కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా ఎస్. గోపాలస్వామి నుండి బాధ్యతలు స్వీకరించిన నవీన్ చావ్లా తొలి రోజు తీసుకున్న నిర్ణయాలు వివాదస్పదమవుతున్నాయి. గతంలో చావ్లా పలు రాష్ట్రాల ఎన్నికల తేదీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. దీనిపై అప్పటి ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ ఉన్న గోపాలస్వామి చావ్లాను పదవి నుండి తొలగించాలని స్వయంగా రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించినా కాంగ్రెస్ వారు చావ్లాకు అండగా నిలవడంతో అది కాస్తా గట్టెక్కింది. ఇప్పుడు తాజాగా చావ్లా కాంగ్రెస్ వారికి తన విధేయతను చాటుకునే సమయం ఆసన్నమైంది. మొదటిరోజే ఆయన వైఎస్, ఒవైసీలకు క్లీన్ చిట్ ఇవ్వడం, టీడీపీ చేపట్టనున్న నగదు బదిలీ పథకం ప్రచారానికి ఎటిఎం కార్డులను పంచిపెట్టారనే ఆరోపణలకు తీవ్రంగా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైఎస్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయన స్థానంలో ఎన్నికల కమీషన్ స్వయంగా డిజిపిగా మహంతిని నియమించారు. ఆయనను సవాల్ చేస్తూ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు పట్టించుకోకుండా ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడం, బిజెపి పార్టీ యువనేత వరుణ్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సీరియస్ తీసుకుని అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు డీఎస్ చేసిన వ్యాఖ్యలపై కేవలం అసంతృప్తి వ్యక్తం చేయడం చూస్తుంటే చావ్లా తన విధేయతను ఈ విధంగా చాటుకుంటున్నారా అనిపిస్తోంది...!
22, ఏప్రిల్ 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఎన్నికల సంస్కరణలు. పోలీస్ సంస్కరణలూ జరిగేంతవరకూ ఇవి ఇలాగే కొనసాగుతాయి. అదికారంలో ఉన్న ప్రతి రాజకీయపార్టీ తమకు అనుగుణంగా అధికారుల్ని నియమించుకుని పరిపాలన చేస్తుంది. దానికి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మినహాయింపు కాదు.