నయనతారకు చీర కట్టు మంచి పేరు తెచ్చి ఉండొచ్చు. అయితే 'బికినీ' అవతారం ఎత్తిన తర్వాత చీరలన్నీ అటకెక్కించేసి ఉంటుంది. అందుకే అమ్మణికి ఓ చీర పంపితే గుళ్లూ గోపురాలకు వెళ్లేటప్పుడైనా కనీసం డ్రస్ కోడ్ పాటించాలనే విషయం గుర్తుకు వస్తుంది...అనే అభిప్రాయంతో హిందూ మక్కల్ కట్చి (హెచ్ఎంకె) అనే హిందూ ఆర్గనైజన్ ఉంది. ఇందుకు అనుగుణంగా ఆమెకు ఓ సఫ్రాన్ రంగు చీర కానుకగా కూడా పంపించింది. దక్షిణాది సంప్రదాయం గుర్తు చేసేందుకే నయనతారకు చీర పంపినట్టు కుంభకోణంలోని ఈ సంస్థకు చెందిన నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల నయనతార కేరళలోని భగవతి అమ్మన్ దేవాలయానికి ఆ ఆలయ సాంప్రదాయానికి విరుద్ధంగా సర్వార్ కమీజ్ ధరించి వెళ్లడం వివాదానికి దారితీసిన నేపథ్యంలో హెచ్ఎంకె ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట.నయనతారకు దేవుడన్నా, గుళ్లూ గోపురాలకు వెళ్లి మొక్కబడులు చెల్లించడమన్నా ఎంతో ఇష్టం. ఈ మధ్యనే ఆమె 'తులాభారం' వేసుకుని ఓ గుడిలోని దేవతకు కానుకలు సమర్పించుకుంది. ఇదే క్రమంలో గతవారం భగవతి అమ్మన్ కోవెలకు వెళ్లింది. ఆ గుడిలోకి వెళ్లాలంటే స్త్రీలు తప్పనిసరిగా చీర ధరించే వెళ్లాలి. అయితే ఆ విషయం తెలియని నయనతార సల్వార్ కమీజ్ తో వెళ్లడం నిర్వాహకులకు ఆగ్రహం తెప్పించింది. డ్రస్ కోడ్ సంగతి తనకు తెలియదనీ, మన్నించమనీ ఆమె వేడుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అయితే నయనతార మేనేజర్ అజిత్ కుమార్ మాత్రం అసలు అలాంటి వివాదమే తలెత్తలేదంటున్నారు. నయనతార డ్రెస్ విషయంలో ఎలాంటి వివాదం తలెత్తలేదనీ, ఆలయంలో నయనతారను చూసి కొందరు యువకులు టీజ్ చేసే ప్రయత్నం చేయడంతో కొద్దిపాటి వాదోపవాదాలు జరిగాయనీ ఆయన వివరణ ఇచ్చారు. నయనతారకు హిందూ మక్కల్ కట్చి పంపిన చీర మాటేమిటని అడిగితే 'నాకు గానీ, నయనతారకు గానీ ఇంతవరకూ ఎలాంటి పార్శిల్ అందలేదు' అని తేల్చిచెప్పారాయన
22, ఏప్రిల్ 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి