ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ లో రవీంద్ర జడేజా బ్యాటింగ్లో రాణించకపోయినా, బౌలింగ్లో మాత్రం అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి ఆరు వికెట్లు దక్కించుకున్నాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో క్లార్క్ ను బౌల్డ్ చేసిన బాల్ పైనే ఆసక్తికరమైన చర్చ జరిగింది. 46వ ఓవర్లో జడేజా వేసిన బాల్ ను ఢిఫెన్స్ ఆడడానికి క్లార్స్ ప్రయత్నించాడు. కానీ, బ్యాట్ ను తప్పించుకుని వెళ్లి వికెట్లను పడగొట్టిందా బాల్. ఆ మ్యాచ్ కు కామెంటరీ చెప్పిన గవాస్కర్ అయితే, దాన్ని బాల్ ఆఫ్ ది సెంచరీగా ప్రశంసించాడు. హర్షాబోగ్లే మాత్రం ఆ విషయాన్ని చెప్పలేనని, కాకపోతే, చాలా సంవత్సరాల తర్వాత పడ్డ అద్బుతమైన బాల్ అని కొనియాడాడు. మరో కామెంటర్, ఆస్ట్రేలియా క్రికెటర్ హెడెన్ మాత్రం దాన్ని బాల్ ఆఫ్ ది సెంచరీగా ఒప్పుకోలేదు. అయితే, అది అద్భుతమైన బాల్ అని , దానికి ఎంత గొప్ప బ్యాట్స్ మెన్ అయినా ఔట్ కావాల్సిందేనని అన్నాడు. మరి మీరేమంటారు.. వీడియో చూసి అభిప్రాయం చెప్పండి..
uppal test లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
uppal test లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
6, మార్చి 2013, బుధవారం
అది బాల్ ఆఫ్ ది సెంచురీనేనా...?
Categories :
ball of the century . clarke . CRICKET . india vs australia . ravindra jadeja . sports . TOP . uppal test
ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ లో రవీంద్ర జడేజా బ్యాటింగ్లో రాణించకపోయినా, బౌలింగ్లో మాత్రం అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి ఆరు వికెట్లు దక్కించుకున్నాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో క్లార్క్ ను బౌల్డ్ చేసిన బాల్ పైనే ఆసక్తికరమైన చర్చ జరిగింది. 46వ ఓవర్లో జడేజా వేసిన బాల్ ను ఢిఫెన్స్ ఆడడానికి క్లార్స్ ప్రయత్నించాడు. కానీ, బ్యాట్ ను తప్పించుకుని వెళ్లి వికెట్లను పడగొట్టిందా బాల్. ఆ మ్యాచ్ కు కామెంటరీ చెప్పిన గవాస్కర్ అయితే, దాన్ని బాల్ ఆఫ్ ది సెంచరీగా ప్రశంసించాడు. హర్షాబోగ్లే మాత్రం ఆ విషయాన్ని చెప్పలేనని, కాకపోతే, చాలా సంవత్సరాల తర్వాత పడ్డ అద్బుతమైన బాల్ అని కొనియాడాడు. మరో కామెంటర్, ఆస్ట్రేలియా క్రికెటర్ హెడెన్ మాత్రం దాన్ని బాల్ ఆఫ్ ది సెంచరీగా ఒప్పుకోలేదు. అయితే, అది అద్భుతమైన బాల్ అని , దానికి ఎంత గొప్ప బ్యాట్స్ మెన్ అయినా ఔట్ కావాల్సిందేనని అన్నాడు. మరి మీరేమంటారు.. వీడియో చూసి అభిప్రాయం చెప్పండి..
5, మార్చి 2013, మంగళవారం
ఆస్ట్రేలియా పని అయిపోయిందా..?
ఉప్పల్ లోనూ ఆస్ట్రేలియాకు తిప్పలు తప్పలేదు. కనీసం చెన్నైలో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. కానీ, ఉప్పల్ మాత్రం ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలయ్యింది ఆస్ట్రేలియా. భారత్ గడ్డ పై వరసగా ఐదో టెస్ట్ ఓటమిని చవిచూసింది. నిరుడు ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్లో నాలుగు మ్యాచ్ లనూ గెలుచుకున్న కంగారూలకు.. ఇది శరాఘాతమే. ఈ సరిసీ్ లో ఇప్పటికే రెండు టెస్ట్ లను గెలుచుకున్న టీమ్ ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందుకోవడానికి రెడీ అయ్యింది. పైగా, ఉప్పల్ విజయం భారత క్రికెట్ చరిత్రలోనే రెండో అతిపెద్ద విజయం. కెప్టెన్సీపై విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీకి కూడా ఇది అతిపెద్ద ఊరట. భారత కెప్టెన్లలో అత్యధిక టెస్ట్ విజయాలు అధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు ధోనీ.
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రంగాల్లో దారుణంగా విఫలమైన క్లార్క్ సేన, తమ ఆటతీరును సమీక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఆస్ట్రేలియా విజయాలకు వెన్నుదన్నుగా ఉన్న పాంటింగ్ లాంటి వాళ్లు రిటైర్ అవ్వడంతో బలహీనపడ్డ ఆస్ట్రేలియా.. ఇప్పుడు విజయాల కోసం వెంపర్లాడుతోంది. జట్టును నడిపిస్తున్న క్లార్క్ మినహా నిలకడా రాణిస్తున్నవారు తక్కువే. వరసగా రెండు టెస్టుల్లోనూ ఓడిపోవడంపై స్వదేశంలోనూ ఆస్ట్రేలియా ప్లేయర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం పోరాటం కూడా చేయలేని పరిస్థితికి ఆసీస్ దిగజారడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)