తెలుగు మీడియాకు మాంద్యం దెబ్బ తగిలింది. అనుహ్యంగా దూసుకు వచ్చి ఎంతోమందిని ఆకట్టుకొని అతి తక్కువ కాలంలో తెలుగు మీడియాలో రెండో స్థానాన్ని సాధించుకున్న వార్త పత్రిక ఇప్పుడు పతనం అంచున నిలిచింది. ఆంధ్రజ్యోతి, సాక్షిల ప్రవేశంతో వార్త స్థానం నాలుగుకు పడిపోయింది. మళ్ళీ కోలుకునే అవకాశం లేకపోవడం ... వరుసగా నష్టాలు రావడంతో... వార్తను ముసేయాలనే నిర్ణయానికి యాజమాన్యం వచ్చింది. ఎన్నికలు పూర్తి అవ్వగానే రెండు నెలల జీతం ఇచ్చి ఉద్యోగులను ఇంటికి పంపేయనున్నారు. మరో వైపు ఆంధ్రభూమికీ ముప్పు వచ్చి పడింది. ఐ.ఫై.ఎల్. లో దెక్కన్ చార్జర్స్ జట్టును కొని డీ.సి. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. పోయినసారి దారుణమైన ఆటతో అట్టడుగున నిలవడంతో ఈసారి స్పాన్సర్లు దొరకలేదు. అన్ని జట్ల జేర్సిలపై యాడ్లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటే.. పాపం డీసీ మాత్రం పేలవంగా కనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే క్రికెట్లో పెట్టుబడుల కారణంగా.. ఆంధ్రభూమి వార పత్రికకు పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. దీంతో వార పత్రికను ముసేయడానికి డీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసియా నెట్ దెబ్బకు ఎంతో మంది రోడ్డున పడ్డారు. ఈరెండు కూడా మూసేస్తే ఎంతో మంది పరిస్థితి దారుణంగా మారుతుంది.
22, ఏప్రిల్ 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి