కేసీఆర్ తొలి కేబినెట్ కొలువు దీరింది. పదకొండుమందికి తన కేబినెట్లో చోటు కల్పించారు కేసీఆర్. కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో పాటు, మేనల్లుడు హరీశ్ రావు కూ ఈ సారి మంత్రిపదవులు దక్కాయి. వీరితో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పద్మారావుకూ చోటు దక్కింది. మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమూద్ అలీ, సీనియర్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, జోగురామన్న, మహేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. ఇక ఉద్యోగ సంఘాల నేతల నుంచి ప్రజాప్రతినిధులుగా ప్రమోషన్ పొందిన శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ లలో ఏ ఒక్కరికీ అవకాశం దక్కలేదు. ఇక ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకూ ఈ కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కలేదు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మహమూద్ అలీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది.
ministers లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ministers లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
2, జూన్ 2014, సోమవారం
ఉద్యోగ నేతల్లేరు.. ఖమ్మం,పాలమూరుకు చోటు లేదు..
కేసీఆర్ తొలి కేబినెట్ కొలువు దీరింది. పదకొండుమందికి తన కేబినెట్లో చోటు కల్పించారు కేసీఆర్. కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో పాటు, మేనల్లుడు హరీశ్ రావు కూ ఈ సారి మంత్రిపదవులు దక్కాయి. వీరితో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పద్మారావుకూ చోటు దక్కింది. మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమూద్ అలీ, సీనియర్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, జోగురామన్న, మహేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. ఇక ఉద్యోగ సంఘాల నేతల నుంచి ప్రజాప్రతినిధులుగా ప్రమోషన్ పొందిన శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ లలో ఏ ఒక్కరికీ అవకాశం దక్కలేదు. ఇక ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకూ ఈ కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కలేదు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మహమూద్ అలీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది.
26, మే 2014, సోమవారం
మోడీ మంత్రులు వీళ్లే..
ఈ సాయంత్రం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్రమోడీ, తన మంత్రివర్గంలో మొత్తం 45 మందికి చోటు కల్పించారు. వీరిలో 24 మంది కేబినెట్ మంత్రులు, 11 మంది సహాయ మంత్రులు, మరో పదిమంది స్వతంత్ర హోదా గల మంత్రులున్నారు.
కేబినెట్ ర్యాంక్ మంత్రులు
రాజ్‌నాథ్ సింగ్
అరుణ్ జైట్లీ
నితిన్ గడ్కరీ
సుష్మా స్వరాజ్
వెంకయ్య నాయుడు
సదానంద గౌడ
ఉమా భారతి
నజ్మా హెప్తుల్లా
గోపీనాథ్ ముండే
రాం విలాస్ పాశ్వాన్
కాల్ రాజ్ మిశ్రా
మనేకా గాంధీ
అనంత్ కుమార్
రవి శంకర్ ప్రసాద్
అశోక్ గజపతి రాజు
అనంత్ గీతే
హర్ స్మిత్ కౌర్ బాదల్
నరేంద్ర సింగ్ తోమర్
జువాల్ ఓరమ్
రాధా మోహన్ సింగ్
తవార్ చంద్ గెహ్లాట్
సృతి ఇరానీ
హర్షవర్ధన్
ఈ జాబితాను ఇప్పటికే రాష్ట్రపతికి పంపించారు మోడీ. ఇక వీరిలో ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

1, ఆగస్టు 2013, గురువారం
మొదలయ్యింది రాజీనామాల ఆట
Categories :
congress . ministers . POLITICS . rayala seema . resigns . seemandhra . telangana . TOP
రాజీనామాలపై ముందూ వెనుకా ఆలోచించిన సీమాంధ్ర మంత్రులు ఎట్టకేలకు పదవులను వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. మిగిలిన వారూ ఈ రాత్రి సీఎం కిరణ్ ను కలిసి రాజీనామాలు సమర్పిస్తారని ప్రచారం సాగుతోంది. అటు సీమాంధ్రకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. జేసీ దివాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, గాదె వెంకటరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వెంకట్రామయ్య, సుధాకర్, మురళీకృష్ణ, ఉగ్రనరసింహారెడ్డి శాసనసభ కార్యదర్శికి తమ రాజీనామా లేఖలు సమర్పించారు. మిగిలిన ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ కు తమ రాజీనామా లేఖలు ఇవ్వాలని నిర్ణయించారు. రాజీనామాలు చేయకుండా ప్రజల్లోకి వెళ్లలేమంటున్న నేతలు, సమైక్య ఉద్యమాన్ని ఇకపై ముందుండి నడిపిస్తామంటున్నారు. అటు రాయలసీమకు చెందిన నేతలు మాత్రం, విభజనతో రాయలసీమకు అన్యాయం జరిగిందని, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ తోనే కలిసి ఉంటామని చెబుతున్నారు. అటు సమైక్యం కావాలంటూనే, విభజన జరిగితే మాత్రం రాజధాని తమ ప్రాంతానికే కావాలంటూ పట్టుబడుతున్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడం ద్వారా కోస్తాకు మేలు చేస్తున్న కేంద్రం, సీమకూ ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
అటు ఈ రాజీనామాల వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం, ఇదంతా ముందే ఊహించామన్నారు. విభజన జరుగుతున్నప్పుడు ఇలాంటి భావోద్వేగాలు సహజమేనన్నారాయన. తెలంగాణపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని పరిస్థితిని చక్కదిద్దడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తామన్నారు దిగ్విజయ్
Read more...

