ప్రత్యేకంగా సినిమాలను తీస్తానని చెప్పుకునే పోసాని కృష్ణమురళి కూడా.. కమర్షియల్ హిట్‌కోసం నానా పాట్లు పడుతున్నారు. తాజా చిత్రం రాజావారి చేపలచెరువులో.. హీరోయిన్ క్యారెక్టర్‌కు న్యూడ్ ఎలిమెంట్‌ను చేర్చారు.
"ఔను...సన్నివేశం ప్రకారం ఓ చోట నా భార్య పాత్ర పోషించిన గైనా వివస్త్రగా..నగ్నంగా కనిపించాల్సి వస్తుంది...
మా ఇద్దరి పోరాటం సాగుతుండగా ఆమెని ఓ ఎమ్మెల్యే వివస్త్రను చేసి సీడీ తయారుచేస్తాడు. తన 'రాజావారి చేపల చెరువు' చిత్రంలో 'ప్రతిఘటన' సినిమాను తలపించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే డైలాగులూ ఉంటాయి"...అంటూ బదులిస్తున్నారు పోసాని.
అలాగే మీసినిమాలకు మిరే ఎప్పుడు హీరోనా? వేరెవరు ఉండరా? అన్న మరో ప్రశ్నకు సమాధానంగా "నేను వ్రాసుకున్న కదా గురించి నాకే సరైన అవగాహనా ఉంటుందనే ఆలోచనతో నేనే హీరోగా నటిస్తునాను," అని బదులిచ్చాడు పోసాని.ఇక ఈ చిత్రం కధ గురించి చెబుతూ..నేను పోలీసు అధికారి పాత్రలో నటించాను. ప్రజల కోసం నిబంధనలను అతిక్రమించానని ఉద్యోగం నుంచి తీసేస్తారు. కానీ మీడియా నాకు మద్దతిస్తుంది. అది చూసిన ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడుతారు. 'మీ ప్రభుత్వంలో చెడ్డవారికి మేలెక్కువ జరుగుతుంది' అంటాను. ఆ విషయాన్ని నిరూపించడమే తరువాయి భాగం. అలాగే పోలీసు పాత్ర సీఎంను కలిసిన తర్వాత చేపల చెరువు కథలోకి వస్తుంది. వాస్తవంలో చేపల చెరువుల వ్యాపారం చేయడంలో ఎలాంటి నియమావళిని పాటించాలో.. పొల్లుపోకుండా మా సినిమాలో చూపించాం. ఆ క్రమంలో ఇచ్చుకోవల్సిన లంచాలను కూడా ప్రస్తావించాం.అనంతరం చెరువు మాయమవడం వల్ల ఆసక్తి కలుగుతుంది.చాలా ఆసక్తికరంగా ఉండే సినిమా అన్నారు
14, మే 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి