14, డిసెంబర్ 2009, సోమవారం
చంద్రబాబు సెల్ఫ్‌గోల్....
కాంగ్రెస్ వ్యూహం పనిచేసిందా? చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి సోనియా పన్నిన పన్నాగం ఫలించిందా? లేకుంటే.. చంద్రబాబు తాను తీసుకున్న గోతిలోనే పడ్డారా.... తెలుగుదేశం పార్టీలో వస్తున్న మార్పులు చూస్తుంటే అవుననే వినిపిస్తోంది. తెలంగాణకు అనుకూలమే అంటూ.. టీడీపీ ఎప్పుడో చెప్పినా.. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో వెనకడుగు వేసింది. సమైక్య రాష్ట్రం కోసం ఆందోళన మొదలుపెట్టింది. దీన్ని అడ్డుకునే ప్రయత్నాన్ని టిడీపీ అధినేత చంద్రబాబు చేయడం లేదు.. దీనికి కారణం.. ఆయన కూడా రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేకపోవడమే. ఎన్నికల కోసం మాత్రమే చంద్రబాబు తెలంగాణ జపం చేశారన్న అనుమానాలు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బలపడుతున్నాయి. వైఎస్ అధికారంలో ఉన్నంత కాలం, తెలంగాణ ఏర్పడదన్న నమ్మకం బలంగా ఉండడం వల్లే.. చంద్రబాబు తెలంగాణకు సుముఖత వ్యక్తం చేశారన్న వాదన ఉంది. అయితే.. వైఎస్ చనిపోవడం.. కాంగ్రెస్ హైకమాండ్.. తెలంగాణకు సానుకూలంగా మారిపోవడంతో పరిస్థితి తారుమారయ్యింది. రాజకీయ చాణుక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబుకే చిక్కులు తెచ్చిపెట్టింది.
ఇక మరో విషయం.. సోనియా రాజకీయం. రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రస్తుతం అన్ని ప్రాంతాలకూ ఆమోదయోగ్యుడైన లీడర్ ఎవరూ లేరు. ఈ పరిస్థితుల్లో పార్టీని విజయపథంలోనే నడిపించడం సాధ్యం కాదు. అదే రాష్ట్రాన్ని విభజిస్తే.. ప్రాంతీయ నాయకత్వానికి ప్రజల ఆమోదం లభిస్తుంది. ఇదే సమయంలో.. చంద్రబాబు గురించీ చెప్పుకోవాలి. రాష్ట్రం విడిపోతే.. ఎక్కువగా నష్టపోయేది బాబు మాత్రమే. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారనుకుందాం.. అప్పుడు చంద్రబాబు ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలి? తెలంగాణ, ఆంధ్రాల్లో ఛాన్స్ ఉండదు. రాయలసీమలో పార్టీకి మెజార్టీ దక్కుతుందన్న ఆశకూడా ఉండదు. చంద్రబాబు సీఎంగా పనిచేసినప్పుడే.. అక్కడ బొటాబొటిగా విజయాలు దక్కాయి. అందులోనూ.. ఆంధ్రప్రదేశ్‌లాంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి.. రాయలసీమకు సీఎంగా ఉండడం బాబుకు సాధ్యం కాకపోవచ్చు.. పైగా ప్రెస్టేజియస్ ఇష్యూ...
అదే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే.. ఆంధ్రా, రాయలసీమలు కలిసి ఉంటాయి. తెలంగాణలో ఎలాగూ బాబుకు స్థానం ఉండదు. ఆంద్రాలో కూడా ఆదరణ అంతంత మాత్రమే. ఆంధ్రా, రాయలసీమల్లో కాంగ్రెస్ హవానే ఎక్కువ కాబట్టి.. వారికే అధికారం దక్కొచ్చు. ఒకవేళ టీడీపీకి మెజార్టీ స్థానాలు వచ్చినా.. సీఎంగా బాబును అందరూ అంగీకరించకపోవచ్చు. ఇదే సమయంలో తెలంగాణలో టీడీపీ గెలిస్తే.. ఇక్కడ మరొకరు ముఖ్యమంత్రి అవుతారు.. వీరితో సమానంగా ఆంధ్రా సీఎం పదవిలో చంద్రబాబు కొనసాగడానికి నామోషీ అడ్డురావచ్చు.. ఇలా ఏ రకంగా చూసినా చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిందన్నమాట. అందుకే.. ఇప్పటిదాకా తెలంగాణ పాట పాడిన చంద్రబాబు.. అర్థరాత్రి కాంగ్రెస్ ప్రకటన అంటూ.. తన ఆగ్రహాన్ని అవకాశం ఉన్నప్పుడల్లా ప్రదర్శిస్తున్నారు. సమైక్య వాదాన్ని వినిపించమంటూ శ్రేణులను పోషిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే.. చంద్రబాబు భవిష్యత్తు దెబ్బతింటుందనే.. సోనియాగాంధీ తెలంగాణకు జై కొట్టారని తెలుస్తోంది.
చంద్రబాబు ప్రవర్తనతో విసుగు చెందిపోయిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేరు కుంపటి పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ టీడీపీని ఏర్పాటు చేయమంటూ బాబుకు అల్టిమేటం ఇచ్చారు. తెలంగాణకు వ్యతిరేకమని బాబు ప్రకటిస్తే.. ప్రత్యేక పార్టీ పెట్టుకోవడానికీ సై అంటున్నారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో బాబులో ఈ ఆందోళన స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ చేసిన పనివల్ల టీడీపీ చీలిపోయే దిశలో ఉందంటూ స్వయంగా ఆవేదన వెళ్లగక్కారు. మొత్తం.. తాను తీసిన గోతిలో తానే పడ్డాడన్నమాట.. చంద్రబాబు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చక్కగా వివరించారు. చంద్ర బాబుకు రాజకీయ భవిష్యత్తు ఉండదేమో !
తెలంగాణా లో మాత్రం ఖచ్చితం గా లేదు.
తెలంగాణా రావడం బాబు కే కాదు తెలంగాణా రాజకీయ నాయకులకు కూడా లేదని పిస్తోంది. రియల్ ఎస్టేటు దెబ్బతింటే రాజకీయ కోటీశ్వరులు లక్షాది కారులుగా మారతారు. వారు ఎవరైతే ఏమిటి ? తెలంగాణా వారు/ ఆంధ్రా వారు / రాయల సీమ వారు ఎవ్వరైనా కావచ్చు.
కాకపొతే మనం మనం కొట్టుకు చస్తుంటాం. అంతే !
----అప్పారావు శాస్త్రి
This is a stupid analysis.
సరియన అనల్య్సిస్. బాబు, ఇంకా థర్డ్ ఫ్రంట్ లీదెర్స్ అందరిని కన్విన్స్ చేసీ, కాంగ్రెస్ నీ, నేషనల్ లెవెల్ లో ఇరకటా పెటే ప్లాన్ కావలి, లేదా TDP కీ, అల్ ఆంధ్ర లో ఆవుట్ .