16, డిసెంబర్ 2009, బుధవారం
తెలంగాణ ఎందుకోసం?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నది కేవలం రాజకీయ అవసరమేనా... లేక.. ప్రజల అవసరమా.. దీనిపై రకరకాల ప్రచారాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. తెలంగాణను అభివృద్ధి చేసింది.. ఆంధ్రా నాయకులే అన్నది సమైక్య వాదుల వాదన. ఇది నిజమేనా.. ఈ యాభై ఏళ్ల కాలంలో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందింది.. విశ్లేషణాత్మక వ్యాసం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. రెండు ప్రాంతాలు మనస్పూర్తిగా అంగీకరించడంతో ఏర్పాటు కాలేదు. తెలుగువారంతా ఒక్కరాష్ట్రంగా ఏర్పడాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు. ఇలా కోరుకున్నదంతా.. ఆంధ్రా,సీమ ప్రాంతాల వారే. వారికి.. ఇక్కడి నాయకగణం మద్దతు పలకడంతో.. రెండు రాష్ట్రాలుగా ఉండాల్సిన తెలుగు నేల.. ఒక్కటిగా ఏకమయ్యింది. కానీ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. దేశంలో భాషాప్రయుక్తరాష్ట్రాలుగా ఏర్పాటు చేయడానికి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటుచేసిన మొదటి స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిటీ.. ఆంధ్రా, హైదరాబాద్‌లు కలిసి ఒకే రాష్ట్రంగా ఏర్పడడానికి అంగీకరించలేదు. 1961 జనరల్ ఎలక్షన్స్‌లో వచ్చే ఫలితాలను బట్టి.. నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ ఫజల్ అలీ కమిషన్ సూచించింది. నాయకుల ఉత్సాహం ముందు కమిషన్ సిఫార్సులు ఆవిరైపోయాయి. 1956 నవంబర్ ఒకటిన ఆంధ్రా-హైదరాబాద్ రాష్ట్రాలు కలిసి.. ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అయితే.. ఆంధ్రాతో పోల్చితే.. తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో వెనకపడి ఉండడంతో.. ఓ ప్రత్యేక ఒప్పందాన్ని చేసుకున్నారు. అదే పెద్దమనుషుల ఒప్పందం. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎన్నో రూల్స్ ఇందులో పొందుపరిచారు.. కానీ అమలు చేయడం మరిచిపోయారు. ముందుగా చెప్పుకోవాల్సింది.. ఒక ప్రాంతానికి చెందిన వారు ముఖ్యమంత్రి అయితే.. మరో ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఉపముఖ్యమంత్రిని చేయాలనే. కానీ ఈ నిబంధన అమలయ్యింది అతి తక్కువ కాలం మాత్రమే. ఈ 53 సంవత్సరాల కాలంలో.. 15 మంది రాష్ట్రానికి ముఖ్యమంత్రులైతే.. ఇందులో ముగ్గురు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. ఈ ముగ్గురూ కలిసి సరిగ్గా ఏడేళ్లపాటూ పాలించింది లేదు.. రాష్ట్రంలోని కీలక పదవి ఇలా ఆంధ్రాసీమ నేతలకే పరిమితమయ్యింది. సమైక్య రాష్ట్రంకోసం రాజధానిని త్యాగం చేశామని సీమ వాసులు గర్వంగా చెప్పుకోవచ్చు కానీ.. ముఖ్యమంత్రి పదవినే తెలంగాణ వదులుకోవాల్సి వచ్చింది..
అంతేకాదు.. తెలంగాణ ప్రాంతం కోసం బడ్జెట్‌ను ప్రత్యేకంగా రూపొందించాలని... రాష్ట్రానికి అయ్యే వ్యయాన్ని ఆంధ్రా,తెలంగాణ ప్రాంతాల మధ్య సమానంగా పంచాలని.. ఏ ప్రాంతం నిధులు ఆ ప్రాంతానికే ఖర్చుపెట్టాలని.. మరికొన్ని నిబంధనలు ఈ పెద్దమనుషుల ఒప్పందంలో ఉన్నాయి. కానీ... ఇవి కూడా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కలిసి ఓ రీజనల్ కమిటీ ఏర్పాటు చేయాలన్నది కూడా ఒప్పందంలో భాగం. తెలంగాణ ప్రాంతంలో సమస్యలపై ... ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. వాటిని కేబినెట్ ఆమోదించాలి. ఏదైనా వివాదం ఉంటే.. గవర్నర్‌కు నివేదించాలి. తుది నిర్ణయాన్ని ఆయనే తీసుకుంటారు. ఈ పద్దతి ఎక్కువకాలం కొనసాగలేదు. ఇలా ఏరకంగా చూసినా పెద్ద మనుషుల ఒప్పందంతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. 1969 లో తెలంగాణ ఉద్యమం తర్వాత అమలు చేస్తామన్న ఆరు సూత్రాల పథకం కూడా తెలంగాణలో మార్పులను తీసుకురాలేదు. ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఏర్పడినా.. దీనివల్ల.. ఇక్కడి ప్రాంతానికి జరిగిన మేలు.. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఎక్కువేమీ కాదు. తెలంగాణ విద్యార్థుల కన్నా... ఆంధ్రా విద్యార్థులకే ఇందులో సీట్లు ఎక్కువగా దక్కుతున్నాయి. ఉద్యోగాల్లోనూ.. స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలన్న నిబంధనను కూడా పాలకులు తుంగలో తొక్కారు. ఈ నిబంధనలను అమల్లోకి తీసుకురావడానికి 1985లో విడుదల చేసిన జీవోనే ఇంతవరకూ అమలు కాలేదంటే.. తెలంగాణపై పాలకులకున్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు..
పారిశ్రామిక రంగం
సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాతే.. తెలంగాణ అభివృద్ధి చెందిందన్న భావన చాలామందికి కలిగి ఉండొచ్చు.. కానీ నిజం మాత్రం వేరు. ఏ రంగాన్ని తీసుకున్నా.. సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పాలి. కంపెనీల దగ్గర నుంచి మొదలుపెడితే.. పరిస్థితులు ఎంతలా మారాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోని ప్రభుత్వ కంపెనీల్లో సింహభాగం నిజాం హయాంలో కొలువుతీరినవే. 1921 లో సింగరేణి, 1937లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, 1942లో ఆల్విన్ మెటల్ వర్క్క్, 1943లో ప్రాగా టూల్స్, 1946లో సిర్ఫూర్ పేపర్ మిల్స్, 1947లో హైదరాబాద్ ఆస్బెస్టాస్ ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత.. సింగరేణి మినహా మిగిలినవాటి గేట్లు మూసుకుపోయాయి. నిజాం షుగర్స్, పేపర్‌మిల్స్ ప్రైవేటు పరమయ్యాయి. అజాంజాహీ మిల్స్ అనూహ్యంగా మూతపడింది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పెట్టిన కంపెనీ తెలంగాణ ప్రాంతంలో ఒక్కటీ లేదు.
విద్య
విద్యాపరంగా.. తెలంగాణ ఎప్పుడూ వెనకపడే ఉంది. రాష్ట్రంలో దాదాపు సగం జనాభా తెలంగాణలోనే ఉన్నప్పటికీ.. ప్రభుత్వ విద్యాసంస్థలు మాత్రం 25 శాతమే ఈ ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం 72 ప్రభుత్వ ఐటీఐలకు గానూ.. తెలంగాణలో ఉన్నవి కేవలం 26....... 91 పాలటెక్నిక్ కాలేజీలకు గానూ.. ఈ ప్రాంత వాటా 20... ఎయిడెడ్ విద్యాసంస్థలూ ఎక్కువగా ఉన్నది ఆంధ్రా ప్రాంతంలోనే.. ఇక తెలంగాణ విద్యారంగంలో దూసుకువెళ్లే ఛాన్స్ ఎక్కడ ఉంది?
వ్యవసాయం
తెలంగాణలో నిర్లక్ష్యానికి గురైన మరో రంగం వ్యవసాయం. సాగుకు పనికివచ్చే భూమి తెలంగాణలో 64 లక్షల హెక్టార్లుంటే.. కోస్తాంధ్రలో 46 లక్షల ఎకరాలు మాత్రమే ఉంది. అయితే.. సాగు విషయానికి వస్తే మాత్రం.. రెండు ప్రాంతాల మధ్య ఎంతో అంతరం. ఆంధ్రాలో బీడు భూమిని చూడాలంటే.. భూతద్ధం వేసుకుని వెతకాలి. ఎటుచూసినా పచ్చని పొలాలతో కళకళలాడుతూనే ఉంటుంది. అదే తెలంగాణలో కొన్ని చోట్ల తప్ప.. అంతా బీడే. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణలోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నా... ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. నిజామాబాద్ జిల్లాలో శ్రీరాం సాగర్ కట్టడం మొదలుపెట్టి 46 సంవత్సరాలు గడుస్తున్నా.. పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. అంతెందుకు.. రాష్ట్ర విలీన సమయంలో.. తెలంగాణలో ఎంత సాగు భూమి ఉందో.. ఇప్పటికీ అంతే సాగవుతోంది. ముఖ్యంగా తెలంగాణలో సాగు ఎక్కువగా జరిగే.. చెరువులు, కుంటలు ఈ యాభైఏళ్లకాలంలో 75 శాతం మాయమైపోయాయి. అదే సమయంలో రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఆంధ్రా ప్రాంతంలో 30 లక్షల ఎకరాలు సాగవుతుండగా.. ఇప్పుడది 70 లక్షల ఎకరాలకు చేరుకొంది.. మరి అభివృద్ధి చెందింది.. తెలంగాణానా.. లేక ఆంధ్రాప్రాంతమా..
ఉద్యోగాలు
ఇక ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాల సంగతి అంతా ఇంతా కాదు. న్యాయంగా అయితే.. 2:1 నిష్పత్తిలో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య ఉద్యోగాల పంపకం జరగాలి. రాష్ట్రంలో మొత్తం 14 లక్షల మంది ప్రభుత్వోద్యోగులుంటే.. అందులో తెలంగాణ వారి వాటా కేవలం రెండున్నర లక్షలు మాత్రమే. ఇందులోనూ.. అత్యున్నతస్థాయిలో ఉన్నవారు చాలా తక్కువ మంది. రాష్ట్ర పరిపాలనను నియంత్రించే.. సచివాలయంలో అయితే.. కీలక పోస్టులన్నీ.. సీమాంధ్రులవే. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి.. ఇప్పటివరకూ.. ఒక్క అడ్వకేట్ జనరల్ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాకపోవడం ప్రభుత్వాల తీరుకు అద్దం పడుతోంది. పైగా.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి.. తెలంగాణకు రావల్సిన వాటా.. ఎప్పుడూ రాలేదని వాదిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు.
రాష్ట్ర ఆదాయంలో దాదాపు 45 శాతం తెలంగాణ ప్రాంతం నుంచే వస్తోంది. ఇదే సమయంలో.. ఇక్కడ ఖర్చు పెడుతున్న మొత్తం మాత్రం కేవలం 28 శాతం మాత్రమే. అంటే.. 17 శాతం నిధులు ఎక్కడి పోతున్నట్లు? తెలంగాణను అభివృద్ధి చేశామని ప్రభుత్వం చెబుతుండొచ్చు.. కానీ.. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను యాభై ఏళ్లుగా ఎందుకు తీర్చలేకపోతున్నారు? రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యల్లో ఎక్కువగా తెలంగాణలోనే ఎందుకు జరిగాయి? సిరిసిల్ల చేనేత కార్మికులు ఎందుకని ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోంది? ఇలా సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో. సమైక్యాంధ్ర కోసం.. ఆందోళన చేస్తున్న ఈ నాయకుల్లో ఒక్కరు కూడా తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడలేదెందుకు?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
How can you confidently say that all these problems will be solved by separate state.
What extra will we get by getting a state?
Infact the revenue will drastically come down.
can this region bear all the expenses on police that it needs to maintain peace here.?
Don't you know that this region has to depend on other regions for food. Will they not charge more for imports? Don't you think food prices will go up in this region after separation.
Without doing any analysis we should not take hasty decisions just by listening to some people with their selfish goals.
good essay however i have some questions to author.
Why Telangana people expecting Andra people should develop telangana. Why Telangana leaders failed to develop telangana as the way Andra and seema leaders developed?
Do you accept dividing telangana further as north and south telangana? where as north contains adilabad, nizamabad, karimnagar and medak and south contains rest of districts since there is a possibility that north telangana will not develop the way telangana is not developed.
౧)రాష్ట్ర ఆదాయంలో దాదాపు 45 శాతం తెలంగాణ ప్రాంతం నుంచే వస్తోంది. ?
సమాధానం- ఇందులో హైదరాబాదు కూడా ఉంది.
మిగిలిన పది జిల్లాలనుండి ఎంత ఆదాయం వస్తుందో చెప్పండి.
౨) ఇదే సమయంలో.. ఇక్కడ ఖర్చు పెడుతున్న మొత్తం మాత్రం కేవలం 28 శాతం మాత్రమే.?
సమాధానం- ఈ లెక్కలు చూపేటప్పుడు హైదరాబాదుకు జరిగే ఖర్చును తెలివిగా మినహాయించారు.
వాస్తవాలు తెలుసుకోండి. ఒకరి మాట విన్నప్పుడు అది ఎంత వరకు నిజమో అని నిర్ధారించడానికి విజ్ఞతను ఉపయోగించాలి.
Kishore is right.
All new industries have come to hyd. He excluded hyd while counting benefits.
Same time I want to know how many new industries have come to Guntur and Vijayawada or Nellore these 50 years.?
Though rivers are there in both regions they are wide and land is fertile in coastal region. Govt has nothing to do with that.
ఓరి పిచ్చి నాన్నా!. 2000 సుంచి వచ్చిన IT పరిశ్రమ కూడా నిజామే పెట్టించాడంటే పోలా? మెంటల్ వెధవల్లాలా! 1969 సిండ్రోమ్ నుంచి బైటికి రాండిరా
i agree with kishore...
