ఓటు కు నోటు కేసులో ఏసీబీ వేస్తున్న అడుగులు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర ను అరెస్ట్ చేసిన ఏసీబీ.. ఇప్పుడు టీడీపీలో కీలక నేత.. చంద్రబాబు వారసుడు లోకేశ్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసు విచారణకు హాజరు కావాలంటూ.. లోకేశ్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఓటు కు నోటు డీల్ జరిగిన రోజు లోకేశ్ ఎవరెవరిని కలిశారన్నదానిపై ఏసీబీ కొండల్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. కీలక వివరాలను రాబట్టగలిగితే.. ఆ తర్వాత లోకేశ్ కూ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏసీబీ తాజా నోటీస్ వ్యవహారంపై అప్పుడు టీడీపీలో టెన్షన్ మొదలయ్యింది.
tdp లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఆగస్టు 2015, బుధవారం
లోకేశ్ పై తెలంగాణ ఏసీబీ నజర్
Categories :
acb . cash for vote . chandrababu . lokesh . POLITICS . tdp
Read more...
9, జూన్ 2015, మంగళవారం
బాబు సెంటిమెంట్‌ను రగిలిస్తున్నాడా?
Categories :
ANDHRA PRADESH . babu . cash for vote . chandrababu . maha sankalpam . POLITICS . revanth reddy . tdp
ఓటుకు నోటు వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆడియో టేపులు బయటపడడంతో బాబుపై కేసు నమోదు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. బాబును ఏ వన్ గా చేర్చాలంటూ ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు పదేపదే డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే స్టీఫెన్ సన్ తో బాబు జరిపిన ఫోన్ సంభాషణలు బయటకు పొక్కాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి అరెస్ట్ తో బిక్కచచ్చిపోయిన టీడీపీ నేతలను మరింత కుంగదీసింది ఈ వ్యవహారం. దీన్ని ఖండిస్తూ రకరకాల ప్రకటనలు చేసినా.. బాబు ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందన్న సంగతి మాత్రం అందరికీ అర్థమయ్యింది.
తెలంగాణలో చంద్రబాబుపై ఎక్కడ కేసులు నమోదవుతాయో అన్న అందోళనతో కొత్త స్కెచ్ ను అమలు చేయడంలో బిజీగా ఉన్నాయి తెలుగుదేశం శ్రేణులు. ఆంధ్రప్రదేశ్్లో ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నాయి. చంద్రబాబు ప్రతిష్ట దిగజార్చాయంటూ కేసీఆర్ పై కేసులు పెడుతున్నాయి. ఒకవేళ హైదరాబాద్లో చంద్రబాబుపై కేసు నమోదైతే.. ఈ పోలీస్ స్టేషన్లన్నింటి నుంచీ కేసీఆర్ కు నోటీసులు పంపించాలన్నది ఏపీ ప్రభుత్వ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది.
ఎన్నికల సమయంలో నోట్ల పంపిణీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటినుంచో తెరవెనుక జరుగుతున్న తతంగమే. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేనే లేదు. కాకపోతే.. చంద్రబాబు అండ్ కో ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అయితే.. ఈ కేసులో బాబు టీమ్ ఎంత హుందాగా ప్రవర్తిస్తే అంత ప్రతిష్ట పెరుగుతుంది. కానీ.. చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు సెంటిమెంట్ ను రగిలించే దిశగానే సాగుతున్నాయి. గుంటూరు మహాసంకల్పసభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. ఇది తనపై పెట్టిన కేసు కాదని.. ఐదుకోట్ల ఆంధ్రుల ప్రతినిధిపై పెట్టిన కేసంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బాబు చేసిన ప్రకటనలతో రెండు పార్టీల వ్యవహారం కాస్తా రెండు రాష్ట్రాల వివాదంగా మారిపోయింది. ఇప్పటివరకూ నీటికోసం, విద్యుత్ కోసం, విద్యావ్యవస్థలో ఆధిపత్యం కోసం కొట్టుకున్న రెండు రాష్ట్రాలు.. ఇప్పుడు ఓటుకు నోటు వ్యవహారంపైనా కయ్యానికి దిగేలా పరిస్థితి దిగజారింది.

8, అక్టోబర్ 2014, బుధవారం
కేసీఆర్ కన్నా ఓమెట్టు ఎక్కువే అంటున్న చంద్రబాబు
Categories :
ANDHRA PRADESH . babu . helicopter . POLITITCS . tdp
పరిపాలనలో, నిర్ణయాల్లో తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ కు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకరిని మించి మరొకరు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళుతున్నారు. ఏపీలో ఎన్టీఆర్ సుజల పథకం మొదలుపెడితే.. తెలంగాణలో ఏకంగా వాటర్ గ్రిడ్ కే రూపకల్పన చేశారు కేసీఆర్. ఏపీలో నదుల అనుసంధానంపై కసరత్తు జరుగుతుంటే.. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు పనులు మొదలవుతున్నాయి. రైతురుణమాఫీ విషయంలోనూ రెండు ప్రభుత్వాలూ ఒకే తరహా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ వార్ తాజాగా హెలికాప్టర్ల వరకూ వచ్చింది. కొత్త హెలికాప్టర్ను కొనుగోలు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే చంద్రబాబు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అయితే.. కేవలం హెలికాప్టర్ తోనే ఆగిపోకుండా, ఓ చిన్న సైజ్ విమానాన్ని కూడా కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఏపీ ఏవియేషన్ అకాడమీని ఆదేశించారు.
ప్రస్తుతం జిల్లాల పర్యటనకు జీఎంఆర్ కు చెందిన విమానాలు, హెలికాప్టర్లను చంద్రబాబు ఉపయోగిస్తున్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించడానికి హెలికాప్టర్ పూర్తిగా అనువుగా ఉండదు కాబట్టి, అలాంటి సమయాల్లో ఉపయోగించుకోవడానికి విమానాన్ని కూడా కొనుగోలు చేయనున్నారు.తాజా పరిస్థితి చూస్తుంటే.. ఇద్దరు సీఎంలకు దాదాపుగా ఒకే సమయంలో కొత్త హెలికాప్టర్లు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

