రాజీనామాలపై ముందూ వెనుకా ఆలోచించిన సీమాంధ్ర మంత్రులు ఎట్టకేలకు పదవులను వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. మిగిలిన వారూ ఈ రాత్రి సీఎం కిరణ్ ను కలిసి రాజీనామాలు సమర్పిస్తారని ప్రచారం సాగుతోంది. అటు సీమాంధ్రకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. జేసీ దివాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, గాదె వెంకటరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వెంకట్రామయ్య, సుధాకర్, మురళీకృష్ణ, ఉగ్రనరసింహారెడ్డి శాసనసభ కార్యదర్శికి తమ రాజీనామా లేఖలు సమర్పించారు. మిగిలిన ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ కు తమ రాజీనామా లేఖలు ఇవ్వాలని నిర్ణయించారు. రాజీనామాలు చేయకుండా ప్రజల్లోకి వెళ్లలేమంటున్న నేతలు, సమైక్య ఉద్యమాన్ని ఇకపై ముందుండి నడిపిస్తామంటున్నారు. అటు రాయలసీమకు చెందిన నేతలు మాత్రం, విభజనతో రాయలసీమకు అన్యాయం జరిగిందని, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ తోనే కలిసి ఉంటామని చెబుతున్నారు. అటు సమైక్యం కావాలంటూనే, విభజన జరిగితే మాత్రం రాజధాని తమ ప్రాంతానికే కావాలంటూ పట్టుబడుతున్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడం ద్వారా కోస్తాకు మేలు చేస్తున్న కేంద్రం, సీమకూ ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
అటు ఈ రాజీనామాల వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం, ఇదంతా ముందే ఊహించామన్నారు. విభజన జరుగుతున్నప్పుడు ఇలాంటి భావోద్వేగాలు సహజమేనన్నారాయన. తెలంగాణపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని పరిస్థితిని చక్కదిద్దడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తామన్నారు దిగ్విజయ్
Read more...