21, ఏప్రిల్ 2009, మంగళవారం
న్యాయమూర్తిపై యాసిడ్ దాడి
కాకినాడ : ఇంతకాలమూ ప్రేమించలేదంటూ యువతులపైన కొనసాగుతూ వస్తున్న యాసిడ్ దాడులు ఇప్పుడు తాజాగా న్యాయమూర్తులపైకి కూడా మళ్ళాయి. తనకు అనుకూలంగా తీర్పు వెలువరించలేదన్న అక్కసుతో ఒక నిందితుడు ఏకంగా అదనపు సివిల్ జడ్జిపైనే యాసిడ్ దాడికి తెగబడ్డాడు. మంగళవారం ఉదయం ఈ సంఘటన కాకినాడలోని కోర్టు ఆవరణలో చోటు చోటుచేసుకుంది. యాసిడ్ దాడిలో గాయపడిన న్యాయమూర్తిని పోలీసులు హుటాహుటిన కాకినాడ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. యాసిడ్ దాడికి తెగబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.కాకినాడలోని అదనపు సివిల్ జడ్జి నాగ మారుతి శర్మపై ఆకే సూర్యనారాయణ అనే వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు. ఒక కేసులో ఉన్న తనకు అనుకూలంగా న్యాయమూర్తి తీర్పు ఇవ్వలేదని నిందితుడు ఆయనపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే తన స్థానంలో కూర్చున్న న్యాయమూర్తి నాగ మారుతి శర్మపై నిందితుడు సూర్యనారాయణ డైల్యూట్ చేసిన యాసిడ్ ను కిటికి గుండా విసిరాడు. న్యాయమూర్తి కోటు వేసుకొని ఉండడంతో పెద్దగా గాయాలేమీ తగలలేదు. అయిదే, ఆయన చేయిపైన, చెవుల వద్ద యాసిడ్ కారణంగా కొద్దిగా కాలిన గాయాలయ్యాయి. న్యాయవ్యవస్థ భ్రష్టుపట్టపోయిందన్న భావనతో ఉన్న సూర్యనారాయణ తన కేసు విషయంలో వ్యతిరేక తీర్పు రావడంతో ఆగ్రహంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు వివరించారు. కాకినాడ ఒకటవ పట్టణ పోలీసులు సూర్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి