14, ఏప్రిల్ 2009, మంగళవారం
దేశం లోనే మన వాళ్ళు రిచ్ గురూ!
ఈ సారి ఎన్నికల్లో టాప్ టెన్ రిచ్ లిస్టులో మన వాళ్ళు 7 గురు ఉన్నారు. తొలి దశ ఎన్నికల్లో మొదటి 10 మందిలో 8 మంది మన వాళ్ళే. అందరిలోకి ఎక్కువ ఆస్తులు ఉన్నది విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్. దాదాపు 277 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. దేశంలో ఈయనది రెండో స్థానం. ఆ తర్వాత ఖమ్మం స్థానం నుంచి పోటి చేస్తున్న టిడిపి అభ్యర్థి నామ నాగీశ్వరారావుది. దాదాపు 173 కోట్లు ఉన్నట్లు చూపించారు. పెద్దపల్లి కాంగ్రెస్స్ అభ్యర్థి జి. వివీకానంద్ కు 72 కోట్ల ఆస్తులున్నాయి. మెదక్ కాంగ్రెస్స్ అభ్యర్థి నరేంద్రనాథ్ కు 56 కోట్లు, చేవేళ్ల నుంచి బరిలో ఉన్న కాసానికి 45 కోట్లు, అల్లు అరవింద్ కు 45 కోట్లు, రేణుక చౌదరి కి 38 కోట్లు, దేవేందర్ గౌడ్ కు 35 కోట్లు, విజయశాంతికి 27 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి