
నేతలు అందరికి ఆదర్శంగా ఉండాలి కానీ మజ్లిస్ నేతలకు మాత్రం అదేమీ పట్టడం లేదు. ముఖ్యంగా అసదుద్దీన్ ఒవైసీకి మరీనూ. దానికి పోలింగ్ రోజు జరిగిన సంఘటనే ఓ ఉదాహరణ. ఇప్పుడు ఏకంగా డీజీపినే టార్గెట్ చేసుకున్నాడు. రాష్ట్ర డీజీపీ మహంతి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఆరోపించారు. మహంతికి ఏమాత్రం ధైర్యమున్నా యూనిఫాం పక్కనబెట్టి తమతో తలపడాలంటూ ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై అసదుద్దీన్ మాట్లాడుతూ తొలివిడత పోలింగ్ సందర్భంగా గురువారం డీజీపీ పాతబస్తీలో గంటన్నరకు పైగా పర్యటించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. అలాగే టీడీపీకి చెందిన వ్యక్తితో డీజీపీ దాదాపు 25సార్లు మాట్లాడారని ఆయన ఆరోపించారు. మహంతి ఏకపక్షంగా వ్యవహరిస్తారని తాము ముందే పిర్యాధు చేసినా ఈసీ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. తొలివిడత పోలింగ్ రోజున సుల్తాన్‌షాహీ పోలింగ్‌బూత్ వద్ద తనపై దాడి జరిగిందని, ఆత్మరక్షణకోసమే తాను ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగానని ఆయన వివరించారు. ఇది ఆయన్ను అయన సమర్ధించుకునే తీరు. ఏంచేస్తాం రాజకీయాలు అలాంటివి.అందుకే అసదుద్దీన్ నాయక్ నహీ.. కల్నాయక్
కామెంట్‌ను పోస్ట్ చేయండి