
మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి ఇలా పలు చిత్రాల్లో నటించిన ప్రభాస్‌కు యాక్షన్ చిత్రాలంటేనే ఓ దశలో విసుగెత్తిందట. అందుకే మెహర్ రమేష్ కథ చెప్పినప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ అంటేనే చేయాలనిపించడం లేదని చెప్పాడు.దీంతో "బిల్లా" కథను చెప్పి అందులో రంగా పాత్ర పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందనడంలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చానని ప్రభాస్ అంటున్నారు. బిల్లా చిత్రం ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయి. గోపికృష్ణామూవీస్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని మహిళలు కూడా ఆదరిస్తున్నందుకు ప్రభాస్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.
ప్రశ్న.. గోపీకృష్ణా మూవీస్‌లో వచ్చిన "బిల్లా"ను ఎలా రిసీవ్‌చేసుకున్నారు?
జ.. గోపీకృష్ణా మూవీస్ అంటేనే కుటుంబకథా చిత్రాలకు మంచి పేరుంది. ఆ దిశగా ఆలోచించి మహిళలు కూడా ఆదరిస్తారని ఈ చిత్రాన్ని చేశాం. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులు బిల్లాను చూసి ఆనందిస్తుండటం చాలా హ్యాపీగా ఉంది.
ప్రశ్న... "బిల్లా"కు ఎక్కువ ఖర్చుపెట్టడానికి కారణం?
జ.. సబ్జెక్ట్ చాలా మందికి తెలుసు. ప్రతి సీన్‌లోనూ కొత్తదనం చూపాలని, యాక్షన్, టెక్నికల్‌పరంగా అంతర్జాతీయ ముద్ర పడాలని ఎక్కువ ఖర్చుపెట్టాం.
ప్రశ్న.. యాక్షన్ సీన్స్ రిస్క్ తీసుకుని చేయడానికి కారణం?
జ.. కార్ ఛేజ్ సీన్ చేయాలని వినగానే నేనే చేస్తానన్నాను. అంతగా ఇన్‌స్పైర్ చేసింది. 80 నుంచి 120 కి.మీ. స్పీడ్‌లో వేగంలో కార్ ఛేజింగ్ ఉంటుంది. చుట్టూ పొలాలు, ఒకచోట నది ఉన్నాయి. ప్లెజెంట్ వాతావరణం కూడా అలా అనిపించింది. అలాగే 750 ఫీట్ ఉన్న బ్రిడ్జ్‌పై నుంచి జంప్ చేసే సన్నివేశం కూడా చేశాను. ఆ సీన్ చేసిన తర్వాత ఎంత లోతుంటే కాస్త తొంగి చూశాను. లోతు చూడగానే భయమేసింది. ముందుగా చూస్తే దూకేవాడిని కాదు. కాకపోతే ముందుగా ప్రికాషన్స్, రోప్‌లున్నాయి కాబట్టి పెద్దగా కష్టం అనిపించలేదు.
ప్రశ్న.. స్టైలిష్ సినిమాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
జ.. నడిచే విధానం, హెయిర్ స్టైల్, ఫోటోసెషన్స్ చాలా చేశాం. నడకలో ఒకసైడ్ వంగి ఉండేటట్లుగా చేశాను. డ్రెస్సింగ్ మాత్రం లండన్‌లో భాస్కర్, బుజ్జి అనే స్నేహితులు చూసుకున్నారు. ఇక హెయిర్ స్టైల్ ముంబై నుంచి తెప్పించాం.
ప్రశ్న.. మీరు తెలుగులో జేమ్స్‌బాండ్ తరహా పాత్ర పోషిస్తారా?
జ.. ఇంకా అనుకోలేదు. హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉండాలని తీశాం.
ప్రశ్న.. కృష్ణంరాజుతో నటించడం ఎలా అనిపించింది?
జ.. చాలా భయమేసింది. ఇద్దరూ కలిసి నటించే సన్నివేశాలను విడివిడిగా తీసి తర్వాత కలిపారు. అన్నిటికంటే రంగా పాత్రను సరదాగా చేశాను. బిల్లా పాత్ర మాత్రం రివెంజ్ పాత్ర కనుక ఆ పాత్ర చేయడంలో కాస్త భయపడ్డాను.
ప్రశ్న.. బిల్లా కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
జ.. ముందుగా మెహర్ రమేష్ ఓ కథ చెప్పారు. పూర్తి యాక్షన్ చిత్రం. యాక్షన్ చిత్రాలు చాలా చేసి చేసి బోర్ కొట్టింది. కొత్తదనం చూపండని నేను అడిగితే, ఆయన కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ జోడించిన రంగా పాత్ర గురించి చెప్పారు. దాంతో రెండు పాత్రలు చేయడానికి అంగీకరించాను. అయినా దానికోసం రెండు నెలలు హోమ్‌వర్క్ చేశాం. రీమేక్ కాబట్టి కొంచెం ఈజీగా అనిపించింది.
ప్రశ్న.. మీ కొత్త చిత్రాలు?
జ.. దిల్‌రాజు, కరుణాకర్ దర్శకత్వంలో ఓ చిత్రం, ఆ తర్వాత దశరథ్ దర్శకత్వంలో మరోచిత్రం. ఈ సినిమా జూన్‌లో ప్రారంభమవుతోంది. ఈలోగా పూరీ జగన్నాథ్ "ఏకనిరంజన్" రిలీజ్ అవుతుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి