మహారాణులు.. మహారాజుల ప్రేమకథలకు చరిత్రలో ఉన్నంత స్థానం మరోదానికి ఉండక పోవచ్చు. అందుకే ఈజిప్ట్ - రోమ్ సామ్రాజ్యాలను తన అందంతో కట్టిపడేసిన క్లియోపాత్ర ప్రేమకెళిని ప్రపంచానికి కళ్ళకు కట్టి చూపేందుకు పరిశోధకులు సిద్దమయ్యారు.వందల ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన చరిత్రను వెలికి తీసేందుకు ఆర్కియాలజిస్టులు తవ్వితీయనున్నారు..ఈజిప్టు రాణి క్లియోపాత్ర, రోమన్ జనరల్ మార్క్ ఆంటోనీల అమర ప్రేమకథకు సంబంధించిన ఆనవాళ్లను కనుగొనేందుకు వీరు నడుం బిగించారు. క్లియోపాత్ర, మార్క్ ఆంటోనీలు చివరి దశల్లో ఎక్కడున్నారు. వారు ఎక్కడ చనిపోయారు. వారికి సంబంధించిన డూమ్‌లను కనుగొనేందుకు తవ్వకాలు జరపాలని యోచిస్తున్నారు. గతేడాది అలెంగ్జాండ్రియాలో జరిపిన తవ్వకాల్లో టోలమి కాలం నాటి ఓ టెంపుల్ బయటపడింది. ఈ గుడిలో క్లియోపాత్ర, మార్క్ ఆంటోనీల ఆనవాళ్లు దొరికాయి. అయితే ఆక్టియమ్ యుద్ధానంతరం వీరిరువురు ఆత్మహత్య చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. ఇప్పటికే తవ్వకాల్లో 27 సమాధులు, 10 మమ్మీలను వెలికి తీశారు. మరిన్ని ఆధారాలు దొరకొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.
22, ఏప్రిల్ 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి