాల్సి వచ్చింది హోంమంత్రి చిదంబంరం.
తెలంగాణ ప్రక్రియలో అందరితోనూ సంప్రదింపులు జరుపుతామన్నది చిదంబరం తాజా మాట. అయితే.. ఎలాంటి సంప్రదింపులు? ఎవరితో? ఎంతకాలం? ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. తెలంగాణపై కేంద్రప్రభుత్వ సాగదీత ధోరణికి ఈ ప్రకటన ఓ నిదర్శనమన్న ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ ప్రక్రియ మొదలవుతుంది అని ప్రకటించిన తర్వాత.. కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రకటించింది లేదు. సీమాంధ్ర నేతల చేసిన మనీ లాబీయింగ్ వల్లే.. తెలంగాణపై సర్కార్ నిర్ణయాన్ని మార్చుకొందని.. కాంగ్రెస్ ఎంపీలే నేరుగా ప్రకటించడం విస్మయం గొలుపుతోంది.
తెలంగాణ ఇవ్వం అని నేరుగా చిదంబరం స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. కానీ.. సంప్రదింపులన్న పదం వాడడంతోనే అసలు గొడవ మొదలయ్యింది. ఇప్పటికే రాజకీయపార్టీలు రాష్ట్ర విభజన విషయంలో స్పష్టమైన వైఖరికి వచ్చేశాయి. ప్రజారాజ్యం పార్టీ సమైక్యకే జై కొడుతోంది. పార్టీలో విభేదాలున్నప్పటికీ.. ఉమ్మడి రాష్ట్రానికే చంద్రబాబు మొగ్గుచూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ స్పష్టమైన విభజన. ఇక్కడ పార్టీల మధ్య విభజన కాకుండా.. ప్రాంతాల మధ్య విభజన ఏర్పడింది. అన్ని పార్టీలు రెండుగా చీలిపోయాయి. అయితే.. ప్రజాప్రతినిధుల సంఖ్యలో చూస్తే మాత్రం ఆంధ్రాప్రాంతానికే మెజార్టీ ఉంది. వారంతా సమైక్యానికే మొగ్గు చూపుతారు కాబట్టి.. వారి అభిప్రాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారా...
ప్రత్యేక రాష్ట్రం విషయంలో కేంద్రం ఆడుతున్న దోబూచులాటకు చెక్ పెట్టడానికి తెలంగాణలోని అన్ని పార్టీలు ఏకమయ్యాయి. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాయి. తెలంగాణ మేథావులు, విద్యార్థులు, రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి చేరుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నాన్చుడు ధోరణి మానేసి.. తెలంగాణ ఇస్తారో.. ఇవ్వరో స్పష్టంగా చెప్పాల్సిందేనని జేఏసీ డిమాండ్ చేసింది.
నెలరోజులుగా తీవ్ర ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతుండడంతో.. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఆందోళనలను అదుపు చేయడం ప్రభుత్వం వల్ల కావడంలేదు. వ్యాపారాలపైనా.. జన జీవనంపైనా.. వీటి ప్రభావం పడుతుండడంతో.. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కలవరపడుతోంది. ఓ సమస్యను పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాలు.. మరో సమస్యకు నాంది పలుకుతుండడంతో.. కేంద్ర సర్కార్ సందిగ్ధంలో ఉంది. అయితే.. ఇప్పటివరకూ చేసిన రెండు ప్రకటనలు కూడా.. వ్యూహాత్మకంగానే ఉన్నాయి తప్ప... సమస్యను పూర్తిగా పరిష్కరించేవిగా లేవు. కేంద్ర తాజా వ్యూహం ప్రకారం సంప్రదింపుల ద్వారా ముందడుగు పడడం కూడా కల్లే.. అందుకే.. ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటనను చేయాల్సి ఉంది.
24, డిసెంబర్ 2009, గురువారం
సంప్రదింపులతో సాధించేదేమిటి?
Categories :
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మేకలకు (తెలంగాణాకు ) విముక్తిని ప్రసాదించ వచ్చో లేదో తోడేళ్ళతో (ఆంధ్రోళ్ళతో ) సంప్రదింపులు జరిపి నిర్ణయిస్తారు.
Rajanna......అంటే మీరు అడిగిన వెంటనే మీరు అడిగినవన్నీ ఇస్తే మంచివాళ్ళు లేకుంటే చేద్దవాల్లన్నమాట. గుడ్. ఇంకా ఎవరు తోడేళ్ళు ఎవరు మేకలో అందరికీ తెలుసు. హైదరాబాద్ బాగుపడేవరకు మాటువేసి ఇపుడు మాది అంటూ వేటాడతామంటున్న తోడేళ్ళు ఎవరో. సొంత రాష్ట్ర రాజదానికి వచ్చి వలసవాదులనిపించుకొంటున్న మేకలెవరో తెలుసుకొంటే మంచిది. సంప్రదింపులు లేకుండా మీ అసంబద్ధ కోర్కె అయిన ప్రత్యెక రాష్ట్రం ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా కొరివితో తలగోక్కోవడమే.