వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కోసం ఇప్పుడు డిమాండ్ ఊపందుకొంటోంది. ప్రతీ ఏటా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండడమే దీనికి కారణం. రైతుసంఘాలు, వ్యవసాయ నిపుణులు కూడా ఇదే కోరుకుంటున్నారు. దేశంలో ౩౦ శాతం మందికి కూడా అందుబాటులో లేని రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ ఉన్నప్పుడు.. జనాభాలో 60 శాతం మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో.. ఆధారపడ్డ వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఎందుకు ఇవ్వకూడదు.. దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కొన్ని సంవత్సరాలుగా.. వ్యవసాయాభివృద్ధి కనీసం 4 శాతాన్ని కూడా దాటడం లేదు. రోజుకో రకం వంగడాలు వస్తున్నా.. సామాన్య రైతుకు మాత్రం అవి అందుబాటులోకి రావడం లేదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానమూ రైతులకు అందడం లేదు. దాదాపు 75 శాతం రైతులు ఇప్పటికీ సంప్రదాయసాగునే చేస్తున్నారు. చాలాచోట్ల ఇప్పటికీ వర్షాధారమే. వాన పడకపోతే.. ఆ ఏడాది సాగు కొండెక్కినట్లే. ప్రతీఏటా కరువు పరిస్థితులు వస్తున్నా.. ప్రభుత్వం ప్రత్యామ్నయమార్గాలను అన్వేషించింది లేదు. వ్యవసాయాన్ని గట్టెక్కించింది లేదు. అందుకే.. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలంటున్నారు రైతు నేతలు.
అయితే, ఇక్కడే ఓ చిక్కు ఉంది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టడానికి రాజ్యాంగం అనుమతించదు. కారణం వ్యవసాయం రాష్ట్రాల జాబితాలో ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే.. రాజ్యాంగాన్ని సవరించాలి. ఇది ఇప్పట్లో జరిగే వ్యవహారం కాదు. అందుకే.. ప్రస్తుతం నిధులను పెంచాలంటున్నారు.. జయప్రకాశ్ నారాయణ్‌లాంటి నేతలు. పారిశ్రామిక రంగానికి పెద్ద ఎత్తున ఊతం ఇస్తున్న కేంద్రం.. వ్యవసాయం విషయంలోనూ అదేలా వ్యవహించాలంటున్నారు. నిధులు పెంచడం, రైతుల్లో అవగాహన కల్పించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకునేలా చేయడం, దిగుబడులు ఎక్కువ వచ్చేలా చర్యలు తీసుకోవడం చేయాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటి ఉపాధిమార్గం అవుతుంది.
వ్యవసాయం ను రాష్ట్ర్రాల జాబితా నుంచి తీసిపడేసి, కేంద్ర జాబితా లోకి చేర్ఛి
అప్పుడు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి. చాలా రాష్ట్ర్రాల కు వ్యవసాయ శాఖను సరిగా నడపటం రాదు.
అందుకే వ్యవసాయ దిగుబడులు ఇలా ఉన్నాయి.