13, సెప్టెంబర్ 2014, శనివారం
బాబు కోరిక తీరుతుందా..?
Categories :
ANDHRA PRADESH . capital . chandrababu . modi . POLITICS . tdp . vijayawada
సింగపూర్ తరహాలో ఏపీ రాజధాని నిర్మాణానికి కసరత్తును వేగవంతం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రాజధాని ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే ఓ సలహా మండలి, మరో సబ్ కమిటీ పనిచేస్తుండగా.. ఇటీవలే అంతర్జాతీయ కన్సెల్టెన్సీ మెకన్సీ నుంచి ఓ నివేదికను కూడా తెప్పించుకుంది. రాజధానిలో 40 అంతస్థుల భవనాలను నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆ నివేదికలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడలో కృష్ణానదికి ఇరువైపులా ప్రభుత్వ ఆఫీసులను ఏర్పాటు చేస్తూ.. మూడు ఫ్లై ఓవర్లను నిర్మించాలనీ రిపోర్ట్లో ఉన్నట్లు తెలుస్తోంది.
అన్ని రంగాల్లోనే అభివృద్ధిని సాధించిన హైదరాబాద్ కు ధీటుగా రాజధాని నిర్మాణం చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. హైదరాబాద్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఐదు దశాబ్ధాల్లో 15 లక్షల కోట్ల వరకూ ఖర్చుపెట్టాయంటున్న ఆయన.. అలాంటి నగరాన్ని ఇప్పటికిప్పుడు సృష్టించాలంటే.. కనీసం నాలుగైదు లక్షల కోట్లు ఖర్చవుతుందన్నారు. తిరుపతిలో జరిగిన ఆర్థికసంఘం సమావేశంలో దీనిపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో కేంద్రం సాయంగా లక్షా 2 వేల కోట్లను ఇవ్వాలని కోరారు. దీంతో పాటు, కేంద్రం దగ్గర రాష్ట్రానికి ఉన్న రూ. 10400 కోట్ల అప్పులను రద్దు చేయాలని, అప్పులు మరింతగా తెచ్చుకోవడానికి FBRM చట్టాన్ని సవరించాలని విజ్ఞప్తి చేశారు. మరి ఈ విజ్ఞప్తులకు కేంద్రం ఎంతవరకూ సహకరిస్తుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. రైతు రుణమాఫీ విషయంలో కేంద్ర సహకారాన్ని ఎంతో ఆశించిన బాబుకు.. చుక్కెదురయ్యింది. ఇప్పుడు రాజధాని వ్యవహారంలో కేంద్రం తీరు ఎలా ఉండొచ్చన్నదానిపై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది..

4, సెప్టెంబర్ 2014, గురువారం
ఏపీ రాజధాని ఎక్కడ?
Categories :
ANDHRA PRADESH . capital . chandrababu . guntur . mangalagiri . POLITICS . tdp . TOP . vijayawada
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నెలకొన్న ఉత్కంఠ మరికాసేపట్లో తొలిగిపోనుంది. ముహూర్తం ప్రకారం 12 గంటల 17 నిమిషాలకు ఏపీ సీఎం చంద్రబాబు , రాజధానిపై అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. అయితే, ఆయన నోటినుంచి ఏ ప్రాంతం పేరు వస్తుందన్నదే ఇప్పుడు మరింత టెన్షన్ రేకెత్తిస్తోంది.
విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని అంటూ చాలాకాలంగా చంద్రబాబు సహా టీడీపీ నేతలు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఈ ప్రాంతమైతేనే రాష్ట్రం మొత్తానికి మధ్యన ఉంటుందన్నది తెలుగుతమ్ముళ్ల అభిప్రాయం. అయితే.. ఈ రెండింటిని ఉమ్మడిగా రాజధానిగా ప్రకటిస్తారా.. లేక... రెండింటి మధ్యన ఉన్న మంగళగిరిని రాజధానిగా ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. అంతేకాదు, ఇక్కడ భూముల లభ్యత తక్కువగా ఉండడంతో, అమరావతిని గానీ, గన్నవరం, నూజివీడులను గానీ ప్రకటించవచ్చనీ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి లీకులనూ ఇవ్వలేదు చంద్రబాబు. దీంతో.. అసెంబ్లీలో ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారన్నది హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. రాజధాని పేరు నేరుగా చెప్పకుండా, విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేస్తామని, సలహాలు, అభిప్రాయాలను చెప్పమంటూ సభను చంద్రబాబు కోరవచ్చన్న వాదనా వినిపిస్తోంది. దీంతో పాటు.. కమిటీల బాబుగా పేరున్న టీడీపీ అధినేత ఈ విషయంలో మరో కమిటీ వేసినా ఆశ్చర్యం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)