27, సెప్టెంబర్ 2012, గురువారం
మార్చ్ ను మంత్రులే నడిపిస్తారా?
తెలంగాణ మార్చ్ పై ఉత్కంఠ క్షణక్షణానికి పెరిగిపోతోంది. హైదరాబాద్ లో ఒక్కడిని కూడా అడుగుపెట్టనివ్వమని పోలీసులు కరాఖండీగా చెప్పేస్తే, సెప్టెంబర్ 30న ఆరునూరైనా కవాతు చేసి తీరతామని తెలంగాణ జేఏసీ చెబుతోంది. పోలీసులను అనుమతి కోరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మంత్రులే ముందుండి మార్చ్ కు అనుమతి ఇప్పించాలని డిమాండ్ చేసింది. బయో డైవర్సిటీ సదస్సు, నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో మార్చ్ వాయిదా వేసుకోవాలన్న హోంమంత్రి సబితారెడ్డి విన్నపాన్ని జేఏసీ ఇప్పటికే తిరస్కరించింది. దీంతో.. మార్చ్ కు మద్దతు పలకడం మినహా మరో ప్రత్యామ్నాయం మంత్రుల ముందు లేదు
ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, మంత్రి సుదర్సన్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. మార్చ్ పరిణామాలను చర్చించారు. తెలంగాణ మార్చ్ కు అనుమతి ఇస్తే శాంతి యుతంగా జరుగుతుందని భావించిన మంత్రులు.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పాలని చూస్తున్నారు.
మంత్రులొస్తే సమస్యే ఉండదు
ఓ రకంగా మంత్రులే ముందుండి మార్చ్ ను నడిపిస్తే.. ఎలాంటి సమస్యా రాకపోవచ్చు. నక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పై భారీ బందోబస్తు ఎలాగూ ఉంటుంది. శాంతియుతంగా ర్యాలీ చేసుకోమని పోలీసులు తెలంగాణవాదులను వదిలిపెడితే.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే సమస్యే ఉండదు. జిల్లాల నుంచి ఎవరూ రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టం ఎలాగూ చేస్తున్నారు. అలాంటప్పుడు హైదరాబాద్ వాళ్లుతప్ప మిగిలినవాళ్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాలీలో పాల్గొంటే వాళ్ల వెనుకే నిరసన కారులు కదులుతారు తప్ప.. ప్రత్యేకంగా ఆందోళనలకు దిగే అవకాశాలు ఉండవు.
నేతలను బలవంతంగా అరెస్టులు చేసినా, లాఠీ ఛార్జీలకు దిగినా, ముళ్లకంపలను అడ్డుగా పెట్టినా పరిస్థితి మరోలా ఉండొచ్చు. ఆ ఆగ్రహంలో ఆందోళనకారులు ఎంతకైనా తెగిస్తారు. మిలియన్ మార్చ్ సమయంలో జరిగింది అదే. ఇప్పుడున్న మార్గం.. మంత్రులే మార్చ్ ను శాంతియుతంగా నడిపించడం..
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)