గుర్తేడు (తూర్పు గోదావరి జిల్లా) : తక్కిన ప్రపంచంతో పోలిస్తే అభివృద్ధి విషయంలో దాదాపు మూడు దశాబ్దాలు వెనుకబడి ఉన్న, తూర్పు గోదావరి జిల్లా లోతట్టు, మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులు ఎన్.టి. రామారావు ఇంకా బతికే ఉన్నారని, ఆయనే ముఖ్యమంత్రి అని ఇప్పటికీ భావిస్తున్నారు. ‘హిందూ’ పత్రిక విలేఖరి ఒకరు పోలింగ్ రోజు గుర్తేడు గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయనకు అమాయకులైన గిరిజనుల ద్వారా ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు తెలియవచ్చాయి. గుర్తేడుకు ఐదు కిలో మీటర్ల దూరంలోని పాతకోట గ్రామానికి చెందిన పల్లాల లచ్చిరెడ్డి (62) తనకు ఎన్టీఆర్, ఇందిరా గాంధి గురించి, వారి ఎన్నికల గుర్తులు వరుసగా ‘సైకిల్’, ‘హస్తం’ గురించి మాత్రమే తెలుసునని చెప్పాడు. ఎన్టీఆర్ ఇంకా బతికే ఉన్నారని అతను వాదించాడు. ఎన్టీఆర్ మరణం గురించి చెప్పినప్పుడు గ్రామ పెద్దతో సహా ఎవ్వరూ తనకు ఆ విషయం తెలియజేయలేదని అతను స్పష్టం చేశాడు. చివరకు గ్రామ పెద్దకు కూడా ఎన్టీఆర్ చనిపోయిన సంగతి తెలియదు. ఎన్టీఆర్ ఎప్పుడు, ఎలా మరణించారు, తదుపరి ముఖ్యమంత్రి ఎవరు, పార్టీ గుర్తు అదేనా వంటి ప్రశ్నలను ఆ గిరిజనుడు అడిగాడు.
గిరిజన మహిల కొండ్ల డొక్కమ్మ (50) మాట్లాడుతూ, తనకు చంద్రబాబు లేదా స్థానిక ఎంఎల్ఎ బాబు రమేష్ లేదా ఎంపి మిడియం బాబూరావు గురించి తెలియదని చెప్పింది. ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు చిరంజీవి గురించి అడిగితే, తాను చిరు సినిమా ఒకటి చూసినట్లు ఆమె తెలిపింది. గడచిన పది సంవత్సరాలలో తాను మూడు నాలుగు సార్లు మాత్రమే రంపచోడవరం వెళ్ళానని ఆమె చెప్పింది. కాగా, మారుమూల ప్రాంతాలలోని గిరిజనుల హృదయాలలో ఎన్టీఆర్ ఇంకా నిలచి ఉండడానికి కారణాన్ని 46 ఏళ్ళ కచ్చెల సామయ్య వివరించాడు. ఎన్టీఆర్ జనాకర్షక పథకాలలో ఒకటైన ‘తెలుగు మాగాణి గ్రామీణ సమారాధన’కే ఈ ఘనత చెందుతుందని అతను చెప్పాడు. ఈ పథకం కింద గిరిజనులకు మొట్టమొదటిసారిగా జీడిమామిడి, మామిడి మొక్కల పెంపకం కోసం, పోడు వ్యవసాయం కోసం చివరకు లోతట్టు అటవీ ప్రాంతాలలో కూడా మూడు నుంచి ఐదు ఎకరాల వరకు భూములను పంపిణీ చేశారు. ఏడు సంవత్సరాల అనంతరం గిరిజనులు మూడు విధాలుగా లబ్ధి పొందారు.వారు మొదటిసారిరాగ తమ చేతులలో అంత పెద్ద మొత్తంలో డబ్బు చూశారు.
ఇక గుర్తేడు 1987లో ఏడుగురు ఐఎఎస్ అధికారులను నక్సలైట్లు కిడ్నాప్ చేసిన ప్రదేశం. ఆతురవాత 2007 వరకు మావోయిస్టులు గుర్తోడు నుంచి మారేడుమిల్లి వరకు ఈ ప్రాంతంలో పట్టు కొనసాగించారు. 2004 వరకు కూడా విద్యుత్ సరఫరా, రోడ్లు, వంతెనలు వంటి సౌకర్యాలకు నోచుకోని ప్రాంతం ఇది. 2008 డిసెంబర్ వరకు కూడా మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్లు తరచు జరుగుతుండేవి. అయితే, ఈసారి కూడా ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపు ఇచ్చినప్పటికీ ఖాతరు చేయకుండా గిరిజనులు తమ వోటు హక్కు వినియోగించుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి