ఊహించనివి.. కల కూడా కనని సన్నివేశాలను కళ్లముందు సాక్షాత్కరింప జేయడంలో మన తెలుగు హీరోలను మించిన వాళ్లే లేరు. అలాంటి సన్నివేశం ఇవాళ ఒకటి జరిగింది. అది కూడా దాదాపు మూడు దశాబ్దాల తెలుగు చరిత్రలో తొలిసారి చోటు చేసుకొంది. అదే.. నందమూరి హీరో సినిమా ఓపెనింగ్ కు మెగా ఫ్యామిలీ హీరో క్లాప్ కొట్టడం. ఎన్టీఆర్ హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో, బండ్ల గణేశ్ నిర్మిస్తున్న బాద్ షా షూటింగ్ ఇవాళ పూజాకార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రారంభమయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై తొలి సన్నివేశానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్ కొట్టారు. నందమూరి హీరోకు మెగా హీరో క్లాప్ కొట్టడం ఇదే తొలిసారి. రెండు కుటుంబాల మధ్య, ఇద్దరు అభిమానుల మధ్య ఎంతవైరం ఉందో తెలుగు సినీ ప్రేక్షక లోకానికి బాగానే తెలుసు. అయినా, అలాంటివేవీ లేవని, సినీకుటుంబంలో తామంతా ఒక్కటేనని చాటి చెప్పారు ఈ ఇద్దరు హీరోలు. ఈ అనుబంధం కలకాలం ఉండిపోవాలని ఆశిద్దాం..
Read more...
mega family లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
mega family లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
18, మార్చి 2012, ఆదివారం
నందమూరి, మెగాస్టార్ ఫ్యామిలీలు ఏకమయ్యాయా..?
Categories :
entertainment . mega family . ntr . ramcharan . tollywood . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