" AndhralO eTuchoosinaa pachchani polaalu " - O saari Andhra lOni raayalaseema choosiraanDi doraa! sOmarulugaa inkOri meeda paDi EDchaDam Api , panichEsE samskRuti alavarachukunE varakoo , Distrikt kokka raashTramichchinaa mee EDupu batukulu baagapaDavu
మీ విశ్లేషణ బాగుంది. కానీ..ఓ విషయంలో మీరు వాస్తవాలను తెలుసుకోకుండా రాశారు. హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్శిటీ వున్నా...ఇక్కడి వారికి ఒరిగింది ఏమీ లేదు అన్నారు. ఆంధ్రా వాళ్ళే ఎక్కువ మంది వున్నారని చెప్పరు. ఇక్కడ మీ వైఖరిలో తెలంగాణాకు జరిగిన అన్యాయం కంటే..ఆంధ్రా వాళ్ళపై ద్వేషమే ఎక్కువగా కనిపించింది.ఎందుకంటే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్స్...ప్రాంతాల రిజర్వేషన్ కు సంబంధం లేకుండా జురుగుతాయి. లోకల్, నాన్ లోకల్ అన్నవి సెంట్రల్ యూనివర్శిటీలకు వర్తించవు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఇక్కడ అడ్మిషన్స్ వుంటాయి. ఆంధ్రా వాళ్ళే కాదు...బెంగాల్, బీహార్, కేరళ..ఎవరికైనా...ప్రతిభ వుంటే...సెంట్రల్ యూనివర్శిటీలు ఆహ్వానం పలుకుతాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అధికారులతో ఈ విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే ఇక్కడ కామెంట్ రాస్తున్నాను.తెలంగాణ విడిపోవాలన్న మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. కానీ ప్రతిదానికి ఆంధ్రా వాళ్ళపై దుమ్మెత్తిపోయడం సరికాదు. చివరిగా ఓ మాట నేను కూడా తెలంగాణా వాదినే.
బ్లాగ్ రచయిత గారు,
మంచి విస్లేశానత్మక వ్యాసము కానీ ఇతరులు అడుగితున్న వాటికీ సమాధానము చెప్పండి. వారికీ సమాధానము చెప్పినప్పుడే మన వాదన కరెక్ట్ అవుతుంది.
konni graha sthithulu valla oka chida purugu Chintamadaka village near Siddipet lo puttindi..valla forefathers Bobbili, Vizianagaram nunchi.
ayina peddaga chaduvu koledu...manchiga roju madu kotti..notiki vachinnadalla vaguthadu..
aa chida purugu prabavamey e danta..andukey annaru peddalu chinna pamuni kooda pedda karratho kottali..
Akkadey oka animuthyam P.V.Narasimharao kooda puttaru..india ni entho abhi vruddi chesaru..
manam andaram kalisi e lanti chida purugulani vari veyali..
kontha samayam paduthindi..idi oka inthaku manchidey..janalalo chitanyam vachhindi..
andaram chitanyam tho munduku sagi..desa bhakthi tho vellandarni mattuna bettali..
mana desam lo etuvanti manchi jaragalanna adi Andhra nunchey jaragali..we are the best..whole Telugu world react on this..every one will forgot about these pranthiya bhavalu..manchini panchudam..telugu pranthanni kapadu kundam..
Telangana means "Land of Telugus".
KCR oka neechudu..vadi dwara telgana nu sadinchatam annadi avi vekam..me bhavi tharalaku emi cheppukutaru.
Nechulatho chethulu kalaparadu..pamuki palu posi pencha radu..
Nichudu kantey pamu melu..pamuki korallo visham..neechuniki niluvella visham..
Late Sri P.V.Narasimharao the great legend..ayina PM ga vunnappudu eppudu e prasthavana raledu..telangana ku nijam ga droham jarigithey ayiney meku appudu vidadesi ichhey varu..
Hyd lo hindu muslim godavalu ayinappudu..ekkada vunnaru e telangana vadulu..emayindi me telangana bhakthi/prema..meru me nela kosam muslims meda poradaledu.
Aa cheduni roopu didda taniki manaku inni years pattinid..ippudu KCR..telugu valllaki idi kothhemey kadau..e chedda rojulu enno rojulu vundavu..e chida puruguki rojulu daggaraki vachhi ela chesthunnadu..
మీరందరూ చెప్పింది బాగానే ఉంది కానీ అవి వాస్తవాలు కావా? తెలుసుకుని మాట్లాడండి. రచయిత అక్కడపెట్టిన ప్రతిఅక్షరం సత్యం . తెలంగాణకు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. దయచేసి తెంలగాణ కు జరుగుతున్న అన్యాయాన్ని నిరోధించేందుకు జరుగుతున్న ఈ ఉద్యమానికి మద్దతునివ్వండి