ఆర్జేడీ అధినేత, కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి రేసుకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మళ్లీ ప్రధాని కావాలనేం లేదని లాలూ వ్యాఖ్యానించారు. యూపీఏ కూటమి పక్షాలు ఎన్నికల తరువాత కలిసి కూర్చొని ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేస్తాయని ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించబడిన మన్మోహన్ సింగే యూపీఏ ప్రధానమంత్రి అభ్యర్థి కూడా అని గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటివరకు మన్మోహన్ సింగ్ తమ ప్రధాని అభ్యర్థి అని చెప్పిని లాలూ తాజాగా మాట మార్చారు.
బీహార్‌లో తన నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ చెరో దారిన వెళుతున్న నేపథ్యంలో.. లాలూ తాజాగా ప్రధాని అభ్యర్థి ఎవరో ఎన్నికల తరువాత యూపీఏ పక్షాలు నిర్ణయిస్తాయని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. యూపీఏ లౌకికవాద పక్షాల కూటమి. ఈ కూటమి ఒక్క కాంగ్రెస్‌కు చెందినదే కాదు. ఎన్నికలు పూర్తయిన తరువాత కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఇందులోని భాగస్వామ్య పక్షాలన్నీ సమావేశమవతాయని లాలూ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి