దేశంలోని ప్రతి పౌరునికి వచ్చే 2011 నాటికి బహుళ ప్రయోజన గుర్తింపు కార్డులను అందజేస్తామని కేంద్ర హోం శాఖామంత్రి పళనియప్పన్ చిదంబరం తెలిపారు. ఆయన కేంద్ర హోం మంత్రిగా తాజాగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే 2011 నాటికి 'జాతీయ జనాభా పట్టిక' (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) సిద్ధమవుతుందన్నారు. దీనితో పాటు 'మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డు' (ఎంఎన్ఐసీ-బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు)ను కూడా 2011 నాటికి ప్రతి పౌరునికి అందజేస్తామని మంత్రి చిదంబరం తెలిపారు.
జాతీయ జనభా పట్టికలోని ప్రతి పౌరునికి ఈ కార్డును అందజేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ధ్యేయమన్నారు. అయితే, ఈ ప్రాజెక్టు అమలు ప్రక్రియలో సాంకేతికంగా పలు సమస్యలు తలెత్త వచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దీనిపై మంత్రి చిదంబరం స్పందిస్తూ.. ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసిన 12 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 30.95 లక్షల మందికి ప్రయోగాత్మక ప్రాతిపదికన అందజేసేందుకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.
కోస్తా జిల్లాలతో పాటు అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఈ పనుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్టు మంత్రి చిదంబరం చెప్పారు. ఈ గుర్తింపు కార్డు అనేది ఒక స్మార్ట్ కార్డులా ఉంటుందని మైక్రో ప్రాసెసర్ చిప్‌ను కలిగి వుంటుందన్నారు.
ఈ సురక్షిత కార్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. ఈ కమిటీని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఐఐటీ కాన్పూర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇండియన్ టెలిఫోనిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇంటెలిజెన్స్ బ్యూరో తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులతో ఏర్పాటు చేసినట్టు మంత్రి చిదంబరం వివరించారు
26, మే 2009, మంగళవారం
2011 నాటికి 'బహుళ ప్రయోజన కార్డు'లు
Categories :
CHIDAMBARAM . HOME MINISTRY . MIN CARDS . MNIC . news
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మ్మ్....గుడ్
ఇంతకు ముందు... ఓటర్ కార్డు,పాన్ కార్డు multipurpose cards అన్నారు.ఇప్పుడే ఈ కొత్త కార్డు?